మహిళా సాధికారతకు పాటుపడాలి
► దేశంలో మౌలిక సదుపాయాల కొరత ఆందోళనకరం
► సహకార వ్యవస్థల నిర్మాణమే దీనికి పరిష్కారం
► స్పష్టం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, హైదరాబాద్: విద్య, ఆర్థిక స్వావలం బనను ప్రోత్సహించడం, సంపూర్ణ సామ ర్థ్యాన్ని ఆవిష్కరించేలా అవకాశాలు కల్పిం చడం ద్వారానే మహిళా సాధికారత సాధ్య మవుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. మహిళా దక్షత సమితి స్థాపిం చిన బన్సీలాల్ మలానీ నర్సింగ్ కళాశాలను శనివారం ఇక్కడ ప్రారంభిం చారు. దేశ సగటు అక్షరాస్యత 74 శాత మైతే, మహిళల అక్షరా స్యత 65% కన్నా తక్కువ ఉండటం దురదృష్టకరమన్నారు. మహిళా సాధికారత దిశగా మరింత పాటుపడాలని పిలుపునిచ్చారు.
మౌలిక సదుపాయాలు శూన్యం..
దేశంలో ఆరోగ్య సంబంధిత మౌలిక సదు పాయాల కొరత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంతో పాటు ప్రభుత్వ, ప్రైవే టు భాగస్వాములతో కూడిన సహకార వ్యవస్థల నిర్మాణమే దీర్ఘకాలిక పరిష్కా రమని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి వంటి లక్ష్యాలను ప్రభుత్వం ఒక్కటే సాధించడం సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో సహకార వ్యవ స్థలు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయని రాష్ట్రపతి వివరించారు.
2.4మిలియన్ మంది నర్సుల లోటు..:
దేశంలో 2.4 మిలియన్ మంది నర్సుల లోటు ఉందని, ఇది ఆందోళన చెందా ల్సిన అంశమని ప్రణబ్ అన్నారు. 2009లో 1.65 మిలియన్ మంది నర్సులు ఉండగా 2015కు ఈ సంఖ్య 1.56 మిలియన్‌కు పడిపోయిందన్నారు. మహిళా సాధికారత దిశగా మహిళా దక్షత సమితి ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. సుమన్ కృష్ణకాంత్, ప్రొ. ప్రమీలా దండావతే, గోవా గవర్నర్ మృదుల సిన్హాల వంటి సమితి వ్యవస్థాపక సభ్యుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.