వినాయక మండపం విషయంలో గొడవ | quarrel between youths at vinayak mandap | Sakshi
Sakshi News home page

వినాయక మండపం విషయంలో గొడవ

Published Wed, Sep 16 2015 9:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

quarrel between youths at vinayak mandap

హైదరాబాద్: గణేశ్ మండపాల ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసిన సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు... అడిక్‌మెట్ బాలాజీనగర్‌కు చెందిన రామకృష్ణ (35) ప్రై వేట్ ఉద్యోగి. అతని ఇంటి పక్కనే ఓ మైనర్ బాలుడు (17) నివాసముంటున్నాడు.

బుధవారం రామకృష్ణ ఇంటి ఎదురుగా గణేశ్ మంపం ఏర్పాటుచేయడానికి వెళ్లాడు. దీంతో అక్కడ డ్రైనేజీ పైప్‌లేన్ ఉందని రామకష్ణ వారించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఇద్దరు నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement