హైదరాబాద్ : సోమాజిగూడలోని పీసీహెచ్ అనే రిటైల్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. వందల కోట్లలో ఎగనామం పెట్టింది. సంస్థ ఎండీ బలవిందర్ సింగ్‌తో పాటు మరో ఐదుగురి పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురు ఎస్‌బీఐ అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తేలడంతో వారిపై కూడా కేసు నమోదు చేసింది. సుమారు రూ.139 కోట్ల మేర బ్యాంకు రుణాలను ఇతర సంస్థలకు పీసీహెచ్ సంస్థ మళ్లించినట్లు సీబీఐ తేల్చింది. ఈ మేరకు 120బీ రెడ్ విత్, 420, 468, 471, 477ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment