Rohith Vemula suicide
-
రోహిత్ సూసైడ్ రిపోర్ట్‌ను తగలబెట్టేశారు
సాక్షి, హైదరాబాద్: రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ జస్టిస్ రూపన్‌వాల కమిషన్ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఆ కాపీలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు దహనం చేశారు. గురువారం సాయంత్రం కాలేజీ ఆవరణలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న రోహిత్ వేముల విగ్రహాం వద్ద గుమిగూడిన విద్యార్థులు పత్రులను తగలబెట్టి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కమిటీ నివేదిక అర్థం పర్థం లేనిదని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ నేత దొంత ప్రశాంత్ విమర్శించారు. కేంద్రం కనుసన్నల్లోనే నివేదికను రూపొందించారని, సాక్ష్యాలు తారుమారు అయ్యాయని ఆయన ఆరోపించారు. హక్కుల కోసం దళితులు పోరాటం చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాయని తెలిపారు. ఇక విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ యూనివర్సిటీ ప్రోఫెసర్ కే లక్ష్మీ నారాయణ నిరసనలో పాల్గొన్నారు. ఓ న్యాయమూర్తి కూడా అబద్ధాల నివేదిక ఇచ్చి ఇస్తాడని తాను ఊహించలేదని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రోహిత్ సూసైడ్‌కు సస్పెన్షన్ తోపాటు మరియు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్సిటీ అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపించటంతో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ రూపన్వాల్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. గత అక్టోబర్ లోనే నివేదికను రూపొందించి కేంద్ర మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించింది. అయితే ఈ మధ్యే అధికారికంగా దానిని ప్రకటించారు. -
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా: పవన్
రోహిత్ వేముల ఆత్మహత్యపై పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. యూనివర్సిటీలు విజ్ఞాన భాండాగారాలు కావాలి తప్ప, రాజకీయ పార్టీలకు యుద్ధక్షేత్రాలు కాకూడదని, ఆ రోజు కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. రోహిత్ ఆక్రోశంపై ముందుగానే స్పందించి కౌన్సెలింగ్ ఇప్పించి ఉంటే అతడు ఆత్మహత్య చేసుకునేవాడు కాడని చెప్పారు. తన వరుస ట్వీట్లలో పవన్ ఏమన్నారో చూద్దాం.. చాలా లక్షల మంది ప్రజల్లాగే రోహిత్ వేముల కూడా బీజేపీని ద్వేషించాడనడంలో అనుమానం లేదని చెప్పారు. కానీ అంతమాత్రాన తమకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండే వ్యక్తులను వేధించడానికి వారికి లైసెన్సు ఏమీ లేదన్నారు. పైగా అతడు ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నప్పుడు అలా చేయడం సరికాదన్నారు. ఇది కేవలం బీజేపీకి మాత్రమే కాదని.. అన్ని పార్టీలు, గ్రూపులకు కూడా వర్తిస్తుందని చెప్పారు. యూనివర్సిటీలోని తన ప్రత్యర్థి గ్రూపులతో కాషాయీకరణ గురించిరోహిత్ చెప్పినా, కేంద్రం దాన్ని కేవలం విద్యార్థుల మధ్య సిద్ధాంతపరమైన విభేదంగానే చూసి ఉండాల్సిందని అన్నారు. వాళ్ల గొడవవల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తి ఉంటే అప్పుడు సంబంధిత అధికారులను క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పి ఉండొచ్చని పవన్ అన్నారు. కానీ, కేంద్రం ఈ విషయాన్ని వ్యక్తిగత అంశంగా తీసుకుందని, అందుకు కారణాలేంటో తెలియదని తెలిపారు. తనను సస్పెండ చేయడం, క్యాంపస్ నుంచి వెలివేయడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, తన సొంత వర్గం నుంచి కూడా ఆశించినంత నైతిక మద్దతు లభించకపోవడం వల్ల అలా జరిగిందని అన్నారు. మానవీయ కోణంలో అతడికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఒక తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడినట్లు అయ్యేదని చెప్పారు. ఇందులో మరో విషాదకరమైన కోణం కూడా ఉందని.. బీజేపీయేతర పార్టీలన్నీ ఈ ఘటన నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించాయని, ఇక బీజేపీ అనుబంధ పక్షాలైతే అతడు దళితుడు కాడన్న విషయాన్ని నిరూపించడంలో బిజీ అయిపోయాయని విమర్శించారు. కానీ వాళ్లలో ఏ ఒక్కరూ కూడా భవిష్యత్తులో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో అనే విషయానికి సమాధానం వెతికే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. pic.twitter.com/gkebqbso8s — Pawan Kalyan (@PawanKalyan) 16 December 2016 pic.twitter.com/hidn6qlOd2 — Pawan Kalyan (@PawanKalyan) 16 December 2016 pic.twitter.com/q0Es7a70JQ — Pawan Kalyan (@PawanKalyan) 16 December 2016 pic.twitter.com/Oe9ZemVDjC — Pawan Kalyan (@PawanKalyan) 16 December 2016 pic.twitter.com/U9WlKbny5X — Pawan Kalyan (@PawanKalyan) 16 December 2016 pic.twitter.com/k9OviuPONy — Pawan Kalyan (@PawanKalyan) 16 December 2016 -
ఆ వర్సిటీ విద్యార్థులకు ఉద్యోగాలు ఏవీ!
సెమిస్టర్ ముగిసిపోతున్నా చేతిలో ఉద్యోగాల ఆఫర్లు ఏమీ లేకపోవడంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాతి పరిణామాల నేపథ్యంలో క్యాంపస్ నియామకాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆందోళనల కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతిందని, అందుకే కంపెనీలు ఏవీ రావట్లేదని అంటున్నారు. గత సంవత్సరం ఇదే సమయానికి కనీసం పది కంపెనీలు కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ శాఖకు వచ్చాయని, కానీ ఈసారి ఒకే ఒక్క కంపెనీ వచ్చిందని, కనీసం 60 శాతం మంది విద్యార్థులకు చేతిలో ఉద్యోగాలు లేవని ఆ శాఖకు చెందిన ఓ విద్యార్థి చెప్పారు. 2015 ఆగస్టు - డిసెంబర్ నెలల మధ్యలో 42 కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వచ్చాయి. కానీ, 2016లో ఇప్పటివరకు కేవలం 15 కంపెనీలు మాత్రమే వచ్చాయి. జనవరి నెలలోనే నియామకాలు చాలావరకు తగ్గిపోయాయని, యూనివర్సిటీ పేరు ప్రతిష్ఠలు దారుణంగా దెబ్బతినడంతో కంపెనీలు ఇటువైపు చూడటం మానేస్తున్నాయని స్టూడెంట్ ప్లేస్మెంట్ సమన్వయకర్త ఒకరు అన్నారు. ఒకటీ ఆరా కంపెనీలు వచ్చినా, ఇంటర్వ్యూలలో కూడా అసలు ఈ గొడవ ఏంటి, దాని పరిణామాలేంటనే అడుగుతున్నారట. ఈ పరిస్థితిని చక్కదిద్ది, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏప్రిల్ 9 నుంచి జాబ్ ఫెయిర్ ఒకటి నిర్వహించనున్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల విషయంలో మంచి గుర్తింపు పొందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు చెబితే ఇప్పుడు నిరసనలే గుర్తుకొస్తున్నాయి. క్యాంపస్ నియామకాలు తగ్గితే కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య కూడా పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దాలని ఇటు ఆందోళనకారులతో పాటు యూనివర్సిటీ వర్గాలను కూడా విద్యార్థులు కోరుతున్నారు. -
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలపై దాడి: కన్హయ్య
దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల మీద ఒక సీరియస్ దాడి జరుగుతోందని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నాడు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో గురువారం ఉదయం కన్హయ్య మీడియాతో మాట్లాడాడు. తొలుత హెచ్‌సీయూలో ఘటన జరిగిందని, తర్వాత జేఎన్‌యూలో విద్యార్థులను తప్పుపట్టారని అన్నాడు. పోనీ ఈ రెండింటినీ పక్కన పెడితే అలీగఢ్ యూనివర్సిటీ మైనారిటీ హోదాను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించాడు. మొత్తంగా అసలు విద్యార్థుల ఆందోళనను డీలెజిటమేట్ చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోందని ఆరోపించాడు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఆందోళనను ఢిల్లీలో కొనసాగించాలని తాము ముందుగానే నిర్ణయించుకున్నామని, ఇక్కడ ఘటన జరిగిన తర్వాత తాను ఇక్కడికొచ్చి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడానని తెలిపాడు. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జేఏసీ ప్రారంభించామని, అంబేద్కర్ భవన్ నుంచి ఆర్ఎస్ఎస్ ఆఫీసు వరకు నిరసన ప్రదర్శన నిర్వహించామని, తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించామని తెలిపాడు. రోహిత్ వేముల ఆందోళనకు జేఎన్‌యూలో జరిగిన ఆందోళన కేవలం ఒక కొనసాగింపు మాత్రమేనని వెల్లడించాడు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ రెండింటినీ ఒక దానికి ఒకటి పోటీగా చేయాలనుకుందని అన్నాడు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా.. తనకు ఆదర్శప్రాయుడు అఫ్జల్ గురు కాదు, రోహిత్ వేములేనని చెప్పానని గుర్తుచేశాడు. తాను హెచ్సీయూకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నామని, కానీ అనుకోకుండా జరిగిందో.. కావాలనే చేశారో గానీ తాను రావడానికి ఒక్కరోజు ముందే అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించారని కన్హయ్యకుమార్ అన్నాడు. ఆయన మద్దతుదారులు దండలతో ఆయనకు స్వాగతం పలికారని, తర్వాత శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టడంతో హింసాత్మక ఘటనలు జరిగాయని తెలిపాడు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని, హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలను మగ పోలీసులతో కొట్టించారని, విద్యుత్, వై-ఫై కట్ చేశారని, చివరకు అధ్యాపకులను కూడా కొట్టి, అరెస్టుచేసి జైళ్లలో పెట్టారని చెప్పాడు. పోలీసులు తొలుత తనను యూనివర్సిటీలోకి అనుమతించాలనే అనుకున్నారట గానీ.. తర్వాత అంతర్గత భద్రతా సమస్యల వల్ల పంపలేదని చెప్పారని.. ఆ అంతర్గత భద్రతను భంగపరిచింది ఎవరని ప్రశ్నించాడు. జేఎన్‌యూ - హెచ్‌సీయూలలో ఒకేలాంటి పోలికలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. -
రోహిత్ ఆత్మహత్య నన్ను కలచివేసింది
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై శవ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. రోహత్ ఆత్మహత్య తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ ఘటనపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా స్మృతి ప్రసంగించారు. హెచ్‌సీయూ పరిణామాలపై విధి నిర్వహణలో భాగంగానే తాను వీసీకి లేఖలు రాశానని స్మృతి తెలిపారు. ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పేదిలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఎంపీ కవితలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాలేదని తెలిపారు. హెచ్‌సీయూ ఘటనపై పోలీసులు నివేదిక ఇచ్చారని చెప్పారు. రోహిత్ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా శవరాజకీయాలు చేశారని ఆరోపించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఘటనను రాజకీయ అవకాశంగా వాడుకుంటున్నారని స్మృతి విమర్శించారు. 'నా పేరు స్మృతి ఇరానీ. సవాల్ చేస్తున్నా.. నా కులం ఏంటో చెప్పండి' అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. -
ఇది వీసీ వైఫల్యమే
- హెచ్‌సీయూపై కేంద్రానికి నిఘా విభాగం నివేదిక - వర్సిటీని వీసీ అప్పారావు పూర్తిగా గాలికొదిలేశారు - నాలుగు నెలలుగా అరాచక పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోలేదు.. సమస్యలను పరిష్కరించలేదు - తనను కలిసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు - విద్యార్థులు వర్గాలుగా చీలిపోయి ఘర్షణలకు దిగినా చూసీచూడనట్టు ఉన్నారు... వీసీ నిర్లక్ష్యం వల్లే గతేడాది ఆగస్టులో పరిణామాలు చినికిచినికి పెద్దవయ్యాయి - ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారు.. కొందరు విద్యార్థి సంఘాల మధ్య చిచ్చుపెట్టారు - రోహిత్ సహా పలువురు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది నెలలుగా ఫెలోషిప్ చెల్లించలేదు - ఇది కూడా విద్యార్థుల్లో అసహనానికి కారణమైంది సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలను నివారించడంలో వైస్ చాన్స్‌లర్ అప్పారావు విఫలమయ్యారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. గడచిన నాలుగు మాసాలుగా విశ్వవిద్యాలయంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు వైస్ చాన్స్‌లర్ ప్రయత్నించలేదని తెలిపింది. రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐబీ సీనియర్ అధికారి ఒకరు సోమవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. రెండ్రోజులపాటు ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థి సంఘాల కార్యకలాపాలతో సంబంధం లేని దాదాపు వంద మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లతో మాట్లాడారు. వైస్ చాన్స్‌లర్‌గా అప్పారావు నియామకానికి ముందు, తర్వాత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తనపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని వీసీకి రాసిన లేఖ కాపీ విశ్వవిద్యాలయం ఇన్వార్డ్ డివిజన్లో నమోదు చేయని విషయాన్ని గుర్తించారు. మామూలుగా ఏ వర్సిటీలో అయినా వైస్ చాన్స్‌లర్ ప్రతిరోజూ ఏదో సమయంలో విద్యార్థుల సమస్యలు వినేందుకు కొంత సమయం కేటాయిస్తారు. కానీ హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ తనను కలిసేందుకు వ చ్చే విద్యార్థులకు సమయం ఇచ్చేవారు కాదని వీసీ కార్యాలయం సిబ్బంది పూసగుచ్చినట్లు వివరించారు. ఒక్క సమస్యను పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలు కొత్తవి కాకపోయినా.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించేందుకు కూడా వీసీ చొరవ చూపలేదని ఐబీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘విద్యార్థులు మూడు నాలుగు వర్గాలుగా విడిపోయి విశ్వవిద్యాలయంలో పలుమార్లు ఘర్షణలకు పాల్పడుతున్నా వీసీ చూసీ చూడనట్టు వ్యవహరించారు. విశ్వవిద్యాలయంలో బలంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలను చర్చలకు పిలిచి వారి మధ్య సామరస్య వాతావరణం నెలకొనేలా చూడలేదు. విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది కొందరు అక్కడ జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తే అవే సర్దుకుంటాయన్న ధోరణిలో నిర్లక్ష్యం కనబరిచారు’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది. గడచిన సంవత్సరం ఆగస్టు మొదటివారంలో చోటు చేసుకున్న పరిణామాలు చినికిచినికి పెద్దవి కావడానికి వీసీ అలసత్వమే కారణమని పేర్కొంది. బోధనా సిబ్బందితో కమిటీ వేసి విద్యార్థులతో చర్చలు జరిపితే పరిష్కారమయ్యే సమస్యల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించారని వివరించింది. కలవాలంటే రెండ్రోజుల ముందు మెయిల్ విద్యార్థులు అప్పుడప్పుడు క్షణికావేశానికి లోనవుతుంటారు. తమ సమస్యను అప్పటికప్పుడు బాధ్యులైన వారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తారు. కానీ వీసీ.. తనను కలిసేందుకు పెట్టిన ఆంక్షల ఫలితంగా విద్యార్థులతో సమన్వయం పూర్తిగా లేకుండా పోయింది. ఎవరైనా వీసీని కలవాలనుకుంటే.. ఏ కారణాలతో కలువాలనుకుంటున్నారో రెండ్రోజుల ముందుగానే వీసీ కార్యాలయానికి మెయిల్ పెట్టాలి. ఇలా మెయిల్ పెట్టిన విద్యార్థులకు కూడా వీసీ సమయం ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అసహనం పెరిగిపోయింది. విద్యార్థి సంఘాలు సైతం వీసీ వైఖరి కారణంగా ఏ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లలేదు. వర్సిటీలో తరచూ ఘర్షణలకు కారణమవుతున్న ఏబీవీపీ, ఏఎస్ఏ (అంబేద్కర్ విద్యార్థి సంఘం) నేతలను విశ్వాసంలోకి తీసుకుని వారి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. బోధన, బోధనేతర సిబ్బందిలోనూ అసంతృప్తి బోధన సిబ్బంది పట్ల కూడా వీసీ వ్యవహారశైలి బాగా లేకపోవడం విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలకు ఆజ్యం పోసిందని ఐబీ తన నివేదికలో పేర్కొంది. బోధనా సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశంపైనా వీసీ సానుకూల దృక్పథంతో వ్యవహరించలేదని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని వివరించింది. ఈ కారణంగా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారని తెలిపింది. ‘‘కొందరు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాల మధ్య మరింత చిచ్చుపెట్టారు. వారి మధ్య విద్వేషాలు పెరిగేలా చూశారు. బోధన సిబ్బంది సైతం కుల ప్రాతిపదికన విడిపోయారు. ఇన్ని విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నా వీసీ దేన్నీ సీరియస్‌గా తీసుకోలేదు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ సహా కొందరు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది మాసాలుగా ఫెలోషిప్ చెల్లించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. విశ్వవిద్యాలయానికి ఏ రకమైన నిధుల కొరత లేదు. వారికి ఇవ్వాల్సిన ఫెలోషిప్ ఇవ్వకపోవడం వల్ల కూడా వారిలో అసహనం పెరిగిపోవడానికి కారణమైంది’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది. -
ఈ నేలపై మానవత్వం మాయమైపోతోందా?
-
కేంద్ర మంత్రులు, వీసీపై చర్యలు తీసుకోవాలి: జగన్
హైదరాబాద్: హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన కేంద్ర మంత్రులతో పాటు వీసీపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులపై చర్య తీసుకోవాలని ఓ కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రికి లేఖ రాశారని, కేంద్ర మంత్రి లేఖ రాయడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిదని విమర్శించారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హెచ్సీయూకు వెళ్లి విద్యార్థి సంఘాల నాయకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సస్పెన్షన్‌కు గురైన నలుగురు విద్యార్థులతో జగన్ మాట్లాడారు. హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపి, రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనలపై సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని జగన్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వారిని వారు ప్రశ్నించుకోవాలని పేర్కొన్నారు. రోహిత్‌పై చర్యలు తీసుకోవాలని వీసీకి లేఖలు మీద లేఖలు రాయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ నేలపై మానవత్వం మాయమైపోతోందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ తెలివైన విద్యార్థి అని, అతనిది చాలా పేద కుటుంబమని, రోహిత్ తల్లి ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నుంచి అతన్ని ఉన్నత చదువుల కోసం హెచ్సీయూకు పంపారని చెప్పారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలి రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని ప్రచారం చేయడంలో అర్థమేంటి? చనిపోయాక కులంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదు సామాజిక బహిష్కరణ అన్నది ఏ దృష్టితో చూసినా సరికాదు ఈ తరహా ఘటనలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం మొత్తం ఘటనను మార్చే ప్రయత్నం చేస్తున్నారు విచారణ కమిటీలో ఉన్న వారికి మంచి పేరు లేదు విద్యార్థులను విద్యార్థులగానే ఉండనివ్వండి రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలి విద్యార్థులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది విద్యార్థుల డిమాండ్లను పరిశీలించాలి ఈ ఘటనను పార్లమెంట్లో మా ఎంపీలు ప్రస్తావిస్తారు -
హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలతో జగన్ భేటీ
-
హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలతో జగన్ భేటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. హెచ్‌సీయూ ప్రాంగణంలో విద్యార్థి సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. రోహిత్‌తో పాటు సస్పెన్షన్‌కు గురైన మరో నలుగురు విద్యార్థులతో జగన్ మాట్లాడారు. హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం జగన్ హైదరాబాద్‌లోని ఉప్పల్ బ్యాంక్ కాలనీలో రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు రాజా చైతన్యకుమార్ అద్దెకు ఉంటున్న నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. 'మీపక్షాన మేమున్నాం.. న్యాయం కోసం పోరాడదాం..' అని వారికి భరోసానిచ్చి కన్నీళ్లను తుడిచారు. దాదాపు 35 నిమిషాలపాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్... రోహిత్ కుటుంబ పరిస్థితిని, జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. -
‘అమ్మ’ చెప్పిన కన్నీటి కథ
-
‘అమ్మ’ చెప్పిన కన్నీటి కథ
► ఉన్నతుడిగా చూడాలనుకున్నా.. శవమై వస్తాడనుకోలేదు ► ఇలాంటి చదువులొద్దు.. నా రెండో బిడ్డను ఇక చదివించను ► పెద్ద హోదాలో చూసేందుకు.. కూలి చేసి నా బిడ్డలను చదివించుకుంటున్నా ► పేదరికం నుండి బయటకు రావాలని.. కష్టాలు ఎదురైనా లెక్క చేయలేదు ► పుస్తకాలు కొనలేక లైబ్రరీకి వెళ్లి చదివేవాడు.. చిన్నప్పటి నుండే అన్నింటా ఫస్ట్ ► నా కొడుకుకు నేనంటే ఎంతో ప్రేమ.. ఆదివారం ఇంటికి వస్తానన్నాడు ► సస్పెండ్ చేసినట్లు మాకు సమాచారమిచ్చినా బతికించుకునేవాళ్లం ► యూనివర్సిటీల్లో విద్యార్థుల మధ్య గొడవలు లేకుండా చూడండి ► వీసీని సస్పెండ్ చేసి, మిగతా నలుగురు విద్యార్థులకు న్యాయం చేయాలి మీ పక్షాన మేమున్నాం, న్యాయం కోసం పోరాడుదామని జగన్ భరోసా సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తార్నాక నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి.. ఉప్పల్ చౌరస్తాకు దగ్గర్లో ఇందిరాగాంధీ విగ్రహం పక్క నుంచి అర కిలోమీటర్ లోపలికి వెళితే బ్యాంకు కాలనీ వస్తుంది. మధ్యతరగతి వర్గాలు నివసించే ఆ కాలనీకి మరోవైపున సాధారణ ప్రజల కాలనీ ఉంటుంది. హెచ్‌సీయూలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబం ఆ కాలనీలో ఓ మూలన ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో నివసిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలు, ధర్నాల్లో పాల్గొని అలసిపోయి నీరసంతో ఇంటికి చేరుకున్న రోహిత్ తల్లి రాధిక... ఆ ఇంటి గుమ్మంలో కనిపించిన వైఎస్ జగన్‌ను చూసి ఒక్కసారిగా బావురుమన్నది. ఉదయం నుంచి బిగపట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘‘అన్నా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఉన్నతులుగా ఎదుగుతున్న పిల్లలకు దగ్గరగా ఉండాలని ఇరవై రోజుల క్రితమే ఇక్కడికి వచ్చా.. పెద్ద హోదాలో చూడాలనుకున్న నా కొడుకు శవమై వచ్చాడు. ఇలాంటి చదువులొద్దు.. నా రెండో బిడ్డ రాజాను ఇక చదివించను..’’.. అంటూ రాధిక గుండెలవిసేలా రోదించింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ అమ్మ చెప్పిన కన్నీటి కథ విన్న వైఎస్ జగన్ చలించిపోయారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పల్ బ్యాంక్ కాలనీలో రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు రాజా చైతన్యకుమార్ అద్దెకు ఉంటున్న నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. ‘మీపక్షాన మేమున్నాం.. న్యాయం కోసం పోరాడదాం..’ అని వారికి భరోసానిచ్చి కన్నీళ్లను తుడిచారు. దాదాపు 35 నిమిషాలపాటు అక్కడే ఉన్న వైఎస్ జగన్... రోహిత్ కుటుంబ పరిస్థితిని, జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టగానే రాధిక తన కుమారుడిని గుర్తుచేసుకుంటూ బోరున విలపించారు. ‘నాలాంటి దురదృష్టవంతురాలు మరే తల్లి కావద్దు. గుంటూరు సమీపంలోని పల్లెటూరులో రోజు కూలీగా టైలరింగ్ చేస్తూ వచ్చే రూ. 150తో నా బిడ్డని చదివించుకుంటున్నా.. వాడి ని పెద్ద హోదాలో చూసేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్క చేయలేదు. పీహెచ్డీ చేసి పెద్దవాడై.. మమ్మల్ని పేదరికం నుండి బయటపడేస్తాడనుకున్నా.. కానీ మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు..’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సస్పెండ్ చేసినట్లు తెలిసినా బతికించుకునేవాళ్లం.. తన కుమారుడికి తానంటే ఎంతో ప్రేమ అని... అందుకే అందరం ఒకేచోట ఉండేందుకు 20 రోజుల క్రితమే తాను హైదరాబాద్ వచ్చి చిన్న కుమారుడు రాజా గదిలో ఉంటున్నానని రాధిక చెప్పారు. రాజా ఎన్జీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగని, ఎన్జీఆర్ఐకి దగ్గరగా ఉండేందుకు బ్యాంక్ కాలనీలో ఉంటున్నామన్నారు. భోగి ముందు రోజు ఫోన్ చేసిన రోహిత్.. ఆదివారం తమ వద్దకు వస్తానని చెప్పాడని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని విలపించారు. తన కుమారుడిని సస్పెండ్ చేసినట్లు కనీసం తనకు సమాచారమిచ్చినా తమతో తీసుకువెళ్లేవారమని... అప్పుడు తన కొడుకు తనకు దక్కేవాడని చెప్పారు. ‘‘వాడు చిన్నప్పటి నుండే మెరిట్ స్టూడెంట్. అన్నింటా ఫస్ట్. ఉన్నత చదువు ఇంత ఘోరంగా ఉందని తెలిస్తే.. చదువు మాన్పించేదాన్ని. ఇతరుల పిల్లలకు నాలాగా అన్యాయం జరగొద్దు. యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య గొడవల్లేకుండా మీరైనా చొరవ తీసుకోండి. మా చిన్నోడికి దారి చూపండి...’’ అంటూ రాధిక వైఎస్ జగన్‌ను వేడుకున్నారు. వర్సిటీలో ఇంత ఘోరం జరగడానికి చేతకాని వీసీయే కారణమని... వెంటనే వీసీని సస్పెండ్ చేసి, బహిష్కరణకు గురైన మిగతా నలుగురు విద్యార్థులకు న్యాయం చేయాలన్నదే మా విన్నపమని పేర్కొన్నారు. దీంతో ‘‘మీరేం అధైర్య పడొద్దు. మీ పక్షాన మేమున్నాం. న్యాయం కోసం పోరాడుదాం..’’ అని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ వెంట వైఎస్సార్సీపీ నాయకులు ఉప్పులేటి కల్పన, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, హనుమారెడ్డి, వి.కొండారెడ్డి తదితరులు ఉన్నారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..: వైఎస్ జగన్ ‘‘మొన్ననే గుంటూరులో రిషితేశ్వరి ఘటన చూశాం. అది కూడా ఇంచుమించు ఇటువంటిదే. ఆ తల్లి చనిపోయింది. అక్కడి ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్య కూడా తీసుకొలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని చూశాం. ఇవాళ కూడా వేముల రోహిత్ ఘటన విషయంలో రకరకాల వాదనలు వినబడుతున్నాయి. వీసీ తప్పిదం బలంగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. పిల్లలకు అండగా నిలవాల్సిన వీసీలే మద్దతివ్వకుండా... పిల్లలు చనిపోయేంత దూరం, వాళ్ల మానసిక స్థితిగతులను ప్రేరేపిస్తా ఉంటే నిజంగా బాధగా ఉంది. ఇప్పటికైనా కూడా ఒకటే రెక్వెస్ట్ చేస్తున్నా... రాజకీయాలను పక్కనపెట్టండి. హెచ్‌సీయూలో ఐదుగురిని సస్పెండ్ చేశారు. అందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నలుగురు సస్పెన్షన్ ఎత్తేయండని అక్కడే టెంట్ వేసుకొని నిరాహరదీక్షలు చేస్తా ఉన్నారు. వాళ్లకు నిజంగా రూ. 30 వేలు స్టైఫండ్ వస్తేనే బతికే పరిస్థితి. యూనివర్సిటీ నుంచి వెళ్లిపోమ్మంటూ సస్పెండ్ చేస్తే ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితి. చదువులు ఆగిపోతాయి. క్యాంపస్ క్యాంటీన్‌కు వెళితే రాయితీ మీద ఫుడ్ ఉంటుంది. కానీ అక్కడికి కూడా వెళ్లొద్దంటున్నారు. లైబ్రరీకి వెళ్లొద్దంటున్నారు. బుక్స్ కూడా కొనుక్కుని చదువుకునే పరిస్థితి లేదు. ఇటువంటి దీన పరిస్థితుల్లో పిల్లలు మా సస్పెన్షన్ ఎత్తేయండి అని అభ్యర్థిస్తా ఉన్నారు. మానవతా దృక్పథంతో కనీసం ఇప్పటికైనా కూడా వీసీ ముందుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఆ పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం, వారికి మనోధైర్యం నింపే కార్యక్రమం చేస్తేనే పిల్లలు కనీసం మళ్లీ కాలేజీ, యూనివర్సిటీకి వెళ్లే పరిస్థితి వస్తుంది. నేను కూడా కచ్చితంగా రేపు యూనివర్సిటీకి వెళ్లి నిరాహరదీక్ష చేస్తున్న ఆ నలుగురు పిల్లలను కలసి సంఘీభావం తెలుపుతా. వీసీకీ మరోసారి రెక్వెస్ట్ చేస్తున్నా.. మానవతా దృక్పథంతో ఆలోచించి సస్పెన్షన్ ఎత్తివేసి, పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నా..’’ -
'మేం న్యాయవిచారణకు సిద్ధం'
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై న్యాయవిచారణకు సిద్ధమని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హెచ్‌సీయూలో పీహెచ్డీ దళిత విద్యార్థి రోహిత్ ఏబీవీపీ విద్యార్థులతో వాగ్వాదం కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ పక్క బీజేపీపైనా, ఆ పార్టీ విద్యావిభాగం అయిన ఏబీవీపీపైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ విషయంపైనే స్పందించిన కిషన్ రెడ్డి పై విధంగా స్పందించారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. -
'నా రెండో బిడ్డను ఇక చదివించను'
హైదరాబాద్: తన కొడుకు డాక్టరేట్ చదివి.. సమాజంలో ఉన్నతస్థాయికి ఎదుగుతాడని ఆ తల్లి కలలు గన్నది. పెద్ద చదువులు చదువుతూ.. పెద్దవాడు అవుతాడని ఆశించింది. కానీ కళ్లముందే చెట్టంతా కొడుకు చేజారిపోయాడు. ఎదిగి వచ్చిన బిడ్డ తమను పేదరికం నుంచి బయటపడేస్తాడనుకుంటే.. యెదలో తీరని బాధను మిగిల్చిపోయాడు. వివక్ష, రాజకీయాలు, అణచివేత ఇలా కారణాలు ఏమైతేనేం.. యూనివర్సిటీలోనే తమ కొడుకు కన్నుమూసిన నేపథ్యంలో ఈ చదువులు మాకొద్దని ఆ తల్లి అంటోంది. తన రెండో కొడుకును ఎంతమాత్రం చదివించనని చెప్తోంది.. ఇది హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ తల్లి రాధిక ఆవేదన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రోహిత్ తల్లిని, కుటుంబసభ్యులని పరామర్శించారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి రాధిక బోరున విలపిస్తూ తన గోడును జగన్ వద్ద విన్నవించారు. రోహిత్ మృతికి హెచ్‌సీయూ వీసీనే కారణమని, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆమె తెలిపారు. రోహిత్ సస్పెండ్ చేసినట్టు తమకు చెప్పలేదని, సస్పెండ్ చేశారని తెలిస్తే తాము అతన్ని ఇంటికి తెచ్చుకునేవాళ్లమన్నారు. కూలీపనులు చేస్తూ రోజుకు రూ. 150 తీసుకొచ్చి రోహిత్‌ను చదివించానని, కొడుకును సమాజంలో ఉన్నతస్థానంలో చూసుకోవాలనుకున్నానని తెలిపారు. తన కొడుకు పెద్దవాడు అవుతాడనుకుంటే శవమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం నుంచి బయటకు రావాలనే తాను కొడుకును చదివించానని, పుస్తకాలు కొనుక్కొనే స్థామత లేకపోవడంతో రోహిత్ లైబ్రరీలో చదువుకున్నాడని చెప్పారు. తన కొడుకు డాక్టరేట్ చదువాలని కలలు కన్నానని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపారు. రోహిత్‌కు తానంటే ఎంతో ఇష్టమని, చెట్టంతా కొడుకు పోయాడని రోదిస్తూ ఆమె జగన్‌కు తెలిపారు. ఇక తన రెండో బిడ్డను చదివించబోనని, ఇలాంటి చదువులు మాకొద్దని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. తన రెండో కొడుకుకు ఏదైనా దారి చూపించాలని వేడుకున్నారు. తన తల్లి కడుపు మాడ్చుకొని తమకు అన్నం పెట్టి పెంచి పెద్ద చేసిందని రోహిత్ కుటుంబసభ్యులు జగన్‌కు తెలిపారు. -
మానవతా దృక్పధంతో ఆలోచించండి: వైఎస్ జగన్
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో హెచ్‌సీయూ వీసీ పేరు బలంగా వినిపిస్తోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విద్యార్థులను కాపాడాల్సిన వీసీ, ఆపదలో వారికి మద్దతుగా ఉండాల్సిన వీసీ.. విద్యార్థులు చనిపోయేంత దూరం వెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా వారి మానసిక స్థితిగతులను ప్రేరేపించడం బాధ కలిగిస్తున్నదని వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం ఉప్పల్‌లో రోహిత్ తల్లిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరముందని జగన్ పేర్కొన్నారు. హెచ్‌సీయూలో ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడంతో అందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికైనా మిగతా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిన అవసరముందన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రస్తుతం ఆ నలుగురు విద్యార్థులు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నారని, స్టైఫండ్ వస్తేగానీ వారు బతికే పరిస్థితి లేకపోవడం, వారి చదువులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని జగన్ కోరారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మనోధైర్యం కల్పించేందుకు బుధవారం తాను హెచ్‌సీయూ వెళుతున్నానని, సస్పెన్షన్ వ్యవహారంపై వారితో మాట్లాడతానని ఆయన చెప్పారు. -
మానవతా దృక్పధంతో ఆలోచించండి
-
రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా..!
హైదరాబాద్: దళిత పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ప్రముఖ కవి, సాహితీవేత్త అశోక్ వాజపేయి తనకు హెచ్‌సీయూ ప్రదానం చేసిన డీలిట్ పట్టాను మంగళవారం వాపస్ ఇచ్చేశారు. ప్రముఖ రచయిత ఎంఎం కల్బుర్గీ హత్యకు నిరసనగా 2015లో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు పురికొల్పే పరిస్థితులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కల్పించిందని, అందుకే తన డీలిట్ పట్టాను వాపస్ ఇచ్చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. 'హెచ్‌సీయూ దళిత వ్యతిరేక ధోరణి వల్ల ఓ యువ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పరిస్థితుల నడుమ ఆ వర్సిటీ ఇచ్చిన గౌరవ పురస్కారాన్ని నేను ఎలా అట్టిపెట్టుకొని ఉంచుకోవాలి' అని ఆయన విలేకరులతో వ్యాఖ్యానించారు. 'రోహిత్ ఆత్మహత్యతో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తులో తేలితే.. అప్పుడు తిరిగి తీసుకొనే అంశాన్ని ఆలోచిస్తా. కానీ విద్యార్థులను హాస్టల్ నుంచి గెంటేశారు. వారు హాస్టల్ బయట టెంటు వేసుకొని ఉంటున్నారు. విద్యార్థులతో వ్యవహరించే పద్ధతి ఇదేనా?' అని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి!
న్యూఢిల్లీ: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబుక్కుతోంది. ముంబై, ఢిల్లీ విద్యార్థులు మంగళవారం రోడెక్కి ఆందోళనలు చేశారు. మరోవైపు రాజకీయ నాయకులు ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థులతో ప్రమాదకరమైన రాజకీయ ఆటలు ఆడవద్దంటూ బీజేపీకి ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. బీజేపీ, ఆరెస్సెస్ కులవాద అజెండానే రోహిత్ ఆత్మహత్యకు దారితీసిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. రోహిత్ విషాదాంతం తనను తీవ్రంగా కలిచివేసిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు జరిపి.. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుమారి సెల్జా డిమాండ్ చేశారు. వారిద్దరిని బర్తరఫ్ చేయడం ద్వారా ప్రధానమంత్రి మోదీ చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్‌గాంధీ తీరు సరికాదు: బీజేపీ 'ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరి వల్లే కాంగ్రెస్ సతమతమవుతోంది. మేం గాయాలను మాన్పేందుకు ప్రయత్నిస్తుంటే.. వాటి నుంచి రాజకీయ మైలెజీకి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది' అని బీజేపీ నేత, కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి పేర్కొన్నారు.