డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు గురువారం బంద్ పాటించాయి. మలక్‌పేట్, చంపాపేట్, దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్‌లో పరిధిలో అన్ని కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.ఈ సందర్భంగా కళాశాలల సిబ్బంది, విద్యార్థులు చంపాపేట చౌరస్తా నుంచి ఐఎస్ సదన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ రాక అసంపూర్తిగా జరుగుతుండటంతో కళాశాలలు నిర్వహించడం భారంగా మారాయని కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ ర్యాలీలో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
పైవేటు డిగ్రీకళాశాలల బంద్..
Published Thu, Sep 1 2016 6:55 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement