letter to governor
-
మమత X గవర్నర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో గవర్నర్ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మమత మండిపడ్డారు. ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అధికారిక ప్రకటనలను, లోగోలను వాడరాదని గవర్నర్‌ను కోరారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తూ గవర్నర్ ధన్కర్ గత వారం ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు. వీటికి బదులిస్తూ సీఎం మమతా బెనర్జీ శనివారం గవర్నర్‌కు 14 పేజీల లేఖ రాశారు. ‘ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ రాసిన లేఖ, అందులో వాడిన భాష, భావం, తీరు అనూహ్యం. నాపైన, మా మంత్రులు, అధికారులనుద్దేశించి మీరు వాడిన భాష ఏమాత్రం తగినది కాదు’అని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను ఆచరించకుండానే ఆయన రాజ్యాంగ విలువలను బోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమకు బలం ఉన్నంత వరకు ఇలాంటివి చేయడం మినహా గవర్నర్‌కు అధికారాలేవీ లేవన్నారు. సంక్షోభ సమయంలో అధికారం చెలాయించేందుకు ఆయన చేస్తున్న యత్నాలను అడ్డుకుంటామన్నారు. -
చనిపోయేందుకు అనుమతి కోరారు..
సాక్షి, ముంబయి : తమ పంటలకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించకపోవడంతో తమకు కారుణ్య మరణాన్ని అనుమతించాలని మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాకు చెందిన 91 మంది రైతులు కోరారు. గవర్నర్, సబ్‌డివిజనల్ మేజిస్ర్టేట్లకు ఈ మేరకు వారు లేఖ రాశారు. తమ పంటలకు సరైన ధర లేదని, జాతీయ రహదారి కోసం ప్రభుత్వం తమ భూములను సేకరించి సరైన పరిహారం చెల్లించలేదని లేఖలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేనందున తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని అభ్యర్థించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ జీవించే అవకాశం ఎంతమాత్రం లేని రోగులకు వారు కోరితే కారుణ్య మరణాన్ని అనుమతించవచ్చని ఇటీవల సుప్రీం కోర్టు పేర్కొన్న విషయం విదితమే. అయితే రైతుల దీనస్థితికి వారి లేఖలు అద్దం పడుతున్నాయని, చనిపోయేందుకు వారు అనుమతి కోరుతున్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ, విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, స్వామినాధన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర రైతులు ఇటీవల ముంబయి వరకూ మహాప్రదర్శన చేపట్టారు. రైతుల డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. -
శశికళను కలవడంపై అభ్యంతరం, స్టాలిన్ లేఖ
-
శశికళను కలవడంపై అభ్యంతరం, స్టాలిన్ లేఖ
చెన్నై: తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు డీఎంకే కోశాధికారి ఎం.కె.స్టాలిన్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సులర్లు శశికళను కలవడంపై ఆయన ఆ లేఖలో అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ పదవిలో లేని వ్యక్తిని వీసీలు ఎలా కలుస్తారని స్టాలిన్ లేఖలో ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు. కాగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. పెద్దగా తర్జనభర్జన అవసరం లేకుండానే ముఖ్యమంత్రి పదవి పన్నీర్‌సెల్వాన్ని వరించింది. జయ రెండుసార్లు జైలు కెళ్లినపుడు పన్నీర్సెల్వంకే సీఎం బాధ్యతలు అప్పగించడంతో ఆమె అభీష్టానికి అనుగుణంగా పన్నీరుకే పట్టం కట్టారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి జయలలిత నెచ్చెలి శశికళకే అప్పగించేందుకు రంగం కూడా సిద్ధమైంది. ఇందుకు శశికళ సైతం మౌనమే అంగీకారంగా వ్యవహరిస్తున్నారు. అలాగే పన్నీర్‌సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ పోయెస్‌గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మ దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు శశికళను కలవడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
ఆ హోదాలు రాజ్యాంగ విరుద్ధం
అదనపు కేబినెట్ హోదాలపై గవర్నర్‌కు రేవంత్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించి కేబినెట్ హోదాలు, పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్‌కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో 18 మందికి మాత్రమే అవకాశం ఉండగా అదనంగా మరో 18 మందికి కేబినెట్ హోదాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గవర్నర్‌కు సోమ వారం లేఖ రాశారు. రాజ్యాంగంలోని 164 (1ఎ)ప్రకారం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా కేబినెట్ స్థారుు హోదాలను ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభు త్వాలకు ఉందని, ఆ లెక్కన 119 మంది ఎమ్మెల్యేలకుగాను సీఎంతో కలిపి 18 మం దికి మించకుండా కేబినెట్ పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ మరో 18 మందికి కేబినెట్ హోదా ఇవ్వడంతో ఆ భారం ప్రజలపై పడుతుందన్నార