వారికి కేబినెట్ హోదా తగదు
• ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లపై రేవంత్
• హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, బాలకిషన్, విద్యా సాగర్‌రావు, ఎ.కె.గోయల్, ఎ.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్. రెడ్డి, దేవులపల్లి ప్రభాకరరావు, పేర్వారం రాములు, కె.ఎం.సహానీ, డాక్టర్ వేణుగో పాలాచారి, రామచంద్రుడు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పిడమర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్‌రెడ్డి,కొప్పుల ఈశ్వర్‌ను ప్రతివాదులు గా చేర్చారు.
15 శాతానికి మించరాదు...
ప్రభుత్వం తమకు కావల్సిన వారికి కేబినెట్ హోదా కల్పించిం దని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 164 (1ఎ)కు విరుద్ధమని రేవంత్ పేర్కొన్నారు. ఈ అధికరణ ప్రకారం మొత్తం సభ్యుల్లో కేబినెట్ మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదన్నారు. కేబినెట్ హోదాతో సలహాదారులను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదన్నా రు. రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ 2న విద్యాసాగర్‌రావుతో సహా ఆరుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నా రు. తాను లేవనెత్తిన అంశాలను పరిగణ నలోకి తీసుకుని.. కేబినెట్ హోదా జీవోలను రద్దు చేయాలని రేవంత్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు.