
పీజీ డెంటల్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల
మొదటి మూడు ర్యాంకుల్లో మానస, పూజిత భావన, అశోక్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పీజీ (ఎండీఎస్) డెంటల్ కోర్సులో అడ్మిషన్లకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈనెల 6వ తేదీన నిర్వహించిన ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఇందులో టాపర్‌గా బి.మానస (నెల్లూరు నారాయణ డెంటల్ కళాశాల) నిలిచారు.
తరువాతి ర్యాంకుల్లో వరుసగా పూజిత భావన. పి.ఆర్. (కడప రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్), అశోక్ చాగంటి (సిబార్ డెంటల్ కళాశాల), బి.నీలిమ (ప్రభుత్వ డెంటల్ కళాశాల, హైదరాబాద్), కొల్లాబత్తుల కిరణ్ (విష్ణు డెంటల్ కళాశాల, భీమవరం), చింతమరెడ్డి శోభ (కడప, రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కళాశాల), అబుదూర్ రెహమాన్ (చెట్టినాడ్ డెంటల్ కళాశాల), ఎ.మానస (హైదరాబాద్ ప్రభుత్వ డెంటల్ కళాశాల), టి.స్రవంతి (కడప రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సెన్సైస్), మనీష సక్సేనా (ఆర్మీ డెంటల్ కళాశాల, సికింద్రాబాద్) మొదటి పది మందిలో నిలిచారు. మొత్తం 1,670 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 1,640 మంది హాజరయ్యారు. 1,134 మంది అర్హత సాధించారు.