‘ప్రైవేట్’ఆరోగ్యశ్రీ సేవలు బంద్ | Aarogyasri scheme services stopped in private hospitals in telangana | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్’ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Published Sat, Oct 1 2016 8:38 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

‘ప్రైవేట్’ఆరోగ్యశ్రీ సేవలు బంద్

‘ప్రైవేట్’ఆరోగ్యశ్రీ సేవలు బంద్

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ పథకానికి సంబంధించిన పాత బకాయిల కోసం అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి.

దీంతో నేటి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోనున్నాయి. కాగా, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఈ సేవలను కొనసాగిస్తామని ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం సాయంత్రం  మరోసారి ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement