'నిజాం సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో కలిసిపోవడం గొప్ప పరిణామమే. అయితే 17 తర్వాతి రోజుల్లో అమాయక ముస్లింలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఇప్పుడు మనం సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకొంటే కొందరిని బాధపెట్టినవాళ్లమవుతాం. అసలు జరుపుకోకుండా ఉంటే చరిత్రను మరిచిపోయినట్లే లెక్క. అందుకే సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటించాలని కోరుకుంటున్నాం' అని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు.