ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు
బీజేపీ నేత, మాజీ మంత్రి పురంధేశ్వరి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా పత్తికొండ ఇన్‌చార్జి నారాయణరెడ్డి హత్య అత్యంత దురదృష్ట కరమని, బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో ఆదివారం విద్యానగర్‌లో ఆమె భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో సమసిపోయిందనుకున్న ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెర మీదకు తీసుకురావడం విచారకరమన్నారు.