అదనపు కేబినెట్ హోదాలపై గవర్నర్‌కు రేవంత్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించి కేబినెట్ హోదాలు, పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్‌కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో 18 మందికి మాత్రమే అవకాశం ఉండగా అదనంగా మరో 18 మందికి కేబినెట్ హోదాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గవర్నర్‌కు సోమ వారం లేఖ రాశారు.
రాజ్యాంగంలోని 164 (1ఎ)ప్రకారం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా కేబినెట్ స్థారుు హోదాలను ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభు త్వాలకు ఉందని, ఆ లెక్కన 119 మంది ఎమ్మెల్యేలకుగాను సీఎంతో కలిపి 18 మం దికి మించకుండా కేబినెట్ పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ మరో 18 మందికి కేబినెట్ హోదా ఇవ్వడంతో ఆ భారం ప్రజలపై పడుతుందన్నార