Union Minister Bandaru Dattatreya
-
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో విశేష ప్రజాదరణ పొందిన బీజేపీ.. ఇక తెలంగాణలోనూ బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. యూపీ ఫలితాలే బీజేపీపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మున్ముందు తెలంగాణలోనూ పార్టీని పటిష్టపరచడానికి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హైదరాబాద్‌లో సమావేశం కానున్నట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. గోదావరి ఖనిలో బొగ్గు గని కార్మికులకు పీఎఫ్, పింఛన్లు సకాలంలో అందడానికి కోల్ ఇండియాకు సంబంధించిన సబ్ రీజినల్ ఆఫీస్‌ను అక్కడ ఏర్పాటు చేసి, రీజినల్ ఆఫీసును హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీబీనగర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయండి.. యాదాద్రి భువనగిరిలో 550 పరిశ్రమల్లో సుమారు 22 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడానికి చౌటుప్పల్ లేదా బీబీనగర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయను ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రితో ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై వినతి పత్రాన్ని సమర్పించారు. -
ఓట్ల కోసమే ముస్లిం రిజర్వేషన్లు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం సాక్షి, కొత్తగూడెం: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను తెరపైకి తెచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్ అన్నారు. రెండు రోజులపాటు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమైనందున బీజేపీ రాజకీయంగా, న్యాయపరంగా దీనిని అడ్డుకుంటుంద న్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలు సరికాదు జల్లికట్టుపై ఎంఐఎం పార్టీ వివాదం చేయడం సరికాదని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. జల్లికట్టుపై ఆందోళనలు తమిళుల సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. దీనిపై హిందూత్వానికి పెద్దదెబ్బ, వీహెచ్‌పీ వారికి చెంపపెట్టు అని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించడం చూస్తే.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దు సాహసోపేతం: దత్తాత్రేయ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మక, సాహసోపేతమైనదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. నగదు రహిత లావాదేవీలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఉద్దేశించినవని, పేద ప్రజలకు, దళితులకు, గ్రామీణులకు, రైతులకు, మహిళలకు ఎంతో ఉపయోగకరమని, దీనిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని అన్నారు. దేశంలో పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక కార్యకలాపాలు ఈ నిర్ణయం వల్ల జరుగుతాయని పేర్కొన్నారు. తొలిరోజు సమావేశంలో శాసనసభ పక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి, శాసన మండలిపక్ష నాయకుడు ఎన్.రాంచందర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, వ్యవహారాల పర్యవేక్షకుడు కృష్ణదాస్, జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రికి వినతి
రుద్రంపూర్: పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బీఎంఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తదనంతరం బీఎంఎస్ నాయకులు మంత్రికి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార మెడికల్ సిబ్బందికి క్యాడర్ స్కీంను కోలిండియాలో అమలు చేస్తున్నారని, కానీ సింగరేణిలో మాత్రం అమలు చేయటం లేదని, ఫలితంగా వారు కొంత కాలంగా ఉద్యోగోన్నతులు లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని, అంతేకాకుండా నర్స్‌గా అపాయింట్ అయిన వారు నర్స్గానే పదవీవిరమణ పొందాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో గిరిజన బ్యాక్లాగ్ 665 బదిలీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మీ సమస్యలపై సంబంధిత అ«ధికారులకు లేఖలు రాయించి వీలైనంత త్వరలో మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీఎంఎస్ కార్యదర్శి మాధవ నాయక్, చింతల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'సెప్టెంబర్ 17' విమోచనమా? విలీనమా?
-
'సెప్టెంబర్ 17' విమోచనమా? విలీనమా?
హైదరాబాద్: 'నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో కలిసిపోవడం గొప్ప పరిణామమే. అయితే 17 తర్వాతి రోజుల్లో అమాయక ముస్లింలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఇప్పుడు మనం సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకొంటే కొందరిని బాధపెట్టినవాళ్లమవుతాం. అసలు జరుపుకోకుండా ఉంటే చరిత్రను మరిచిపోయినట్లే లెక్క. అందుకే సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటించాలని కోరుకుంటున్నాం' అని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరామ్ ఈ మేరకు జేఏసీ అభిప్రాయన్ని వ్యక్తపరిచారు. కాగా, బీజేపీకి చెందిన వక్తలు మాత్రం.. నిజాం పాలనకు ఫుల్ స్టాప్ పడిన సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచన దినమే అని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్ విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కేంద్ర మంత్రి దత్తాత్రేయ చొరవతీసుకోవాలని కోరారు. అయితే ఈ విషయంలో జేఏసీ ఉద్యమాన్ని చేపట్టబోదని స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జస్టిస్ నర్సింహారెడ్డి, సినీకవి సుద్దాల అశోక్ తేజ, పలువురు సామాజికవేత్తలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
చరిత్రను దాచలేం..
సెప్టెంబర్ 17ను రాజకీయ కోణంలో చూడొద్దు నాటి వీరోచిత పోరాట గాథలు భావి తరాలకు తెలియాలి కేసీఆర్ కూడా ఉమ్మడి పాలకుల వైఖరినే అనుసరిస్తున్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హన్మకొండ: సెప్టెంబర్ 17ను రాజకీయ కోణంలో చూడొద్దని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చరిత్రను కాదనలేము.. దాచలేమని అన్నారు. నాటి వీరోచిత పోరాటాలు, గాథలు భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిజాం పాలనలో జరిగిన ఘోరాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా కుల, మత, భాష, సాంప్రదాయాలకు అతీతంగా ప్రజలు పోరాడారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొమురం భీం, వందేమాతరం రాంచందర్‌రావు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్ వంటి ఎందరో అశువులు బాశారని చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారంతా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఆ రోజున టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగుర వేస్తున్న నాయకులు.. అధికారికంగా చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల్లాగే ప్రస్తుత సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను, చరిత్రను గౌరవించాలని సూచించారు. నిజాంపై సైనిక చర్యను వ్యతిరేకించి కమ్యూనిస్టులు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని దత్తాత్రేయ ఆరోపించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా అధికారికంగా నిర్వహించాలని కోరితే కొందరు నాయకులు దీనికి మతం రంగు పులుముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ యాత్ర తెలంగాణలో ఈ నెల 17న ముగుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా హన్మకొండలో జరిగే ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అమిత్‌షా పర్యటన పై రూపొందించిన పాటల క్యాసెట్, పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. పాటల సీడీని రూపొందించిన నాగపురి రాజమౌళిని సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, రావు పద్మ, డాక్టర్ విజయలక్ష్మి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, ఒంటేరు జయపాల్, నాగపురి రాజమౌళి, వంగాల సమ్మిరెడ్డి, బన్న ప్రభాకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, శ్రీరాముల మురళీమనోహర్, లక్ష్మణ్‌నాయక్, గుజ్జ సత్యనారాయణ రావు, సురేష్, రఘునారెడ్డి పాల్గొన్నారు. బహిరంగ సభ ప్రచార రథాలు ప్రారంభం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొననున్న బహిరంగ సభ విజయవంతానికి ఆ పార్టీ అనేక రూపాల్లో ముందుకు పోతోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్, పార్టీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రులు సాద్వి నిరంజన్, బండారు దత్తాత్రేయ డివిజన్ స్థాయిలో నిర్వహించిన తిరంగయాత్ర సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా పాల్గొననున్న బహిరంగ సభపై విస్తృత ప్రచారం చేయడానికి రూపొందించిన 14 ప్రచార రథాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దత్తాత్రేయ ప్రారంభించారు. అంతకు ముందు ఇదే స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభ వేదికకూ భూమి పూజ చేసి చేశారు. -
అసంఘటిత కార్మికులందరికీఈఎస్‌ఐ సేవలు
- ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులు - కేంద్రమంత్రి దత్తాత్రేయ వెల్లడి హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ పథకం వర్తింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇప్పటికే అసంఘటిత రంగంలోని 2 కోట్ల మంది కార్మికులు ఈఎస్ఐ సేవలు పొందుతున్నారని, తాజా నిర్ణయం వల్ల వాటి సంఖ్య 40 కోట్లకు చేరు కుంటుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో శనివారం ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఎసిక్(ఇఎస్ఐసీ) ఆఫీసర్స్ ఫెడరేషన్ సిల్వర్ జూబ్లీ సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్స్ సేవలు మాత్రమే అందుతున్నాయని, త్వరలో వాటిని 6 నుంచి 10 పడకల ఆస్పత్రులుగా మారుస్తామన్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్లో ఎస్ఎస్వో నుంచి ఏడీ, డీడీ, జారుుంట్ డెరైక్టర్ల వరకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఎసిక్ ఆఫీసర్స్ అంకితభావంతో పనిచేయాలని దత్తాత్రేయ సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామన్నారు. 2019 నాటికి ఈఎస్ఐ సేవలు మరింత విసృ్తతం కానున్నాయని వివరించారు. రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నారుుని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈఎస్ఐ కార్డుదారులు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని, కార్మికులందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందాలని అన్నారు. సదస్సులో మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, ఆలిండియా ఈఎస్ఐసీ ఆఫీసర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ప్రణయ్సిన్హా, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
9వ రోజు 27,58,638
కృష్ణమ్మ ఒడిలో తనివీతీరా పుష్కరస్నానాలు గొందిమళ్లలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ పుష్కర స్నానం పలు ఘాట్లకు పెరిగిన వీఐపీల తాకిడి నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం సోమశిల ఘాట్‌లో తగ్గిన నీటిమట్టం..షవర్లకింద స్నానాలు జాతీయ రహదారి, సోమశిల రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణానదీ తీరం..జనతీరమైంది. నదీమతల్లి ఒడిలో తనివితీరా సేదదీరారు. పుష్కరుడి సేవలో భక్తులు తరించిపోయారు. జిల్లాలోని పుష్కరఘాట్లకు శనివారం పోటెత్తారు. పుష్కరాల ముగింపు సమయం సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 27,58,638 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు ప్రారంభమైనప్పటినుంచి ఇదే రికార్డు. మరోవైపు పుష్కరఘాట్లలో నీటిమట్టం క్రమేణా తగ్గడంతో వరుసగా నాలుగోరోజు జూరాల ఘాట్‌ను మూసివేశారు. అత్యధిక భక్తులతో కిటకిటలాడుతున్న సోమశిలలో సైతం శనివారం పుష్కరఘాట్‌లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో ఘాట్‌లో పూర్తిగా మునిగి సాన్నం చేయడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఘాట్ పైనున్న షవర్ల ద్వారా పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడినుంచి చాలామంది మంచాలకట్టకు వెళ్లారు. బీచుపల్లి, సోమశిల, రంగాపూర్, గొందిమళ్ల, క్యాతూర్, గుమ్మడం, కొండపాడు, మంచాలకట్ట, నది అగ్రహారం, పస్పుల, కృష్ణ, పంచదేవ్పాడు, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కరస్నానం ఆచరించారు. శనివారం ఒక్కరోజే దాదాపు 27,58,638 మంది పుణ్యస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఉదయం వేళలో భక్తుల రద్దీ వీఐపీల తాకిడి వల్ల అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. జిల్లాలోని ప్రధాన ఘాట్లలో పుష్కరస్నానాలు కృష్ణ 1,01,578 పస్పుల 60,500 గొందిమళ్ల 1,58,000 నదీఅగ్రహారం 1,44,125 బీచుపల్లి 4,40,000 రంగాపూర్ 6,40,000 సోమశిల 7,30,000 పాతాళగంగ 23,860 (మిగతా వారు ఇతర ఘాట్లలో స్నానమాచరించారు) వీఐపీలు ఇలా.. రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ ఆయన సతీమణి విమల నరసింహన్ దంపతులు శనివారం జిల్లాలోని గొందిమళ్ల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లను సందర్శించారు. గొందిమళ్ల వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించి జోగుళాంబను దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి మాదాల జానకిరాం, ఆదోల్ ఎమ్మెల్యే, సినీనటుడు బాబుమోహన్ జోగుళాంబ ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించి జోగుళాంబ దర్శనం చేసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామ్‌లక్ష్మణ్ గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మంచాలకట్టలో పుణ్యస్నానమాచరించగా, ఐజీపీ మల్లారెడ్డి, వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు సోమశిల పుష్కరఘాట్‌లో స్నానమాచరించారు. రంగాపూర్ పుష్కరఘాట్‌లో మాజీ మంత్రి ముత్యంరెడ్డి, కోరుట్ల శాసనసభ్యుడు విద్యాసాగర్‌రావులు పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ రంగాపూర్ ఘాట్‌లోని ఆర్యవైశ్య అన్నదాన శిబిరాన్ని సందర్శించారు. ట్రాఫిక్ జామ్.. శనివారం అన్ని పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ కర్నూల్ జాతీయ రహదారిలోని భూత్పూర్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సోమశిలకు భక్తులు క్యూ కట్టడంతో కర్నూల్ సోమశిల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అడ్డాకుల టోల్గేట్ వద్ద కూడా వాహనాలు నిలిచిపోయాయి. కోటి దాటింది.. కృష్ణా పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య కోటి దాటింది. ఇప్పటి వరకు మొత్తం 1,07,88,575మంది పుష్కరస్నానం చే శారు. తొలి ఎనిమిది రోజుల వరకు 80,19,937 మంది భక్తులు పుష్కరస్నానాలు చేయగా, ఒక్క శనివారమే 27,58,638మంది పుణ్యస్నానాన్ని ఆచరించారు. -
ఇది దోపిడీదారుల ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దోపిడీదారుల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు దుయ్యబట్టారు. వనరులను కొల్లగొట్టి, కాంట్రాక్టులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ, పదాధికారుల ముగింపు సమావేశంలో మురళీధర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కానుంది. కార్యకర్తలందరూ సంఘర్షణకు సిద్ధంగా ఉండాలి. ప్రజాసమస్యలపై పోరాడేందుకు ఉద్యమబాట పట్టాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అనూహ్యంగా బలహీనపడ్డాయి. ప్రజలు తమ గొంతు వినిపించాలని బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నేతల పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ రాష్ట్రంలో అనునిత్యం ప్రజాస్వామ్యం అపహరణకు గురవుతోందన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇతర పార్టీలకు చెందిన ఏ ఒక్క ఎంపీనీ ప్రలోభపెట్టలేదన్నారు. రాజ్యసభలో మెజారిటీ లేక పలు ప్రజోపయోగ బిల్లులకు కాంగ్రెస్ అడ్డుపడుతున్నా తాము ఆ పని చేయడం లేదన్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీని అమ్ముకునే వ్యక్తులు బీజేపీలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతూ అంతరించిపోయే స్థితిలో ఉందని మురళీధర్‌రావు ఎద్దేవా చేశారు. 2014 తర్వాత ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలవలేదని, ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకు అనుగుణంగా నాయకులు సిద్ధం కావాలన్నారు. నిజమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు ప్రతిపక్షంగా పోరాడాల్సి ఉంటుందన్నారు. అందుకోసం పార్టీని గ్రామ స్థాయి వరకు పటిష్టం చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, పేరాల చంద్రశేఖర్, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వస్తేనే బంగారు తెలంగాణ: దత్తాత్రేయ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నా రు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరువు సాయం కింద కేంద్రం రూ. 790 కోట్ల అందించినా రైతులకు ఇంకా అందించలేదన్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు పనులు పూర్తి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. వాస్తవాలను కప్పిపెట్టి టీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి బడా కంపెనీలు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు... ముందుగా మూతపడుతున్న పరిశ్రమల గురించి ఆలోచించాలని దత్తాత్రేయ హితవు పలికారు. 4 నెలలుగా జీతాల్లేక రోడ్డునపడ్డ నిజాం షుగర్స్ సిబ్బందిని ఆదుకోవాలని ఆయన సూచించారు. -
ఆధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు: దత్తాత్రేయ
హైదరాబాద్: ఆధునిక పరిజ్ఞానంతో కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాలలో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్, సర్జికల్ స్కిల్స్ ల్యాబ్, ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెలి మెడిసిన్ విధానంతో కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. సమయం ఆదా కావడంతోపాటు దూర ప్రాంత నివాసితులకు సకాలంలో వైద్యసేవలు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఒడిశా రాష్ట్ర ఉపాధికల్పన శాఖ సాయంతో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలాజ్ హెల్త్‌కేర్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా జీడిమెట్ల, రామచంద్రాపురం మరికొన్ని డిస్పెన్సరీలను టెలి మెడిసిన్‌కు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. మంత్రి నాయిని మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటగా ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తేవడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్ దేవికారాణి, ఆసుపత్రి డీన్ శ్రీనివాస్, ఓటెట్ ట్రస్ట్ ఎండీ కె.ఎన్.భగత్ తదితరులు పాల్గొన్నారు. -
వేస్ట్ కాదు....మేమే బెస్ట్
♦ మోదీపై రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ ఆరోపణలు ♦ కేసీఆర్ మెచ్చుకుంటే.. కేటీఆర్ విమర్శించడమేంటి? ♦ గ్రేటర్ ఎన్నికల్లో సాధారణ ఎన్నికల ఫలితాలే పునరావృతం ♦ రోహిత్ వేముల వివాదంపై విచారణ ముగిసే వరకు మాట్లాడను ♦ కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ప్రకటనలతోనే సరిపెడుతోంది.. ♦ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బండారు దత్తాత్రేయ.. నగర రాజకీయాల్లో అత్యంత సుపరిచితమైన పేరు. అంతకంటే ఎక్కువగా ఇటీవలి హెచ్‌సీయూ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన వ్యక్తి. సికింద్రాబాద్ లోక్‌సభ నుండి అత్యధికంగా నాలుగుమార్లు విజయం సాధించిన రికార్డు సొంతం చేసుకుని ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న దత్తాత్రేయ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ -ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీని గొప్ప నాయకుడంటూ కేసీఆర్ ఆకాశానికెత్తితే.. ఆయన కుమారుడు కేటీఆర్ మోదీ వృథా నాయకుడంటూ విమర్శలు చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్‌ను అన్నింటా అగ్రస్థానంలో నిలబెడతామంటున్న దత్తాత్రేయతో...ఇంటర్వ్యూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం ఎవరిది..? ఫిబ్రవరి 2న జరిగే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ- టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. అన్ని సామాజిక వర్గాలతో కూడిన కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. హైదరాబాద్‌కు వాజ్‌పేయ్ హయాంలో అనేక పథకాలు తెచ్చాం. మూసీ ఆధునీకరణ, ఔటర్ రింగు రోడ్డు, మెట్రోరైలు తదితర పథకాలకు వాజ్‌పేయ్ హయాంలోనే బీజం పడింది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం సైతం హైదరాబాద్‌ను అన్నింటా అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతుంది. అభివృద్ధిని, మోదీ విధానాలను మెచ్చే నగరవాసులంతా గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే మళ్లీ రిపీట్ చేయబోతున్నారు.. ప్రధాని నగరాన్ని పట్టించుకోవటం లేదన్న కేటీఆర్ ఆరోపణలపై ఏమంటారు... మొన్నటి కి మొన్న సీఎం కేసీఆర్ మోదీ ఆదర్శవంతమైన(బెస్ట్) ప్రధాని అంటూ ఆకాశానికి ఎత్తారు. ఇప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ మోదీని వృథా(వేస్ట్) నాయకుడంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీ నగరానికి ఏం చేయలేదంటున్నారు. శుద్ధ అబద్దం..స్వచ్ఛ హైదరాబాద్ కోసం రూ.100 కోట్లను కేటాయించారు. 58 వేల ఇళ్ల నిర్మాణం కోసం రూ.480 కోట్లను, రామగుండం విద్యుత్ ప్లాంట్ కోసం రూ.9954 కోట్లు, స్మార్ట్ సిటీ పథకం కోసంర రూ.488 కోట్లు కేటాయించారు. మెట్రో రైలు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలో ప్రారంభోత్సవానికి హాజరు కాబోతున్నారు. హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ కోసం ఉత్తర-దక్షిణ గ్రిడ్ల అనుసంధానం, మల్లేపల్లి ఐటీఐని ఆదర్శవంతమైన కేంద్రంగా మార్చడం, ఆటో కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం, భవననిర్మాణ కార్మికులను ఈపీఎఫ్ పరిధిలోకి తెచ్చిన ఘనత మోదీకే దక్కింది. మీ హయాంలో హైదరాబాద్‌కు ఏం చేశారు.. ఇంకా ఏం చేయబోతున్నారు? హైదరాబాద్‌ను అన్నింటా అగ్రస్థానంలో నిలబెట్టే కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వసేవలను ఉపయోగించుకోవటంలో రాష్ట్రం పూర్తిగా విఫలం అవుతోంది. తెలంగాణలో ప్రధాన రహదారుల విస్తరణ, ఎంఎంటీఎస్ పొడిగింపు, గడువులోగా మెట్రో పనుల పూర్తి, మూసీ ఆధునీకరణ, ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్, హైదరాబాద్-వరంగల్ రహదారి విస్తరణ పనులు గడువులోగా పూర్తి చేసే దిశగా ముందుకు వెళతాం. టీడీపీ-బీజేపీలు పరస్పరం తిరుగుబాటు అభ్యర్థులను రంగంలో దింపారు.. ఎందుకిలా? అవును, నిజమే..బీజేపీకి కేటాయించిన 63 సీట్ల కంటే 7 సీట్లలో, టీడీపీకి కేటాయించిన 93 సీట్ల కేంటే 7 సీట్లలో అధికంగా బీ ఫారాలు ఇచ్చారు.. ఇరుపక్షాల కార్యకర్తల ఒత్తిడి ఉండటం వల్లే అలా జరిగింది. అభ్యర్థుల నుంచి మీరు, కిషన్‌రెడ్డి డబ్బులు తీసుకున్నా రన్న మీ ఎమ్మెల్యే ఆరోపణలపై ఏం చెబుతారు.. దురదృష్టకరం. బీజేపీ అనేది వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీ కాదు. ఎన్నికల కమిటీయే ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయిస్తుంది. రాజాసింగ్ నిరాధార ఆరోపణలు చేశారు. బీజేపీలో డబ్బులకు ప్రాధాన్యం ఇస్తే..అసలు రాజాసింగ్ నేడు ఎమ్మెల్యే అయ్యేవాడే కాదు. రాజాసింగ్ వద్ద ఏం డబ్బులుఉన్నాయని అప్పుడు టికెట్ ఇచ్చారు. అసంతృప్తితో ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు ఇచ్చాం. రోహిత్ వేముల అంశం మీ పార్టీకి ఇబ్బందిగా మారిందా.. ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారు? ఈ అంశంపై ఇప్పుడు నేనేం చెప్పలేను. కోర్టు పరిధిలో ఉంది. ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోంది. కేంద్రంలో మోదీ - రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎలా ఉంది..?ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు.. కేంద్రంలో గడిచిన పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను సవరించే విషయంలో మోదీ ముం దున్నారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలబెట్టే క్రమంలో ఎంతో కృషి చేశారు. అవినీతి, దాపరికం లేని పాలనతో ముందుకు వెళుతున్నారు. అనేక ఫలితాలు దేశ ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. మోదీకి నేనిచ్చే మార్కులు నూటికి నూరుశాతం. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ప్రకటనల స్థాయిలోనే ఉంది.. ఫలితాలేవీ ప్రజలకు చేరలేదు.. ఆర్థిక క్రమశిక్షణ లోపంతో సర్ప్లస్ బడ్జెట్ నుండి మైనస్ బడ్జెట్లోకి రాష్ట్రం వెళ్లింది. వేచి చూడాలి.. ఇప్పుడే ఏం మార్కులు ఇవ్వలేం. -
‘ప్రైవేటు’లోనూ రిజర్వేషన్లు అవసరం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయు హైదరాబాద్: ప్రైవేటు రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరమని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 85 శాతం మంది దళితులకు ఏ రకమైన భూమి లేదు. ఎన్నో ఏళ్లుగా వీరంతా అసమానతకు గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు చేయూతనిచ్చేందుకు, వారిని పారిశ్రామికంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాం.’ అని అన్నారు. న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్లు అమలు కావడం లేదని, కుల ధ్రువీకరణ పత్రాల కోసం అవస్థలు పడాల్సి వస్తోందని సొసైటీ అధ్యక్షుడు మురళీధర్‌రావు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచిస్తామన్నారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు, ఎస్సీలకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటివి చేపడుతున్నామని చెప్పారు. సెమినార్లో టీఆర్ఎస్ చీఫ్‌విప్ కొప్పు ల ఈశ్వర్, మాజీ మంత్రి గీతారెడ్డి, ప్రజాగాయకుడు గద్దర్, వేములపల్లి వెంకట్రామయ్య, ఎం.జానయ్య పాల్గొన్నారు. -
30 కోట్ల మందికి ఈఎస్ఐ సేవల విస్తరణ
♦ ఈఎస్ఐ ఆసుపత్రుల్లో 8,300 పోస్టుల భర్తీకి చర్యలు: దత్తాత్రేయ ♦ ఈఎస్ఐసీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టు చట్టం పరిధిలోకి తెచ్చేందుకు త్వరలోనే త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి దత్తాత్రేయ చెప్పారు. త్రైపాక్షిక సమావేశంలో ఏకగ్రీవానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టులకు సామాజిక భద్రత, సంక్షేమ ప థకాలను అందజేస్తామని భరోసా ఇచ్చారు. సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 30 కోట్ల మంది కార్మికులకు ఈఎస్ఐసీ సేవలను విస్తరించడం భవిష్యత్ లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం బీమా వ్యక్తులు (ఇన్స్యూర్డ్ పర్సన్) 2 కోట్ల మంది, కుటుంబసభ్యులు 8 కోట్ల మంది ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో 5 కోట్ల మంది బీమా వ్యక్తులకు ఈఎస్ఐ సేవలు విస్తరించనున్నామన్నారు. ఢిల్లీలో మంగళవారం ఈఎస్ఐసీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని దత్తాత్రేయ ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలో లక్ష మంది ఆటోరిక్షావాలాలకు ప్రయోగాత్మకంగా ఈఎస్ఐని అమలు చేయనున్నామన్నారు. సనత్‌నగర్ వైద్యకళాశాలను త్వరలో ప్రారంభించనున్నామని, ఈ వైద్యకళాశాలలో 40 శాతం సీట్లను కార్మికుల పిల్లలకు కేటాయించనున్నామని దత్తాత్రేయ చెప్పారు. దేశంలోని 650 జిల్లాల్లో సేవలందిస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టుల్లో 8,300 ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యకళాశాలలో ఏపీ, తెలంగాణ విద్యార్థులకు అవకాశం లేకపోవడంపై ప్రశ్నించగా, అఖిలభారత ప్రిమెడికల్ పరీక్షను గుర్తిస్తున్నట్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. నిధులను ఓట్లతో ముడిపెట్టొద్దు నిధులను ఓట్లతో ముడిపెట్టవద్దని టీఆర్ఎస్ ఎంపీ కవితకు మంత్రి దత్తాత్రేయ హితబోధ చేశారు. ‘మంత్రి దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలు హైదరాబాద్‌కు 20 వేల కోట్లు తెస్తే, బీజేపీకి ఓటు వేస్తామని’ టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి దత్తాత్రేయ స్పందించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కారీ రూ. 41 వేల కోట్లు కేటాయించారని, డబుల్ బెడ్రూం పథకానికి కేంద్రం హడ్కో నుంచి రూ. 3 వేల కోట్ల రుణం ఇప్పించిందని, గృహనిర్మాణ పథకం కింద 48 వేల ఇళ్లను మంజూరు చేసిందని ఉదహరించారు. రాజకీయాలు ప్రజల సంక్షేమం కోసమే తప్ప, ఓట్ల కోసమే కాదని కవితకు చురక వేశారు. హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభానికి ఆహ్వానిస్తే ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని చెప్పారు. -
క్లీన్ ఇండియా
సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ పారిశుద్ధ్యంపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పరిశుభ్రమైన భారతావనిని ఆవిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిమ్స్‌మేలో నిర్వహించిన ‘లైఫ్‌స్కిల్స్ అండ్ లైవ్లీహ డ్ స్కిల్స్’సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. అందరూ వివిధ స్థాయిల్లో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాతో పాటు క్లీన్ ఇండియాకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. స్వేచ్ఛా భారతం కన్నా స్వచ్ఛ భారతే మిన్న అన్న గాంధీజీ ఆశయాన్ని నెరవేర్చేందుకు స్వచ్ఛభారత్ క్యాంపెయిన్‌ను కేంద్రం చేపట్టిందన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు కనీసం ఒక టాయిలెట్ ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 11 లక్షల మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ. 62 వేల కోట్లు వ్యయం చేయబోతోందన్నారు. వారానికి రెండుగంటల చొప్పున ఏడాదికి 100 గంటల పాటు ప్రతి వ్యక్తి పారిశుద్ధ్యానికి ప్రాధన్యమివ్వాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ అందుకొని ముందుకు సాగాలన్నారు. నైపుణ్యాలు అవసరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. పటిష్టమైన భారత్‌ను నిర్మించాలంటే జీవన, జీవనోపాధుల నైపుణ్యాలు అవసరమన్నారు. డిగ్రీ పూర్తిచేసిన ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉపాధి పొందేందుకు అవసరమై నైపుణ్యం(స్కిల్) ఉండటం లేదన్నారు. అలాగే, ఆరోగ్యం పట్ల ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరులక్షల కుటుంబాల్లో మరుగుదొడ్లు లేక వృద్ధులు, గర్భిణులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో 140 రోజుల్లో 20,174 మరుగుదొడ్లు కట్టి గిన్నిస్‌బుక్ రికార్డు సాధించామన్నారు. ప్రస్తుతం శ్మశాన వాటికల అభివృద్ధిని చేపట్టానన్నారు. పాఠశాలల్లోనూ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని కోడెల చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశే ్వశ్వర్‌రెడ్డి, ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, మాజీ మంత్రి జి.వినోద్, యునిసెఫ్ ప్రతినిధి రీతూలియో, సదస్సు కో చైర్మన్ డాక్టర్ రవిరెడ్డి, సెంటినెల్ వర్సిటీ వ్యవస్థాపకుడు రిచర్డ్ అలీవర్ తదితరులున్నారు. -
వ్యవసాయ పరిశోధనలకు మరో వెయ్యి కోట్లు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ♦ స్వామినాథన్ సిఫార్సులపై కేంద్రం సానుకూలంగా ఉందని స్పష్టీకరణ ♦ వ్యవసాయం లాభసాటిగా లేదని ఇక్రిశాట్ డీజీ ఆవేదన ♦ జన్యుమార్పిడి ప్రయోగాలు అవసరమన్న ఐకార్ డీడీజీ ♦ హైదరాబాద్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ వరి సదస్సు సాక్షి, హైదరాబాద్: వచ్చే కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పరిశోధనలకు అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించేందుకు కృషిచేస్తానని... ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రూ.7 వేల కోట్లు పరిశోధనలకు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ హామీనిచ్చారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వరి సదస్సు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రపంచ ఆహార భద్రతకు హామీయిచ్చేలా రైతులు వరి పండించాలని ఈ సదస్సులో ప్రసంగిస్తూ దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. రైతులకు కేవలం మద్దతు ధర ఇస్తే సరిపోదని... వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి ఎంతో కీలకమైన స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోందన్నారు. సిఫార్సులపై సానుకూలంగా ఉందన్నారు. దేశ విత్తన రాజధానిగా హైదరాబాద్ వెలుగొందుతుందని... వివిధ రాష్ట్రాలు, దేశాలకు విత్తనాలు సరఫరా చేస్తున్నామని అన్నారు. గత 50 ఏళ్లలో ఐఐఆర్ఆర్ 1090 వరి హైబ్రీడ్ వంగడాలను తయారుచేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం 95 శాతం హైబ్రీడ్ విత్తనాన్ని సరఫరా చేస్తోందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి ప్రపంచంలో వ్యవసాయం ఎక్కడా లాభసాటిగా లేదని ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్‌విన్సన్ ఆవేదన వ్యక్తంచేశారు. సదస్సులోనూ... ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగును లాభసాటిగా మార్చే ప్రధాన లక్ష్యంతో శాస్త్రవేత్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాధార భూముల్లో ఉత్పాదకత పెంచేలా కృషిచేయాలన్నారు. వరి ఉత్పత్తి ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచడమే కాకుండా పోషక విలువలు కలిగి ఉండేలా వరిని రూపొందించాలన్నారు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఫిలిఫ్పైన్స్) డెరైక్టర్ జనరల్ రాబర్ట్ జిగ్లర్ మాట్లాడుతూ రైతుకు లాభం కలిగించేలా పరిశోధనలు ఉండాలన్నారు. వ్యవసాయం ప్రమాదంతో కూడిన వ్యాపారం లాంటిందన్నారు. కరువు, వరదలను రెండింటినీ తట్టుకునే ఒకే రకమైన వంగడాన్ని కనుగొనాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. రైతులకు సాయపడేలా పరిశోధనలు ఉండాలని ఐకార్ కార్యదర్శి ఆర్.రాజగోపాల్ పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే 25 శాతం వరకు అదనంగా ఉత్పత్తి చేయగలరన్నారు. ఐకార్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (డీడీజీ) డాక్టర్ జె.ఎస్.సంధు మాట్లాడుతూ జన్యుమార్పిడి పంట ప్రయోగాలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. కొత్త పరిజ్ఞానం వచ్చినప్పుడు ఎంతోకొంత ప్రమాదం ఉంటుందన్నారు. జన్యు మార్పిడి పరీక్షల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశ అవసరాల దృష్ట్యా పరీక్షలు అవసరమన్నారు. మొదట్లో పత్తిలో బీటీ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాగే అనుకున్నారని... దాని ద్వారా పత్తి విస్తీర్ణం ఎంతో పెరిగిందన్నారు. గోల్డెన్ రైస్పైనా పరిశోధనలు జరుగుతున్న విషయాన్ని ఆయన పేర్కొన్నారు. రెండో హరిత విప్లవానికి రోడ్‌మ్యాప్... ఐఐఆర్ఆర్ 50 ఏళ్లు పూర్తిచేసుకుందని ఆ సంస్థ డెరైక్టర్ డాక్టర్ వి.రవీంద్రబాబు అన్నారు. గత పదేళ్లలో ఆహారధాన్యాల రంగంలో స్తబ్ధత ఏర్పడిందన్నారు. రెండో హరిత విప్లవానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను తయారుచేస్తున్నామన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల నేపథ్యంలో తమ సంస్థ రెండ్రోజులపాటు సద్భావన యాత్రలు నిర్వహించిందని చెప్పారు. -
సీబీఆర్‌టీతో అక్రమాలకు అడ్డుకట్ట
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి ♦ పోటీపరీక్షల్లో ఆన్లైన్ విధానంతో పారదర్శకత ♦ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి ♦ తమ రాష్ట్రంలోనూ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తామన్న కర్ణాటక సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 5-10 లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడి, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఘటనలు దేశంలో అనేకం జరిగాయని, అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (సీబీఆర్టీ) ఉపయోగపడుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సీబీఆర్టీ ద్వారా పరీక్షలను పక్కాగా నిర్వహించడంతోపాటు పారదర్శకత పెరుగుతుందన్నారు. ఇందులో ప్రతిభావంతులకే ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆదివారం సీబీఆర్టీ విధానంలో ఆన్లైన్ పరీక్షను నిర్వహించింది. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను దత్తాత్రేయతోపాటు కర్ణాటక సర్వీసు కమిషన్ సభ్యులు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, కొత్త రాష్ట్రంలో తక్కువ సమయంలో పకడ్బందీగా క్లౌడ్ టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం అభినందనీయమని కితాబునిచ్చారు. ఒక్కో పరీక్షకు 1,000 ప్రశ్నలు రూపొందించి, అందులో 150 ప్రశ్నలను ఎంపిక చేసి, అదీ ఒక అభ్యర్థికి వచ్చిన సీక్వెన్స్ మరో అభ్యర్థికి రాకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టారన్నారు. టీఎస్పీఎస్సీ 31 వేల మందికి మొదటిసారిగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచిందని కొనియాడారు. తాము కూడా ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ)లో ఆన్లైన్లో 8 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ఎంతో భద్రత, పారదర్శకత కలిగిన ఆన్లైన్ విధానాన్ని భవిష్యత్తులో అన్ని ఉద్యోగ పరీక్షల్లో అమలు చేయాలని సూచించారు. తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీసు (ఎన్సీఎస్) సెంటర్లను ప్రారంభించామని, వాటి ద్వారా దేశంలోని 983 ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లను అనుసంధానం చేశామన్నారు. ఇందులో 3.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, వారు ఫోన్లోనే తగిన ఉద్యోగ సమాచారం పొందుతారన్నారు. రూ.380 కోట్లతో 100 మోడల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీ ఓటీఆర్‌తో తమ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లను ఎలా అనుసంధానం చేయాలో ఆలోచిస్తామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, దేశంలో ఒకే విధమైన పరీక్ష విధానం కోసం యూపీఎస్సీ చూస్తోందన్నారు. తాము చేస్తున్న ఆన్లైన్ పరీక్షల విధానం అంతటా అమలు చేయవచ్చని చెప్పారు. ఓటీఆర్‌లో 6 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అమలుచేసేందుకు చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, రామ్మోహన్‌రెడ్డి, సాయన్న, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక కమిషన్ ఇన్చార్జి చైర్మన్ ఎం.మహదేవ, సభ్యులు ఆన్లైన్ పరీక్ష విధానాన్ని పరీశీలించారు. ఈ ఆన్లైన్ విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే గుజరాత్ ముందుకురాగా, కర్ణాటకలోనూ అమలు చేస్తామని కమిషన్ సభ్యులు వెల్లడించారు. -
కేసీఆర్ దళితులను మభ్యపెడుతున్నారు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: ఎన్నికల ముందు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తరువాత హామీ నెరవేర్చకుండా దళితులను మభ్యపెడుతున్నారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి చౌరస్తాలో ఉన్న భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దళితులకు భూమి కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పేదలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు జనరల్ కేటగిరీ స్థానాల్లో కూడా అత్యధిక సీట్లు దళితులకు కేటాయించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, ఆచారి, దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు దుష్యంత్‌కుమార్ గౌతం, రాష్ట్ర అధ్యక్షుడు కె.రాములు, ప్రధాన కార్యదర్శి పరమేశ్‌కుమార్, కోశాధికారి హరిబాబు, కార్యదర్శి రాంచందర్, నాయకులు డి.నరహరి, మహేశ్, గంగరాజు పలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
‘కంది’ అక్రమ నిల్వలను వెలికితీయాలి
♦ అమరావతికి వెళ్తున్నా: దత్తాత్రేయ ♦11వ అలయ్‌బలయ్‌కు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: కందితోపాటు ఇతర పప్పు దినుసుల అక్రమ నిల్వలపై దాడులు చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. పార్టీ నేతలు ప్రకాశ్ రెడ్డి, వేణుగోపాల్ గౌడ్‌తో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పప్పు దినుసుల ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. పప్పు ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుందన్నారు. పప్పును అక్రమంగా బ్లాక్‌మార్కెటింగ్‌కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌మార్కెట్ చేసే వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పు దినుసులను కాకుండా పత్తి, పండ్లు, పూలతోటలు సాగు చేయడం వల్ల దిగుబడి తగ్గిపోయిందన్నారు. పప్పు దినుసుల సాగును పెంచడానికి విత్తనాలను అందించడం, వీటి సాగుకోసం ఎరువులను సగం సబ్సిడీకి అందించడం వంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. బ్లాక్ మార్కెట్లపై దాడులు చేసి నిల్వలను వెలికితీయాలని, ఎగుమతులపై పన్నులను పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా దత్తాత్రేయ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా చర్యలను తీసుకోవాలని సూచించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న జరిగే 11వ అలయ్‌బలయ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా దత్తాత్రేయ వెల్లడించారు. దీనికి కేంద్రమంత్రులు నితిన్ గడ్కారీ, ఎం.వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు, ప్రతిపక్షనాయకులను ఆహ్వానించినట్టుగా చెప్పారు. -
చిన్న కంపెనీ కార్మికులకూ ఈపీఎఫ్
చట్టాన్ని సవరిస్తాం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: పది మంది ఉన్న చిన్న కంపెనీల్లో పని చేసే కార్మికులకూ భవిష్యనిధి(ఈపీఎఫ్) సౌకర్యం కల్పించేలా చట్టాన్ని సవరిస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రస్తుతం 20 మందికిపైగా కార్మికులున్న కంపెనీల్లో పనిచేసే వారికే ఈపీఎఫ్ వర్తిస్తుందన్నారు. చట్టం సవరిస్తే కోట్లాది మంది కార్మికులకు పెన్షన్, పదవీవిరమణ ప్రయోజనం, మెడికల్, బీమా సౌకర్యం వంటివన్నీ వర్తిస్తాయని శనివారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో చెప్పారు. కనీస పరిమితి వంటివాటి అంశాల్లోనూ కార్మికులకు ఉపయోగపడే చాలా సవరణలు తెస్తామన్నారు. అన్ని అలవెన్సులు కలిపి 7 వేలు జీతం దాటే ప్రతీ కాంట్రాక్టు ఉద్యోగికి పీఎఫ్ వర్తింపజేస్తామన్నారు. పత్తి కొనుగోలులో ప్రభుత్వం ఇచ్చే బోనస్, ధర వంటివాటిలో అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దళారుల పాలు కాకుండా రైతులకే నేరుగా ఆన్లైన్ చెల్లింపులు చేయాలన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమన్నారు. -
రైతు ఆత్మహత్యలపై అఖిలపక్షం వేయాలి: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల నివారణకు, వ్యవసాయసంక్షోభాన్ని అధిగమించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు, రుణాలు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యం వంటివాటిపై విస్తృతంగా చర్చించాలని కోరారు. వ్యవసాయరంగంపై ఇంకా నిర్లక్ష్యం తగదని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న రైతుల్లో మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత అన్ని రాజకీయపార్టీలపై ఉందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఇప్పటిదాకా అభివృద్ధి చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభివృద్ధికి అడ్డుపడుతున్నదని ఆయన ఆరోపించారు. పారిశ్రామికరంగ అభివృద్ధికోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలను అడ్డుకుంటోందని విమర్శించారు. దీనివల్ల పారిశ్రామిక రంగం దెబ్బతిని, ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి చర్యలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక బిల్లును తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు తప్పదన్నారు. వార్డుల విభజనలో సహజ ప్రమాణాలను పాటించాలని, రాజకీయ లబ్ధికోసం తప్పుడు విధానాలను అవలంభించవద్దని దత్తాత్రేయ సూచించారు. వార్డుల విభజనకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. -
స్వామినాథన్ సిఫారసుల అమలుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : దేశంలో రైతులకు మేలు కలిగేలా స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. రైతులకు నీరు, కరెంటు సమృద్ధిగా అందితే ఆత్మహత్యలు ఉండవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. తెలంగాణతో పాటు దేశంలో రైతుల ఆత్మహత్యలు దురదృష్టకరమన్నారు. ఢిల్లీకి చెందిన కన్స్యూమర్ కో ఆర్డినేషనల్ కౌన్సిల్ (సీసీసీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ వినియోగదారుల సదస్సును శనివారమిక్కడి రవీంద్రభారతిలో ప్రారంభించారు. రైతులను వినియోగదారులుగా పేర్కొంటూ రైతు సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేపట్టిన ఈ సదస్సులో దత్తాత్రేయ మాట్లాడుతూ, అన్నదాత సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకొంటుందని, నిధులు, అధికారాలను రాష్ట్రాలకే అప్పగిస్తుందన్నారు. 24 గంటల పాటు దేశంలోని రైతులకు కరెంటు ఇచ్చేందుకు, సమగ్ర బీమా పథకాన్ని రూపొందించేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో రైతులు, వినియోగదారులు లాభపడటం లేదని, కేవలం దళారీలే బాగుపడుతున్నారన్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు దేశంలో 2,70,924 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికీ దేశంలో అరగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు పండించిన పంటను తక్కువధరకు కొనుగోలు చేసి దళారీలు రెట్టింపు ధరకు అమ్ముతున్నారన్నారు. రైతులకు వ్యక్తిగత పంటల బీమా, గిట్టుబాటు ధర లభిస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ, రైతులను వినియోగదారులుగా గానీ, ఉత్పత్తిదారులుగా గానీ గుర్తించడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు బాధాకరమని, విత్తనాలు సరఫరా చేసే కంపెనీలే రైతులకు బీమా ఇప్పించేలా చట్ట సవరణ చేయాలని సూచించారు. వినియోగహక్కులు రైతులకు అందాలన్నారు. సమావేశంలో సీసీసీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ అదిల్ జైనుల్భాయి, కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్, మలేషియా హెడ్ ఇంద్రాని తురిసింగం, జస్టిస్ నౌషద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ముద్రా బ్యాంక్‌తో పేదల జీవితాల్లో వెలుగులు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ : పేదల జీవితాల్లో వెలుగునింపడానికి ముద్రా బ్యాంక్ దోహదపడుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ముద్రా బ్యాంకు ద్వారా దేశంలోని 5.77 లక్షల సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రూ.20 వేల కోట్ల రుణాలు అందనున్నాయన్నారు. తద్వారా 12 కోట్ల నుంచి 25 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని చెప్పారు. తెలుగులో ప్రచురించిన ముద్రా బ్యాంకు విధి విధానాల పుస్తకాన్ని బుధవారం ఏపీ భవన్లో మంత్రి దత్తాత్రేయ, టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ముద్రా బ్యాంకు విధివిధానాలపై తెలుగులో పుస్తకం తీసుకురావడం ద్వారా ఏపీ, తెలంగాణలోని నిరుద్యోగులు, మహిళా పొదుపు సంఘాలు, చిరువ్యాపారులకు రుణాలు పొందే విషయంలో అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ప్రభుత్వ పథకాలకు సార్థకత చేకూరదన్నారు. ఎంపీ కె.రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజకీయాలకు అతీతంగా పేద, మధ్యతరగతి, నిరుద్యోగులకు వర్తించేలా పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమానికి పుస్తక రచయిత టి.రామదాసప్పనాయుడు అధ్యక్షత వహించారు. -
హక్కుల సాధనకు బీసీలు ఏకం కావాలి
♦ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ♦ రవీంద్రభారతిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తర గతులకు చెందిన వారంతా ఏకమై ముందుకు సాగితేనే వారి హక్కులు, ఆశయాలు నెరవేరుతాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అణ గారిన వర్గాల అభ్యున్యతికై 19వ దశాబ్దంలోనే మహత్మ జ్యోతిరావు పూలే ఎంతగానో పోరాడారని చెప్పారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జ్యోతిబా పూలే 189వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. కుల వృత్తులు చేసుకునే బీసీ యువతకు నైపుణ్యాన్ని అందించడం, చదువుకోని పిల్లలను బడికి పంపించడం ద్వారా జ్యోతిబా పూలేకి నివాళి అర్పించనట్లవుతుందన్నారు. కార్మిక శాఖ తరపున దేశవ్యాప్తంగా ఒకేషనల్ శిక్షణా సంస్థలను ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. అణ గారిన వర్గాల కోసం పోరాడి న మొదటి తరం ఉద్యమ కారుడు జ్యోతిబా పూలే అన్నారు. అటువంటి ఉద్యమ కారుడు తరానికి ఒకరైన ఉంటే భారత దేశ పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. జ నాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ.. బీసీ విద్యార్థుల కోసం ఈ ఏడాది మూడు గురుకుల పాఠశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాలను నెలకొల్పామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో పోటీపరీక్షలకు శిక్షణ నిరంతరం జరిగేలా వాటిని బలోపేతం చేస్తామన్నారు. బీసీ హాస్టళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులందరికీ బెడ్స్, సురక్షిత తాగునీరు, సోలార్ విద్యుత్.. తదితర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. తరాలు మారినా కనిపించని విధంగా బీసీలు దోపిడికి గురవుతూనే ఉన్నారన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్లో పెట్టాలని డిమాండ్ చేశారు.బీసీలకు కూడా ఉప ప్రణాళిక, కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రాజయ్య యాదవ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్ , పద్మారావు, ఎంపీలు విహెచ్ హనుమంతరావు, కె.కేశవరావు, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార ్యదర్శి టి.రాధ తదితరులున్నారు. -
జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుపుతా..
సన్నూరు పర్యటనలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఐదున్నర గంటలు ఆలస్యంగా పర్యటన వరాల జల్లు కురిపించడంతో సన్నూరు గ్రామాస్తుల హర్షం సన్నూరు(రాయపర్తి) : సన్నూరు గ్రామాన్ని అభివృద్ధిపరంగా జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుపుతానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. రా యపర్తి మండలంలోని సన్నూరు గ్రామాన్ని ఆ యన బుధవారం పర్యటించారు. సంసద్ ఆద ర్శ యోజన కింద సన్నూరును దత్తాత్రేయ దత్త త తీసుకున్న విషయం విదితమే. ఈ మేరకు ఆయన గ్రామంలో పర్యటించారు. అయితే, ఉదయం 11గంటలకు మంత్రి వస్తారని ప్రకటించగా.. సాయంత్రం 4.30గంటలకు వచ్చా రు. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి న ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేసినా గ్రా మంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి ప్రకటించిన వరాలతో సంతోషం వెలిబుచ్చారు. గ్రామానికి వచ్చిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ తొలుత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సం దర్శించి ప్రత్యేక పూజలు చేశాక.. గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ ఆవరణలో ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సమస్యల పరిష్కారం.. గ్రామాభివృద్ధి సన్నూరు గ్రామంలోని ప్రతీ సమస్యను పరిష్కరించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృ ద్ధి చేయడంతో పాటు రహదారులు మరమ్మతు చేయిస్తానని తెలిపారు. గ్రామంలో వసతుల కల్పిస్తూనే నిరుద్యోగులకు ఉపాధి లభించేలా వృత్తి, విద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే, పొగాకు సంబంధిత ఉత్పత్తులు, గుడుంబాతో పాటు అత్యాచారాలు జరగకుండా గ్రామస్తులే కమిటీలు వేసుకుని కృషి చేయాలని సూచించారు. ఎవరి గ్రామానికి వారే అభివృద్ధి నిర్మాతలని.. అవినీతి లేకుండా గ్రా మాన్ని అభివృద్ధి చేయడంతో పాటు బంగారు తెలంగాణ నిర్మాణానికి సహకరించాలని కోరా రు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులతో కలిసి అభివృద్ధికి చేస్తానని దత్తాత్రేయ ప్రకటించారు. ఐదేళ్లుగా అభివృద్ధి లేదు.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో పాల్గొనడంతో ఐదేళ్లు అభివృద్ధి జరగలేదని.. ఇప్పుడు కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలిసి అభివృద్ధి పనులు చేపడుతామని వెల్లడించారు. సన్నూరు గ్రామం గురించి మంత్రి దత్తాత్రేయ దృష్టికి తీసుకువెళ్లింది తానేనని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గూబ యాకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు యాకమ్మ, ఎంపీపీ గుగులోతు విజయ, జెడ్పీటీసీ వంగాల యాకమ్మతో పాటు బీజేపీ నాయకులు వన్నాల శ్రీరాములు, మార్తినేని ధర్మారావు, టి.రాజేశ్వర్‌రావు, చందుపట్ల జంగారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
దత్తన్న వస్తున్నాడు
.హన్మకొండ : కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండా రు దత్తాత్రేయ ఈనెల 21న జిల్లా పర్యటనకు రానున్నారు. హైదరాబా ద్ నుంచి నేరుగా మధ్యాహ్నం 12.30 గంటలకు చేర్యాల మండలం కొమురవెల్లికి చేరుకుంటారు. మల్లికార్జునస్వా మి దేవాలయంలో జరగనున్న కల్యాణోత్సవంలో పాల్గొని, అనంతరం హైదరాబాద్‌కు వెళతారు. కేంద్ర, కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం చేర్యాల మండలం కొమురవెల్లిమల్లన్న కల్యాణానికి రానున్నారు -
దత్తన్నకు దత్తత
జిల్లాలో మరో గ్రామానికి దత్తత యోగం పట్టింది. మత సామరస్యానికి ప్రతీక అయిన మండలంలోని అన్నారం షరీఫ్ దశ ఇక మారనుంది. సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)కింద కేంద్ర సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇప్పటి కే ఐదు గ్రామాలను లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు దత్తత తీసుకున్నారు. దత్తత పొందిన ఆరో గ్రామం అన్నారం షరీఫ్. - అన్నారం షరీఫ్‌కు మహర్దశ - ఎస్ఏజీవై కింద దత్తత - స్థానికుల హర్షాతిరేకాలు అన్నారం షరీఫ్(పర్వతగిరి): జిల్లా కేంద్రానికి 42 కిలో మీటర్ల దూరంలో ఉన్న అన్నారం షరీఫ్‌లో దశాబ్దల క్రితం యాకూబ్ బాబా కొలువుదీరారు. పెద్ద సంఖ్యలో హిందువులూ బాబాను కొలుస్తారు. మొక్కులు తీర్చుకునేందుకు భారీగా కందూర్లు చేస్తారు. ఇక్కడి దర్గాల ఏటా వక్ఫ్‌బోర్డు టెండర్లు నిర్వహిస్తుంది. ఇలా సుమారు రూ. 80 లక్షల ఆదాయం సమకూరుతుంది. సమస్యల జాతర ఇంత ఆదాయం ఉన్నా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తంగా పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలతో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దర్గాలో భక్తుల వద్ద అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఇబ్బందిపడాల్సి వస్తోంది. తాగునీటి సమస్యలూ వెంటాడుతున్నాయి. దర్గా అభివృద్ధి కూడా ప్రధాన సమస్య. 2, 280 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య 1740. పంచాయతీ ఇంటి బకాయిలు రూ.3 లక్షలు, నల్లా పన్నుల బకాయిలు రూ. 2 లక్షలు వరకు ఉన్నాయి. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల అభీష్టం.. దత్తత ద్వారా త్వరలో నెరవేరనుంది. దత్తతపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షడు మో టపోతుల మనోజ్‌గౌడ్ మాట్లాడుతూ, గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దితే ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. సర్పంచ్ జడల పద్మ, మండల కో ఆప్షన్ సభ్యుడు షబ్బీర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లూనవత్ పంతులు, రామ్మూర్తి, మాజీ ఉప సర్పంచ్ బూర యాకయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది అన్నారం షరీఫ్‌ను సంసద్ ఆదర్శ్ గ్రామంగా దత్తత తీసుకోవటం మా అదృష్టం. హిందూముస్లింల ఐక్యతకు నిదర్శనమైన గ్రామం మాది. తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను దత్తత ద్వారా పరిష్కరిస్తే ప్రజలకు మేలు కలుగుతుంది. మా గ్రామాన్ని దత్తాత్రేయ దత్తత తీసుకోవటానికి కృషి చేసిన యుగాంతర్ సంస్థ డెరైక్టర్ ఎర్రబెల్లి మదన్‌మోహన్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. - జడల పద్మ, సర్పంచ్