'మేం న్యాయవిచారణకు సిద్ధం'
హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య ఘటనపై న్యాయవిచారణకు సిద్ధమని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హెచ్సీయూలో పీహెచ్డీ దళిత విద్యార్థి రోహిత్ ఏబీవీపీ విద్యార్థులతో వాగ్వాదం కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఓ పక్క బీజేపీపైనా, ఆ పార్టీ విద్యావిభాగం అయిన ఏబీవీపీపైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ విషయంపైనే స్పందించిన కిషన్ రెడ్డి పై విధంగా స్పందించారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.