సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా కార్మికశాఖ కొన్ని సంస్కరణలు చేపట్టింది. కొత్త జిల్లాలు చిన్నవి కావడంతో కార్మికశాఖ ప్రస్తుతం ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ (డీసీఎల్) స్థాయిలను రద్దు చేసి కేవలం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఏసీఎల్) స్థాయి అధికారులను నియమించాలని నిర్ణయించింది. జిల్లాస్థాయి అధికారుల ఎంపిక, క్యాడర్ల ఏర్పాట్లు తదితర ప్రక్రియ పూర్తయింది. లేబర్ డిపార్టుమెంట్‌లో డీసీఎల్ స్థాయి అధికారులు 10 మంది, ఏసీఎల్ స్థాయి అధికారులు 10 మంది, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్(ఎఎల్‌వో) 99, సీనియర్ అసిస్టెంట్లు 36, జూనియర్ అసిస్టెంట్లు 21, సబార్డినేట్లు 31 మంది ఉన్నారు.
ఏ యే జిల్లాకు ఎవరెవరు వెళ్లాలనే దానిపై ఉద్యోగులకు కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దసరా రోజు నుంచి నూతన జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. నూతనంగా ఉద్యోగులెవరినీ చేర్చుకోకపోవడంతో ఉన్నవారితోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జూనియర్ అధికారులకు కొత్త జిల్లా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారుల విషయంలో కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నూతన జిల్లాల్లో ఎంప్లాయిమెంట్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించింది.
జిల్లా స్థాయిలో డీసీఎల్ పోస్టులు రద్దు
Published Sun, Oct 9 2016 3:35 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
Advertisement
Advertisement