హక్కుల సాధనకు బీసీలు ఏకం కావాలి | Rights must unite to accomplish BC | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు బీసీలు ఏకం కావాలి

Published Sun, Apr 12 2015 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

Rights must unite to accomplish BC

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
రవీంద్రభారతిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు

 
సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తర గతులకు చెందిన వారంతా ఏకమై ముందుకు సాగితేనే వారి హక్కులు, ఆశయాలు నెరవేరుతాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అణ గారిన వర్గాల అభ్యున్యతికై 19వ దశాబ్దంలోనే మహత్మ జ్యోతిరావు పూలే ఎంతగానో పోరాడారని చెప్పారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జ్యోతిబా పూలే 189వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. కుల వృత్తులు చేసుకునే బీసీ యువతకు నైపుణ్యాన్ని అందించడం, చదువుకోని పిల్లలను బడికి పంపించడం ద్వారా జ్యోతిబా పూలేకి నివాళి అర్పించనట్లవుతుందన్నారు.

కార్మిక శాఖ తరపున దేశవ్యాప్తంగా ఒకేషనల్ శిక్షణా సంస్థలను ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. అణ గారిన వర్గాల కోసం పోరాడి న మొదటి తరం ఉద్యమ కారుడు జ్యోతిబా పూలే అన్నారు. అటువంటి ఉద్యమ కారుడు తరానికి ఒకరైన ఉంటే భారత దేశ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. జ నాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. బీసీ విద్యార్థుల కోసం ఈ ఏడాది మూడు గురుకుల పాఠశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాలను నెలకొల్పామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో పోటీపరీక్షలకు శిక్షణ నిరంతరం జరిగేలా వాటిని బలోపేతం చేస్తామన్నారు. బీసీ హాస్టళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ బెడ్స్, సురక్షిత తాగునీరు, సోలార్ విద్యుత్.. తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. తరాలు మారినా కనిపించని విధంగా బీసీలు దోపిడికి గురవుతూనే ఉన్నారన్నారు.

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.బీసీలకు కూడా ఉప ప్రణాళిక, కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రాజయ్య యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్ , పద్మారావు, ఎంపీలు విహెచ్ హనుమంతరావు, కె.కేశవరావు, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార ్యదర్శి టి.రాధ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement