బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు
హైదరాబాద్ : ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరిస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల సంఘం ప్రతినిధులు తేల్చి చెప్పారు. సోమవారమిక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ... రెండేళ్లుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదన్నారు.
ఇప్పటికే రూ. 500 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత శనివారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.