వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: ప్రముఖ కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. దేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రానికి నడకలు నేర్పిన మహా మనిషి లక్ష్మణ్ అని కొనియాడారు. ఆయన కార్టూన్లు మన జాతీయ సంపద అని పేర్కొన్నారు. అంతటి మహానుభావుడు అస్తమించాడన్న వార్త విని ఎంతో బాధ చెందినట్లు తెలిపారు.
. ఆ మహనీయుడికి యావత్ భారత్ జాతి గుండెల నిండా కన్నీరు నింపుకొని నివాళి అర్పిస్తోందని పేర్కొన్నారు. భారతదేశమే కాక ప్రపంచమే గర్వించదగ్గ కార్టూనిస్టుగా లక్ష్మణ్ ఎప్పటికీ నిల్చిపోతారని కీర్తించారు.