పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో హెచ్‌సీయూ వీసీ పేరు బలంగా వినిపిస్తోందని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విద్యార్థులను కాపాడాల్సిన వీసీ, ఆపదలో వారికి మద్దతుగా ఉండాల్సిన వీసీ.. విద్యార్థులు చనిపోయేంత దూరం వెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా వారి మానసిక స్థితిగతులను ప్రేరేపించడం బాధ కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఉప్పల్‌లో రోహిత్ తల్లిని, కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు.