అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. స్థానిక చక్రీపురం కాలనీకి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి పై అదే ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన వృద్ధుడు ఈ అఘయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి విషయం తల్లిదండ్రులకు తెలపడంతో.. ఆగ్రహించిన స్థానికులు వృద్ధుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగేళ్ల చిన్నారిపై..
Published Mon, Sep 19 2016 1:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement