సమాజాన్ని ప్రతిబింబిస్తాయి | Reflect society | Sakshi
Sakshi News home page

సమాజాన్ని ప్రతిబింబిస్తాయి

Published Fri, Feb 17 2017 1:32 AM | Last Updated on Tue, Dec 25 2018 2:55 PM

ఆర్కే లక్ష్మణ్‌ కార్టూన్లు భారతదేశంలోని విద్యావంతులను బాగా తీర్చిదిద్దాయని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు.

ఆర్కే లక్ష్మణ్‌ కార్టూన్లపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌  

హైదరాబాద్‌: ఆర్కే లక్ష్మణ్‌ కార్టూన్లు భారతదేశంలోని విద్యావంతులను బాగా తీర్చిదిద్దాయని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. మేధావులు, విద్యావంతులకు సమాజ పోకడలకు సంబంధించిన విషయాలను తన కార్టూన్ల ద్వారానే తెలిపారని కొనియాడారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని ఫ్టాప్సీలో ఆర్కే లక్ష్మణ్‌ స్మారకోపన్యాసానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్కే లక్ష్మణ్‌ రూపొందించిన కామన్‌మ్యాన్‌ కార్టూన్‌ సమాజంలో సమకాలీన మానవుని హృదయాన్ని ఆవిష్కరింపజేసిందని ఆయన ప్రశంసించారు.

సమాజంలో నెలకొన్న సమస్యలు, రాజకీయ, సామాజిక స్థితిగతులు తదితర విషయాలు తన కార్టూన్ల ద్వారా ఆవిష్కరించారని అన్నారు. ఆర్కే లక్ష్మణ్‌ ఒక పొలిటికల్‌ సైంటిస్ట్‌ అని, విమర్శకుడు అని కొనియాడారు. ఆర్కే ఐపీఆర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి ఉషా లక్ష్మణ్‌ మాట్లాడుతూ... ఆర్కే లక్ష్మణ్‌ పేరిట అంతర్జాతీయ స్థాయి కార్డూన్‌ అకాడమీని స్థాపించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్టాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోడీ, ఫిక్కీ తెలంగాణ కౌన్సిల్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement