కేంద్ర మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి: జగన్ | Rohith Vemula is brilliant student, says ys jagan | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి: జగన్

Published Wed, Jan 20 2016 12:53 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

కేంద్ర మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి: జగన్ - Sakshi

కేంద్ర మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి: జగన్

హైదరాబాద్: హెచ్సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన కేంద్ర మంత్రులతో పాటు వీసీపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులపై చర్య తీసుకోవాలని ఓ కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రికి లేఖ రాశారని, కేంద్ర మంత్రి లేఖ రాయడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిదని విమర్శించారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం హెచ్సీయూకు వెళ్లి విద్యార్థి సంఘాల నాయకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సస్పెన్షన్కు గురైన నలుగురు విద్యార్థులతో జగన్ మాట్లాడారు. హెచ్సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపి, రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

హెచ్సీయూలో జరిగిన ఘటనలపై సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని జగన్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారిని వారు ప్రశ్నించుకోవాలని పేర్కొన్నారు. రోహిత్పై చర్యలు తీసుకోవాలని వీసీకి లేఖలు మీద లేఖలు రాయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ నేలపై మానవత్వం మాయమైపోతోందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ తెలివైన విద్యార్థి అని, అతనిది చాలా పేద కుటుంబమని, రోహిత్ తల్లి ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నుంచి అతన్ని ఉన్నత చదువుల కోసం హెచ్సీయూకు పంపారని చెప్పారు.

వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..

  • విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలి
  • రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని ప్రచారం చేయడంలో అర్థమేంటి?
  • చనిపోయాక కులంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదు
  • సామాజిక బహిష్కరణ అన్నది ఏ దృష్టితో చూసినా సరికాదు
  • ఈ తరహా ఘటనలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం
  • మొత్తం ఘటనను మార్చే ప్రయత్నం చేస్తున్నారు
  • విచారణ కమిటీలో ఉన్న వారికి మంచి పేరు లేదు
  • విద్యార్థులను విద్యార్థులగానే ఉండనివ్వండి
  • రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలి
  • విద్యార్థులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది
  • విద్యార్థుల డిమాండ్లను పరిశీలించాలి
  • ఈ ఘటనను పార్లమెంట్లో మా ఎంపీలు ప్రస్తావిస్తారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement