Cabinet Status
-
పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల పార్టీనే సుప్రీం
AP CM Jagan Mohan Reddy Announces Roadmap For 2024 Assembly Polls: వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకుగాను 175 ఎందుకు రాకూడదు? గతంలో కుప్పంలో మనం గెలవలేదు. కానీ కుప్పం మునిసిపాలిటీని గెలిచాం, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించాం. అలాంటిది వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఎందుకు గెలవలేం? చేయాల్సిన కార్యక్రమాలను సక్రమంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పక గెలుస్తాం. మనం ఒదిగి ఉంటూ ప్రజలకు చేసిన మంచిని చెప్పాలి. మీ దీవెనలు, ఆశీర్వాదం కావాలని కోరాలి. అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది. ప్రజలకు ఇంత మంచి చేసి గొప్ప గెలుపు ఎందుకు సాధించలేం? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల పార్టీనే సుప్రీం. పార్టీ పరంగా నిరంతరం దృష్టి, ధ్యాస ఉండాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లోనే చెప్పా. ఈ మూడేళ్లలో మనం ఏం చేశామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పే కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను నియమించామని, జిల్లాల ఇన్చార్జి మంత్రులను కూడా భాగస్వాములను చేశామని.. వీరందరినీ మంత్రులు గౌరవించాలని చెప్పారు. మనమంతా ఒకటే పార్టీ, ఒకటే కుటుంబం అని.. అందరూ కలసికట్టుగా పని చేయాలని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లుగా నియమించి కేబినెట్ హోదా కల్పిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వచ్చే రెండేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి మార్గ నిర్దేశం చేస్తూ మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు తమ కన్నా ఎక్కువ అనే భావనతో మంత్రులు ఉండాలని, ఎవరికైనా పార్టీనే సుప్రీం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మే నెల నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నామని, దీనికి అందరూ సన్నద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాల్సిందే ► రెండేళ్లలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం. మంత్రి పదవుల్లో ఉన్నవారు కూడా మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా తప్పనిసరిగా గడపగడపకూ కార్యక్రమం నిర్వహించాలి. మంత్రి అయినప్పటికీ ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారనే భావన ప్రజలకు కలగాలి. ప్రతి మంత్రీ దీన్ని గుర్తు పెట్టుకోవాలి. ► మంత్రి అయ్యాక మాకు ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చారనే పాజిటివ్ టాక్ మీకు ప్లస్ అవుతుంది. మంత్రులంతా కచ్చితంగా జిల్లా అధ్యక్షులతో, రీజినల్ కో ఆర్డినేటర్లతో పూర్తిగా అనుసంధానం కావాలి. మంత్రులుగా ఉన్నవారు తామే నాలుగు అడుగులు వెనక్కి వేసి మిగిలిన వారిని కలుపుకుని వెళ్లాలి. దీనివల్ల వారి పెద్దరికం పెరుగుతుంది. ► జిల్లా అధ్యక్షులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు తీసుకుంటున్న వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పార్టీని గెలిపించుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు మంత్రులుగా వస్తారు. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. ఇలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ► సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో నేరుగా నగదు బదిలీతో లబ్ధిదారులకు రూ.1.37 లక్షల కోట్లు అందజేశాం. వచ్చే రెండేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఇస్తాం. తద్వారా సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో దాదాపు రూ.2.50 లక్షల కోట్లు అందించినట్లు అవుతుంది. ► వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పని చేయాలి. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నాం. రెప్పపాటులో రెండేళ్లు పూర్తవుతాయి.. ► మనం అధికారంలోకి వచ్చి మూడేళ్లైంది. కళ్లు మూసుకుని తెరిచేలోగానే మిగిలిన రెండేళ్లు కూడా పూర్తవుతాయి. మనం వేగంగా అడుగులు ముందుకేయాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మనం అధికారంలో కొనసాగాలి అంటే.. అడుగులు కరెక్ట్‌గా వేయాలి. కిందటసారి వచ్చిన దానికన్నా మెరుగైన ఫలితాలు వచ్చే కార్యక్రమం చేయాలి. ► హోప్ అన్నది.. రియల్టీకన్నా.. చాలా బలమైనదని సాధారణంగా వింటాం. కానీ మొట్టమొదటిసారిగా రియాల్టీ కూడా చాలా బలమైనదని మనం నిరూపించాం. మేనిఫెస్టోలోని హామీలలో 95 శాతం మనం ఇప్పటికే నెరవేర్చాం. మొదటి మూడేళ్లు మేనిఫెస్టో అమలుపై దృష్టిపెట్టాం. ► రేపు లేదు అన్న ధోరణిలో వేగంగా మేనిఫెస్టోను అమలు చేస్తూ అడుగులు ముందుకేశాం. అందులో చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేశాం. గతంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం. డీబీటీ (నేరుగా నగదు బదిలీ) విధానాన్ని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అమలు చేశాం. ఇంత బలమైన ఫెర్ఫార్మెన్స్ చూపించి ఎన్నికలకు వెళ్లడం అన్నది చాలా అరుదుగా జరిగే సంఘటన. మే నుంచి గడపగడపకూ.. ► మే రెండో వారం నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రతి ఎమ్మెల్యే గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది సచివాలయాలను సందర్శించి ఒక్కొక్క సచివాలయం పరిధిలో 2 రోజులు పర్యటించాలి. ఆ రెండు రోజులు ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు పర్యవేక్షించాలి. ► గడపగడపకూ కార్యక్రమం తొలిదఫా పూర్తి కావడానికి దాదాపు 8–9 నెలలు పడుతుంది. అవినీతి, వివక్ష లేకుండా డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. వలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని చేస్తే ఎమ్మెల్యేలకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి ఇంటికీ ఏం మేలు జరిగిందనేది మీ దగ్గర సమాచారం ఉంటుంది. ► అక్కచెల్లెమ్మల పేరుమీద మీకు లెటర్స్ ఇస్తాం. ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం చేసిన మంచిని అందులో వివరిస్తాం. ఆ ఇంట్లో అమ్మఒడి, ఆసరా, చేయూత, పింఛన్, ఇళ్ల పట్టాలు.. ఇలా ఎప్పుడు ఏ పథకం ఇచ్చామన్నది అందులో తెలియచేస్తాం. ప్రతి ఇంటికీ వెళ్లి దేవుడి దయతో ఈ మంచి చేయగలిగామని ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి. రానున్న రెండేళ్లూ ఇలాంటి మంచి చేస్తామని చెప్పాలి. ► మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ప్రతి కుటుంబం ఆశీస్సులు పొందాలి. మూడేళ్లలో చేసిన మంచిని గుర్తు చేస్తాం. దాంతోపాటు మేనిఫెస్టోలో మనం ఇచ్చిన హామీలు, ఏవి అమలు చేశాం, ఏ స్థాయిలో అమలు చేశామన్న వివరాలతో.. నాడు–నేడు కింద గత సర్కారు ఏం చేసిందీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది.. అనే అంశాలపై మూడు కరపత్రాలు ఇస్తాం. వీటిని ప్రతి ఇంటికీ ఇచ్చి వాటి మీద వారే టిక్కులు పెట్టొచ్చు. ఈ సమావేశంలో ఉన్నవారికి ఇవన్నీ అదనపు బాధ్యతలు. మీ గ్రాఫ్‌ను పెంచుకోవడమే కాదు.. మీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌నూ పెంచుకోవాలి. మీరు సమర్థులని భావిస్తున్నా కాబ్టటి మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నా. బూత్ కమిటీల్లో 50 శాతం మహిళలు.. ► సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించినప్పుడు గడపగడపకూ పర్యటించడమే కాకుండా క్యాడర్‌ను ఏకం చేయాలి. సచివాలయంలో రెండు రోజుల పర్యటన కాగానే బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలి. బూత్ కమిటీలకు శిక్షణ అత్యంత ముఖ్యం. కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండాలి. కనీసం 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూడాలి. ► ఆ గ్రామంలో ఉన్న ప్రతి కమ్యూనిటీకి ప్రాతినిధ్యం కల్పించాలి. ఎవరినీ విస్మరించవద్దు. బూత్ కమిటీలో కనీసం 10 మంది ఉండాలి. అవసరం మేరకు పెంచుకోవాలి. 90 శాతం పథకాలను సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో మహిళలకే ఇస్తున్నాం. ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాం. కుటుంబాలు బాగుండాలనే మనం వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దుష్ట చతుష్టయంపై యుద్ధం ► మన యుద్ధం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 లాంటి చెడిపోయిన వ్యవస్థలతో కూడా యుద్ధం చేస్తున్నాం. వాళ్ల అజెండా వేరు. మనం దిగిపోయి చంద్రబాబు అధికారంలోకి రావాలన్నది వారి అజెండా. దీన్ని కౌంటర్ చేయాలంటే ప్రజలకు నిజాలేమిటో చెప్పాలి. స్థిరంగా ఇది కొనసాగాలి. ఎల్లో మీడియా తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ► రాబోయే రోజుల్లో ఎల్లో మీడియా ప్రతి ఎమ్మెల్యేనూ లక్ష్యంగా చేసుకుంటుంది. కట్టుకథలు అల్లి విష ప్రచారం చేస్తారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. వీరంతా దుష్టచతుష్టయం. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. అది జరగకముందే గ్రామాల్లోని మన క్యాడర్‌కు సరైన సమాచారాన్ని చేరవేయాలి. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. ► ఈ రోజు నుంచీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే తీరును పెంచుకోవాలి. ప్రాంతీయ సమన్వయకర్తలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు అందరూ ప్రజలకు సుపరిచితులే. ఎల్లో మీడియా ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు తప్పనిసరిగా మనమంతా ఖండించాలి. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. గ్రామ స్థాయిలో కూడా మనకు సోషల్‌మీడియా వారియర్స్ ఉండాలి. గడపగడపకూ పూర్తయ్యే సరికి ప్రతి గ్రామంలో సోషల్ మీడియా వారియర్స్ ఉండాలి. ఇందులో క్యాడర్ కూడా ఇన్వాల్వ్ కావాలి. ప్లీనరీలోగా సంస్థాగత నిర్మాణం ► జూలై 8న పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్నాం. ఈలోగా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, 50 శాతం మహిళలకు జిల్లా కమిటీల్లో స్థానం కల్పించాలి. ఎమ్మెల్యేల వద్ద నుంచి మండల కమిటీ అధ్యక్షుల జాబితా తీసుకోవాలి. గ్రామ కమిటీల అధ్యక్షులను కూడా తీసుకోవాలి. తర్వాత రీజనల్ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు వారి సహాయంతో మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. ► పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాల గురించి నిరంతర అనుసంధానం కోసమే ఈ ఏర్పాటు. కమిటీల ఏర్పాటులో తప్పులు, అలసత్వం లేకుండా చూసుకోవాలి. ఎమ్మెల్యేలను బలపరచడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. క్రియాశీలంగా కమిటీలు పనిచేయడానికే ఈ విధానం. ప్లీనరీ నాటికి కమిటీల ఏర్పాటు కావాలి. గడపగడపకూ పూర్తయ్యే నాటికి అంటే 8 నెలల పూర్తయ్యే సరికి బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి. మరింత సమర్థంగా సచివాలయాలు ► సచివాలయాల విధులపరంగా తీసుకోవాల్సిన మార్పులు చేర్పులపై ఎమ్మెల్యేలు సలహాలు ఇవ్వాలి. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సచివాలయాల సమర్థత మరింత పెరుగుతుంది. గ్రామాలకు వెళ్లినప్పుడు ఇప్పటికే నాడు–నేడు తొలిదశ కింద పనులు పూర్తి చేసుకున్న వాటిని ప్రారంభించి మిగిలిన స్కూళ్లలో రెండోదశ పనులకు శంకుస్థాపన చేయాలి. ► మూడేళ్లలో పెద్ద వ్యవస్థను సృష్టించాం. కార్పొరేషన్లు, ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు.. ఇలా ప్రతి ఎన్నికలోనూ గెలిచి పెద్ద వ్యవస్థను సృష్టించుకున్నాం. వీరందర్నీ క్రియాశీలం చేయాలి. ఇది జిల్లా అధ్యక్షుల బాధ్యత. ► వీరందరి సేవలనూ మనం ఉపయోగించుకోవాలి. దీనిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. జరిగిన మంచి గురించి ఎక్కువ మంది మాట్లాడేలా చేయగలగాలి. మనం చేసిన మంచి ప్రచారంలో ఉండాలి. దీని వల్ల పార్టీకి సానుకూల పవనాలు వీస్తాయి. వివిధ పార్టీ విభాగాలను చైతన్యం చేయాలి. -
భారీ మార్పులతో జంబో కేబినెట్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన టీమ్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. అనూహ్య మార్పులు, భారీ చేర్పులతో జంబో కేబినెట్‌ను తీర్చిదిద్దారు. కఠిన నిర్ణయాలతో సీనియర్ మంత్రులకు సైతం షాకిచ్చారు. వివిధ కారణాలతో ఏకంగా 12 మందికి ఉద్వాసన పలికారు. పలువురు జూనియర్లకు సీనియర్లుగా ప్రమోషన్ ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు. యూపీ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలు, సామాజిక సమీకరణాలు, పనితీరు, సంస్థాగత అవసరాలు ప్రాతిపదికగా భారీ కసరత్తు అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో సరికొత్త మంత్రి మండలిని కొలువుదీర్చారు. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78 కి చేరగా, గరిష్టంగా 81 మంది వరకు మంత్రులుగా ఉండవచ్చు. పదవి కోల్పోయిన మంత్రుల్లో సీనియర్లైన ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా ఉన్నారు. మొత్తం 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. తాజా మంత్రివర్గంలో మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియాలకు చోటు కల్పించారు. కరోనా రెండో వేవ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలకు ఆస్కారమిచ్చిన వైద్య, విద్యా శాఖల మంత్రులు డాక్టర్ హర్షవర్థ్దన్, రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ సహా మొత్తం 12 మందిని మంత్రివర్గం నుంచి తప్పించారు. వీరి రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే ఆమోదించారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోలేదన్న విమర్శలతో ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గుతోందన్న సంకేతాల నేపధ్యం ఈ భారీ ఉద్వాసనకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, దేశంలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వైద్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చేసిన పలు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 43 మంది ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏడుగురు మహిళలు సహా మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 36 మంది కొత్త వారు కాగా.. ఇప్పటికే స్వతంత్ర, సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డికి కేబినెట్ ర్యాంక్‌తో పదోన్నతి లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన నేతల్లో ఎం.వెంకయ్యనాయుడు తరువాత కిషన్‌రెడ్డి రెండో తెలుగు వ్యక్తి కావడం విశేషం. కాగా కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కొత్తగా పలువురు మహిళల చేరికతో మంత్రివర్గంలో మహిళల సంఖ్య 11కి చేరింది. తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్ ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. ఆయనను పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి నిష్క్రమిస్తున్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, జావదేకర్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం విశేషం. భాగస్వామ్య పక్షాలకు పదవులు అలాగే భాగస్వామ్య పక్షాలను కేబినెట్లో భాగం చేయడం ద్వారా ప్రాంతీయంగా, సామాజికంగా వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ, అప్నాదళ్ పార్టీలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడు రామచంద్రప్రసాద్ సింగ్, లోక్‌జనశక్తి లోక్‌సభాపక్ష నేత పశుపతి కుమార్ పారస్, అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవి దక్కింది. యూపీకి పెద్దపీట వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట దక్కింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సహాయ మంత్రుల్లో అత్యధికంగా యూపీ నుంచి ఏడుగురికి ప్రాతినిథ్యం లభించింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న బి.ఎల్.వర్మ, పం కజ్ చౌదరి, డాక్టర్ సత్యపాల్ సింగ్ భగేల్, భానూప్రతాప్ సింగ్ వర్మ, కౌశల్ కిశోర్, బి.ఎల్.వర్మ, అజయ్ కుమార్ మిశ్రాలతో పాటు అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు యూపీ నుంచి ప్రాతినిధ్యం దక్కింది. యూపీలో సోషల్ ఇంజనీరింగ్ యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ, దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. వారణాసికి పొరుగున ఉన్న మీర్జాపూర్ నుంచి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్నా దళ్ (ఎస్) అధ్యక్షురాలిగా ఉన్న అనుప్రియా పటేల్ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ విశ్వసిస్తోంది. కౌషల్ కిషోర్ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. భానూ ప్రతాప్ సింగ్ వర్మ కూడా షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా ఉన్నారు. పదోన్నతి వీరికే.. స్వతంత్ర హోదాలో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు, విద్యుత్తు శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే సింగ్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్న హర్దీప్సింగ్ పూరి, షిప్పింగ్ శాఖ మంత్రిగా ఉన్న మన్సుఖ్ ఎల్.మాండవీయలకు కేబినెట్ ర్యాంకు లభించింది. హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్‌రెడ్డికి, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్‌సింగ్ ఠాకూర్‌కు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న పర్షోత్తమ్ రుపాలాకు కేబినెట్ హోదా దక్కింది. క్రియాశీల నేతలకు పదవులు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్.మురుగన్‌కు సహాయ మంత్రి పదవి లభించింది. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న బి.ఎల్.వర్మనూ మంత్రిపదవి వరించింది. గుజరాత్‌కు పెరిగిన ప్రాతినిథ్యం.. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో గుజరాత్ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు, ముగ్గురికి సహాయ మంత్రి పదవులు దక్కడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ స్వరాష్ట్రం గుజరాతే. హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా కేబినెట్ ర్యాంకులు దక్కిన మన్సుఖ్ మాండవీయ ఇప్పటికే స్వతంత్ర మంత్రిగా, పర్షోత్తం రుపాలా సహాయ మంత్రిగా ఉన్నారు. బిహార్‌కు చెందిన ముగ్గురికి, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరికీ కేబినెట్ ర్యాంకులు దక్కడం విశేషం. ఇక కర్ణాటకకు నాలుగు పదవులు దక్కాయి. పనితీరు కోణంలో.. కోవిడ్ నేపథ్యంలో కొందరు మంత్రుల పనితీరు సవ్యంగా లేకపోవడం, విమర్శలకు ఆస్కారం ఇవ్వడం వంటి కారణాల నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు ప్రధాని పూర్తిస్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు భారీ కసరత్తు చేశారు. నెల రోజులుగా పలు దఫాలుగా పార్టీ, ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన సేకరించి మంత్రివర్గానికి కొత్త రూపు తెచ్చారు. పనితీరు మెరుగ్గా ఉండేందుకు యువతకు పెద్దపీట వేశారు. సివిల్ సర్వీసెస్ మాజీ అధికారులు, వృత్తి నిపుణులను కేబినెట్లో భాగం చేశారు. రాజకీయ కోణంలో.. సామాజిక సమీకరణాలపై పకడ్బందీగా కసరత్తు చేసినట్టు అవగతమవుతోంది. మొత్తం మంత్రిమండలిలో ఓబీసీ వర్గాలకు చెందిన వారు 27 మంది, ఎస్సీ వర్గానికి చెందిన 12 మంది, ఎస్టీ వర్గానికి చెందిన 8 మంది, మైనార్టీలు ఐదుగురు, 11 మంది మహిళలు ఉన్నారు. కేబినెట్ ర్యాంకుతో ఐదుగురు ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఎస్సీల్లో చమర్, ఖాతిక్, పాసీ, కోరి, మాదిగ, మహర్, అరుంధతియార్, మేఘ్వాల్, రాజ్బొన్షి, మథువా–నామశూద్ర, దంగర్ తదితర ఉపకులాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించారు. ఇక ఎస్టీల్లో గోండులు, సంతాల్, మిజి, తదితర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. మంత్రులుగా అవకాశం దక్కినవారిలో ఎక్కువ మంది తొలిసారి ఎన్నికైన వాళ్లే ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు కొత్తగా ఏడు మంత్రి పదవులు ఇచ్చి పెద్ద పీట వేశారు. హోంశాఖ సహాయ మంత్రిగా పిన్నవయస్కుడు నిశిత్ హోంశాఖ సహాయ మంత్రిగా నిశిత్ ప్రామానిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా మంత్రి వర్గ విస్తరణలో పిన్న వయస్కుడైన నిశిత్‌కు యువజన, క్రీడల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు. గత కేబినెట్లో సహాయ మంత్రులుగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌కు సమాచార ప్రసార శాఖతోపాటు క్రీడలు యువజన వ్యవహారాలు అప్పగించగా మాన్సుఖ్‌లాల్ మాండవీయకు ఆరోగ్యశాఖ అప్పగించారు. తాజా విస్తరణలో చొటు దక్కించుకున్న అశ్విని వైష్ణవ్‌కు కీలక రైల్వే శాఖతోపాటు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖలు అప్పగించారు. శంతను ఠాకూర్‌కు ఓడరేవులు, జలరవాణా సహాయమంత్రిగా మహిళల్లో అనుప్రియ పటేల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖసహాయ మంత్రిగా, భారతిప్రవీణ్ పవార్‌కు ఆరోగ్యశాఖసహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ తదితరులు -
ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్, విప్‌లకు క్యాబినేట్ హోదా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన సభ చీఫ్ విప్, విప్‌లకు క్యాబినేట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్‌లు బుడి ముత్యాల నాయుడు, దాడి శెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు క్యాబినేట్ హోదా దక్కింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు కూడా క్యాబినేట్ హోదా దక్కింది. -
‘కేబినెట్ హోదా ఇష్టారాజ్యం కాదు’
సాక్షి, హైదరాబాద్: పలువురు ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన పలు జీవోలను సవాలు చేస్తూ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శిలతోపాటు కేబినెట్ హోదా పొందిన బాలకిషన్, ఎ.కె.గోయల్, ఎ.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్.రెడ్డి, పేర్వారం రాములు, కె.ఎం.సహానీ, డాక్టర్ వేణుగోపాలచారి, రామచంద్రుడు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పిడమర్తి రవి, అల్లం నారాయణ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా కేబినెట్ హోదా ఇవ్వడానికి వీల్లేదని ఇంద్రసేనారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 164(1ఎ) విరుద్ధమని తెలిపారు. ఇదే విషయంపై పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి పిల్ దాఖలు చేశారని, ఆ తరువాత ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి వెళ్లిన తరువాత ఆ పిల్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరగా, ఇదే హైకోర్టు తిరస్కరించిందన్నారు. -
‘క్యాబినెట్ హోదా’కు మార్గదర్శకాలేమిటి?
చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి పూర్తి వివరాలను మా ముందుంచండి పిటిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ ఈ కేసులో సహకరించాలని ఏజీని కోరిన ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: వ్యక్తులకు క్యాబినెట్ హోదా ఇవ్వడానికి ఉన్న మార్గదర్శకాలు ఏమిటి? ఈ విషయంలో చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి? క్యాబినెట్ హోదా ఇవ్వడానికి వ్యక్తులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి? తదితర వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు సలహాదారులకు, కార్పొరేషన్ల చైర్మన్లకు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు క్యాబినెట్ హోదా ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని అధికరణ 164(1ఎ) ప్రకారం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రులు 15 శాతానికి మించి ఉండకూడదన్నారు. కావాల్సిన వారికి ఇష్టమొచ్చినట్లు క్యాబినెట్ హోదా ఇవ్వడానికి వీల్లేదని వివరించారు. గతంలో ఇదే విధంగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించినప్పుడు, ఆ నియామకాలను ఇదే హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, క్యాబినెట్ హోదా ఉన్న వారు మంత్రిమండలి సమావేశాల్లో పాల్గొంటారా? అంటూ ప్రశ్నించింది. వారు ఆ సమావేశాల్లో పాల్గొనరని, అయితే మంత్రులతో సమానంగా, వారికి జీతభత్యాలు, పలు సౌకర్యాలు ఉంటాయని రవిచందర్ వివరించారు. గతంలో కూడా ఇదే అంశంపై పిల్ దాఖలైందని, పిల్ దాఖలు చేసిన వ్యక్తి తరువాత అధికార పార్టీలో చేరిపోయారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అందుకే ఇటువంటి వ్యాజ్యాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు బదులు ప్రైవేటు ప్రయోజన వ్యాజ్యాలుగా భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగం నిర్దేశించిన దానికి మించి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. -
ఆ హోదాలు రాజ్యాంగ విరుద్ధం
అదనపు కేబినెట్ హోదాలపై గవర్నర్‌కు రేవంత్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించి కేబినెట్ హోదాలు, పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్‌కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో 18 మందికి మాత్రమే అవకాశం ఉండగా అదనంగా మరో 18 మందికి కేబినెట్ హోదాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గవర్నర్‌కు సోమ వారం లేఖ రాశారు. రాజ్యాంగంలోని 164 (1ఎ)ప్రకారం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా కేబినెట్ స్థారుు హోదాలను ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభు త్వాలకు ఉందని, ఆ లెక్కన 119 మంది ఎమ్మెల్యేలకుగాను సీఎంతో కలిపి 18 మం దికి మించకుండా కేబినెట్ పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ మరో 18 మందికి కేబినెట్ హోదా ఇవ్వడంతో ఆ భారం ప్రజలపై పడుతుందన్నార -
ఎన్నిసార్లు వాయిదాలు కోరతారు?
కేబినెట్ హోదా వ్యాజ్యంలో సర్కారు తీరుపై హైకోర్టు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహా దారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఇ చ్చిన కేబినెట్ హోదాను వెంటనే ఉపసంహరించుకునేలా ఆదేశాలివ్వాలం టూ దాఖలైన వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం పదేపదే వాయిదాలు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నిసార్లిలా వాయిదాలు కోరతారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డిని ప్రశ్నించింది. ఇకపై వాయిదా కోరితే సంబంధిత అధికారి వాయిదాకు రూ.3వేలు న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాల్సి ఉంటుందని రాతపూర్వకంగా హెచ్చరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి.. ఏజీ నగరంలో లేనం దున విచారణను వాయిదా వేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం.. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిందని, అన్నిసార్లూ ప్రభుత్వమే కోరిందన్నారు. -
ఎవరికి పడితే వారికా?
సాక్షి, హైదరాబాద్: ఎవరికైనా జీతభత్యాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, అయితే కేబినెట్ హోదా మాత్రం ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జీతభత్యాలు ఇవ్వడం వేరని, కేబినెట్ హోదా ఇవ్వడం వేరని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కల్పించిన కేబినెట్ హోదాను వెంటనే ఉపసంహరించుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. తగిన జీతభత్యాలు, కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేబినెట్ హోదా ఇచ్చామని, నిబంధనల మేరకే వ్యవహరించామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘సౌకర్యాలు.. జీతభత్యాలు ఏమైనా ఇవ్వండి.. మాకు సంబంధం లేదు. కానీ కేబినెట్ హోదా ఎవరికి పడితే వారికి, ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు. జీతభత్యాలు, సౌకర్యాలు వేరు. కేబినెట్ హోదా వేరు’’ అని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పడంతో ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. -
కేబినెట్ హోదాలు రాజ్యాంగ విరుద్ధం
* హైకోర్టులో ఎంపీ గుత్తా పిల్ * సలహాదారులు, ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు ఆ హోదా ఉపసంహరించాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించడం సరికాదని.. వెంటనే ఆ హోదాలను ఉపసంహరించుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ సీఎస్‌తో పాటు సాధారణ పరిపాలన, యువజన సర్వీసులు, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమశాఖల ముఖ్య కార్యదర్శులను, సలహాదారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వీరితోపాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు ఎస్.వేణుగోపాలచారి, రామచంద్రుడు తేజావత్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు, ఎస్సీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పిడమర్తి రవి, తెలంగాణ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ బాలకిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. మంత్రిమండలితో సంబంధం లేని వ్యక్తులకు కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని గుత్తా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఖజానాకు భారం.. కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులకు పే స్కేల్, ఉచిత గృహ వసతి, వైద్య సదుపాయాలు, సెక్రటేరియల్ స్టాఫ్, వాహనభత్యం, టెలిఫోన్, పన్ను మినహాయిపులు, ఎస్కార్ట్ తదితర సౌకర్యాలు ఉంటాయని, ఇవన్నీ రాష్ట్ర ఖజానాపై భారం మోపుతాయని గుత్తా తన పిటిషన్లో వివరించారు. కేబినెట్ అన్న పదం కేవలం మంత్రులకు మాత్రమే వర్తిస్తుందని, రాజ్యాంగంలోని అధికరణ 164(1) ప్రకారం మొత్తం సభ్యుల్లో కేబినెట్ మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు నచ్చిన వ్యక్తులకు కేబినెట్ హోదా కల్పించవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని.. సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు కల్పించిన కేబినెట్ హోదాను ఉపసంహరించుకునే ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించే అవకాశం ఉంది. -
పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మాజీ డిజీపీ పేర్వారం రాములు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రాములుకు కేబినెట్ హోదా కల్పించింది. కాగా రాములు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
రసమయికి కేబినెట్ హోదా
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.