హైదరాబాద్: సైఫాబాద్ ఠాణా పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో నగర పోలీసులు ఆంక్షలు విధించారు. లిఖితపూర్వకమైన అనుమతి లేకుండా ఎటువంటి ఆందోళనలు, ర్యాలీలు చేపట్టవద్దని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఈ ఆంక్షలు ఈ నెల 17 ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్ 11వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ రెండు నెలల పాటు బహిరంగ సమావేశాలు, ఐదుగురు మించి వ్యక్తులు గుమికూడవద్దని, ఆయుధాల, బ్యానర్లు, ప్లకార్డులు తదితర వస్తువులు వెంట పెట్టుకోవద్దని కోరారు. ఇవి ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ 88 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
సెక్రటేరియట్ పరిధిలో నిషేధాజ్ఞలు
Published Sat, Sep 17 2016 7:35 PM | Last Updated on Sat, Sep 15 2018 8:38 PM
Advertisement
Advertisement