గవర్నర్తో సీఎం చర్చలేంటి: పొన్నం
మిషన్ కాకతీయపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్‌తో సీఎం కేసీఆర్ జరిపిన చర్చలేమిటో ప్రజలకు చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో గవర్నర్‌తో కేసీఆర్ సమావేశం కావడంపై ప్రజల్లో అనేక అను మానాలు వస్తున్నాయన్నారు. నల్లధనంపైనే చర్చలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతున్నదన్నారు. రహస్య ఎజెండాను బహిరంగపర్చాలని పొన్నం డిమాండ్ చేశారు.
మంత్రులతో గవర్నర్ కాళ్లు మొక్కించడం అత్యంత దురదృష్టకరమన్నారు. మిషన్ కాకతీయలో ఎన్ని చెరువుల్లో పనులు జరిగారుు, ఎంత పని జరి గింది, మొత్తం ఎన్ని చెరువులు రాష్ట్రంలో ఉన్నాయనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై మంత్రి హరీశ్‌రావు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని పొన్నం సవాల్ చేశారు.