Old arrears
-
ఆర్టీసీకి 600 కోట్ల అప్పు కావాలి
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఆదాయం పెరుగుతున్నా.. మరోవైపు గుట్టలా పేరుకుపోయి ఉన్న పాత బకాయిలు తీర్చటం ఆర్టీసీకి పెద్ద సవాల్‌గా మారింది. వీటిని తీర్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆర్థిక సాయం లేకపోవటంతో అనివార్యంగా అప్పులు తేవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రూ.2270 కోట్ల బ్యాంకు అప్పులు పేరుకుపోయాయి. మళ్లీ కొన్ని ఇతర బకాయిలు తీర్చేందుకు మరోసారి అప్పు తీసుకోబోతోంది. తాజాగా రూ.600 కోట్ల అప్పుల కోసం రెండు బ్యాంకులతో ఆర్టీసీ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇందులో ఎంత అప్పు మంజూరవుతుందో ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మంజూరైతే కనుక ఆర్టీసీ అప్పులు దాదాపు మూడు వేల రూ.కోట్లకు చేరువవుతాయి. హైకోర్టు ఆదేశంతో.... ఆర్టీసీలో ఉద్యోగుల సహకార పరపతి సంఘా(సీసీఎస్)నిది ప్రత్యేక స్థానం. ఆర్టీసీ నిధులతో ఏమాత్రం సంబంధం లేని ఈ సంస్థ పూర్తిగా ఉద్యోగుల జీతాల నుంచి కేటాయించే మొత్తంతో నడుస్తుంది. వేల రూ.కోట్ల నిధులతో ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పరపతి సంఘాల్లో ఒకటిగా వెలుగొందింది. అయితే ఆ తర్వాత నష్టాలు, అప్పులతో కునారిల్లుతున్న ఆర్టీసీ ఆ నిధిని సొంతానికి వాడేసుకోవటంతో ఆ పరపతి సంఘం కాస్తా కొరగాకుండా పోయింది. ఇప్పుడు దానికి వడ్డీతో కలుపుకొంటే దాదాపు రూ.900 కోట్లను ఆర్టీసీ బకాయిపడింది. ఎన్నిసార్లు కోరినా ఆ మొత్తం ఇవ్వకపోవటంతో ఇటీవల ఆ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మొత్తం బకాయిల్లో రూ.200 కోట్లను ఎనిమిది వారాల్లో చెల్లించాలని మధ్యంతర తీర్పు వెలువరించింది. ఇందులో తొలి వంద రూ.కోట్లు తొలి నాలుగు వారాల్లో చెల్లించాల్సి ఉండగా, తాజాగా ఆ గడువు పూర్తయింది. కానీ డబ్బు మాత్రం చెల్లించలేదు. త్వరలో ఈ కేసు మళ్లీ కోర్టు పరిశీలనకు రాబోతోంది. ఈలోపు డబ్బు చెల్లించని పక్షంలో కోర్టు ధిక్కారం అవుతుంది. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఆర్టీసీకి నెలకొంది. వేతన సవరణ బకాయిలు రూ.280కోట్లు మరోవైపు, 2015లో ప్రకటించిన వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో 50 శాతం మొత్తం ఇంకా చెల్లించలేదు. వాటికోసం చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మంత్రులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ బకాయి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆ మొత్తాన్ని కూడా త్వరలోనే చెల్లించనున్నట్టు మంత్రులు పేర్కొన్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. ఉప ఎన్నిక అయిపోయినా ఆ బకాయి అలాగే ఉండటంతో కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ బకాయి మొత్తం రూ. 280 కోట్లు కూడా చెల్లించాలని సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటికి సంబంధించి నిధులు ఆర్టీసీ వద్ద లేకపోవటంతో మరోసారి బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. కొత్త బస్సులకు అప్పులు ఇచ్చిన బ్యాంకులపైనే ఆశ ఇటీవలే కొత్త బస్సులు కొనేందుకు బ్యాంకుల సాయాన్ని తీసుకున్న ఆర్టీసీ మరోసారి అదే మార్గాన్ని ఎంచుకుంది. ఓ ఏడాది క్రితం వరకు ఆర్టీసీకి అప్పు ఇవ్వాలంటే బ్యాంకులు జంకే పరిస్థితి వచ్చింది. కానీ ఎండీ సజ్జనార్ తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలతో ఆర్టీసీ ఆదాయం మెరుగుపడింది. ఇప్పుడు రోజువారీ టికెట్ ఆదాయం సగటు రూ.14.50 కోట్లుగా ఉంటోంది. ఆర్టీసీ లాజిస్టిక్ ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఆర్టీసీపై బ్యాంకులకు మళ్లీ నమ్మకం పెరిగింది. కొత్త బస్సుల కోసం అడిగిన వెంటనే లోన్ ఇచ్చిన బ్యాంకులు ఈసారి కూడా సానుకూలతనే వ్యక్తం చేసినట్టు సమాచారం. -
ఓయూ లా కాలేజీ మెస్ మూసివేత
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ న్యాయ కళాశాల భోజనశాలను పూర్తిగా మూసి వేశారు. పాత బకాయిలతో పాటు ప్రస్తుతం చదవుతున్న విద్యార్థులు మెస్ చార్జిలను చెల్లించనందున మెస్ నిర్వహణ కష్టతరంగా మారిందని న్యాయకళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.పంత్‌నాయక్ తెలిపారు. ఏడాదికి ఒక్కొక్క విద్యార్థి రూ.30 వేలను చెల్లించాలన్నారు. గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో వంట సరుకుల కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. మెస్ బకాయిలు సుమారు కోటి రూపాయలకు పైనే ఉందన్నారు. అయితే విద్యార్థులు మాత్రం న్యాయ కళాశాల హాస్టల్ భవనంలోనే ఉంటున్నారని పేర్కొన్నారు. -
'ఆర్టీసీ బకాయిలను విడుదల చేయాలి'
ఒంగోలు : ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఒంగోలు డిపో కార్యదర్శి జి.మాధవరావు డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఎస్డబ్లూ్యఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ నష్టాలకు కారణం ప్రభుత్వ చర్యలేనన్నారు. అక్రమ రవాణాద్వారా ఆర్టీసీకి ఏడాదికి 2 వేల కోట్ల నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆర్టీసీకి డీజిల్‌పై టాక్స్ రద్దుచేయాలని, మోటార్ వెహికల్ ట్యాక్స్‌కు కనీసం 5 సంవత్సరాలు హాలిడే ప్రకటించాలన్నారు. టోల్గేట్ ఫీజు, వ్యాట్టాక్స్ మినహాయింపులు ఇచ్చి ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. నష్టాల పేరుతో గ్రామీణ ప్రాంత సర్వీసులు రద్దుచేయడం మానుకోవాలన్నారు. పనిభారం పెంపు పేరుతో ఇప్పటికే ప్రకాశం రీజియన్‌లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, చిత్తూరు రీజియన్‌కు డిప్యుటేషన్‌పై పంపిన కార్మికులను ప్రకాశం రీజియన్‌కు పిలిపించాలని కోరారు. అధికారులు కూడా దుబారా ఖర్చు తగ్గించుకొని ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజనల్ నాయకులు ఎస్కే మీరావలి, వీఎన్‌రెడ్డి, ఎస్కే మాబు, బి.వెంకట్రావు, ఎస్పి విజయ్‌కుమార్, షేక్ కబీర్, సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు
-
బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు
హైదరాబాద్ : ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరిస్తామని ప్రైవేట్ ఆస్పత్రుల సంఘం ప్రతినిధులు తేల్చి చెప్పారు. సోమవారమిక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ... రెండేళ్లుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికే రూ. 500 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత శనివారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో జరిపిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. -
‘ప్రైవేట్’ఆరోగ్యశ్రీ సేవలు బంద్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిల కోసం అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోనున్నాయి. కాగా, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఈ సేవలను కొనసాగిస్తామని ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం సాయంత్రం మరోసారి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించనున్నారు. -
‘ప్రైవేట్’ఆరోగ్యశ్రీ సేవలు బంద్
-
దుకాణం మూసేసినా.. పన్ను కట్టాల్సిందే!
* పాత బకాయిల వసూలుకు వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయం * వచ్చే నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ * పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.5,200 కోట్లు * మూతపడ్డ పరిశ్రమలు, సంస్థలపై సర్కార్ దృష్టి * వసూళ్లపై సీటీవోలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: మూతపడ్డ సంస్థల నుంచి రావలసిన వేల కోట్ల రూపాయల పాత బకాయిలను వసూలు చేయాలని వాణిజ్యపన్నుల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాత బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా ఉన్న సంబంధిత సంస్థలు, వ్యక్తుల నుంచి దాదాపు పదేళ్ల నుంచి రూ.5,200 కోట్లు బకాయిల రూపంలో రావలసి ఉందని ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఈ మేరకు మూతపడ్డ సంస్థలు, పరిశ్రమలతో పాటు దేశంలోని వివిధ కంపెనీలతో లావాదేవీలు జరిపి చేతులెత్తేసిన డీలర్ల వివరాలను సర్కిళ్ల వారీగా సంపాదించేందుకు ఇప్పటికే సీటీవోలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు సర్కిళ్లలోని సీటీవోల ద్వారా బకాయిలు వసూలు చేయాల్సి ఉంటుంది. కాగా రూ.5,200 కోట్ల బకాయిల్లో కేవలం హైదరాబాద్ నుంచే సుమారు రూ.4వేల కోట్ల వరకు రావలసి ఉందని సమాచారం. వ్యాట్‌కు ముందు.. తరువాత... దేశవ్యాప్తంగా 2005 ఏప్రిల్ నుంచి విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అమలులోకి వచ్చింది. అంతకు ముందు అమ్మకపు పన్ను వసూలు చేసేవారు. అయితే అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్ అమలైన సమయంలో అప్పటి వరకు ఉన్న బకాయిల గురించి అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. కొందరు డీలర్లు కూడా వ్యాట్ పరిధిలోకి రావడం ఇష్టం లేక వ్యాపారాలను మూసేసినట్లు ప్రకటించి, బకాయిలు చెల్లించలేదు. వ్యాట్ అమలులోకి వచ్చిన తరువాత కూడా కొన్ని పరిశ్రమలు, సంస్థలు తమ లావాదేవీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించకుండా పన్ను ఎగవేతకే ప్రాధాన్యమిచ్చాయి. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశ్రమలు, సంస్థల ద్వారా లావాదేవీలు జరిపిన వేలాది మంది డీలర్లు కూడా మూతపడ్డ కంపెనీ (క్లోజ్డ్ కేస్) ఖాతాలో చేరిపోయారు. మూతపడ్డ, ఖాయిలా పరిశ్రమల విషయంలో వాణిజ్యపన్నుల శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాట్‌కు ముందు, తరువాత ఇప్పటి వరకు మూతపడ్డ కేసుల ఖాతాలో రూ. 5,200 కోట్ల మేర పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ పాత బకాయిలపై అధికారులు సమీక్షించి, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల రావలసిన బకాయిలు మరో రూ. 4,000 కోట్ల వరకు ఉన్నప్పటికీ, వచ్చే నెల నుంచి స్పెషల్ డ్రైవ్ ద్వారా పాత బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగిస్తాం: కమిషనర్ వాణిజ్యపన్నుల శాఖకు వ్యాట్, ఇతర పన్నుల రూపంలో రావలసిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. మూతపడ్డ వ్యాపారాలు, సంస్థలు, కంపెనీలకు సంబంధించి బకాయిలు ఉన్నవారు వెంటనే సంబంధిత సీటీవోలను సంప్రదించి, పన్నులు చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం కింద తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడబోమన్నారు. -
పంటల నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ రూ. 147 కోట్లు
పాత బకాయిలు కలిపి విడుదలకు వ్యవసాయశాఖ విన్నపం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వడగండ్లతో రాష్ట్రంలో 2010 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ, ఉద్యానశాఖలకు జరిగిన నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు రూ. 147.77 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు వ్యవసాయశాఖ విన్నవించింది. జరిగిన నష్టం... ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మంగళవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌తో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని ఆర్ధికమంత్రికి విన్నవించారు. 2010 నుంచి ఈ ఏడాది జూన్ వరకు భారీ వర్షాలు, వడగండ్లు, అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు జరిగిన నష్టం కింద రూ. 86.56 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని ఆయన కోరారు. అలాగే 2012 నుంచి ఈ ఏడాది వరకు వ్యవసాయ పంటలకు జరిగిన నష్టానికి రూ. 61.21 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని కోరారు. అకాల వర్షాలతో 2014 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన పంటల నష్టానికి రూ. 23.90 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రూ. 21.92 కోట్లు విడుదల చేయాలన్నారు. 2013 ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో అకాల వర్షాలకు వరంగల్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉద్యాన పంటలకు జరిగిన నష్టానికి రూ. 39.74 కోట్లు విడుదల చేయాలన్నారు. తమ విన్నపం మేరకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావం నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నందున ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము అందితే వారికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఆర్థికశాఖకు ఈ విన్నపం చేశామన్నారు. -
చంద్రబాబు చిన్నచూపు
సాక్షి, కాకినాడ : చంద్రబాబు ప్రభుత్వం రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి పేరుకుపోయిన నీటితీరువా వసూలుకు ఆదేశాలు జారీ చేసింది. పంటకాలువలో నీటిని ఉపయోగించుకునే ప్రాంతాన్ని బట్టి తీరువా నిర్ణయిస్తారు. మొదటి రెండు పంటల కాలాన్నీ కలిపి ఒక ఫసలి అంటారు. జూలై 1 నుంచి 1424వ ఫసలి సీజన్ ప్రారంభమైంది. ఎకరాకు రబీలో రూ.200, ఖరీఫ్‌లో రూ.150 చొప్పున తీరువా వసూలు చేస్తుంటారు. పంటకాలం ముగిశాక రెండుపంటలకు సంబంధించి రూ.350 వసూలుకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తుంటారు. నీటితీరువాకు సంబంధించి ఏడాది వరకు ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. ఆ తర్వాత మాత్రం రూ.6 చొప్పున వడ్డీ వసూలుచేస్తుంటారు. ఏటా పేరుకుపోయే బకాయిలను ఆ ఏడాది కొత్తగా రూ.6 చొప్పున వడ్డీ లెక్కగట్టి నోటీసులిస్తుంటారు. గత ఐదేళ్లుగా రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పగబట్టినట్టు ఏటా వరదలు, తుపాన్లు విరుచుకుపడుతూనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సకాలంలో ఆదుకోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యం రైతుల పరిస్థితిని దయనీయంగా మార్చాయి. గత ఏడాది సుమారు 4 నెలలు సాగిన సమైక్య ఉద్యమం, అనంతరం వరుసగా జరిగిన ఎన్నికలతో నీటితీరువా వసూళ్లకు బ్రేక్ పడింది. దీంతో బకాయిలు కోట్లలో పేరుకు పోయాయి. ప్రస్తుతం పాతబకాయిలు (1422వ ఫసలి వరకు) రూ.20,98,53,000 ఉంటే వడ్డీ రూ.కోటి 33లక్షల 48వేల వరకు ఉంది. ఇక గడిచిన ఖరీఫ్-రబీ పంటకాల పు నీటితీరువా(1423 ఫసలి సీజన్) మొత్తం మరో రూ.11 కోట్ల 25 లక్షల 43 వేల వరకు ఉంది. అంటే వడ్డీతో సహా పేరుకుపోయిన పాత బకాయిలు, 1423 ఫసలి సీజన్‌తో కలిపి మొత్తం రూ.33 కోట్ల 57లక్షల 44 వేల వరకు ఉంది. ఈ బకాయిల మొత్తాన్ని వసూలు చేసే లక్ష్యంతో గ్రామ రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులిస్తున్నారు. అసలే పుట్టెడుకష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాల్సింది పోయి ఇలా పాత బకాయిలన్నీ చెల్లించాలని వేధించడం ఎంతవరకు సమంజసమని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా నాన్చుతున్న చంద్రబాబు ప్రభుత్వం నీటి తీరువా వసూలుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. డివిజన్ల వారీ బకాయిలిలా.. కాకినాడ డివిజన్లో పాత బకాయిలు రూ.4కోట్ల 26లక్షలుంటే వడ్డీ రూ.26.04లక్షల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి కోటి 89లక్షల 91వేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 40లక్షల 71వేల వసూలుకు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రాజమండ్రి డివిజన్లో పాత బకాయిలు రూ.కోటి 89లక్షల 15వేలుంటే వడ్డీ రూ.12లక్షల 49 వేలవరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.93లక్షల 67 వేలు కలుపుకొని రూ.2 కోట్ల 95లక్షల 31వేల వసూలుకు నోటీసులిస్తున్నారు.అమలాపురం డివిజన్లో పాతబకాయిలు రూ.3కోట్ల 50 లక్షలు, 22వేలుంటే వడ్డీ రూ.23 లక్షల 99 వేల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.3కోటి 15లక్షల 85వేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 90లక్షల 6 వేల వరకు ఉంది. రామచంద్రపురం డివిజన్లో పాత బకాయిలు రూ.5కోట్ల 74లక్షల 29వేలుంటే వడ్డీ రూ.35లక్షల 16వేలవరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.3కోట్ల 96లక్షల 58వేలు కలుపుకొని మొత్తం రూ.10 కోట్ల 06లక్షల 03వేల వరకు ఉంది. పెద్దాపురం డివిజన్లో పాత బకాయిలు రూ.5కోట్ల 43లక్షల 68 వేలుంటే వడ్డీ రూ.34లక్షల 84వేల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.కోటి 20లక్షల నాలుగువేలు కలుపుకొని మొత్తం రూ.6 కోట్ల 98 లక్షల 56 వేల వరకు ఉంది. రంపచోడపురం డివిజన్లో పాత బకాయిలు రూ.16లక్షల 33వేలుంటే వడ్డీ రూ.96వేల వరకు ఉంది. 1423 ఫసలికి సంబంధించి రూ.9లక్షల 48వేలు కలుపుకొని మొత్తం రూ.26 లక్షల 77 వేల వరకు ఉంది..