రాష్ట్రంపై రోజుకు రూ.60 కోట్ల రుణభారం
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న అసమర్థ విధానాల వల్ల రాష్ట్రంపై రోజుకు రూ. 60 కోట్ల రుణభారం పడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ముఖ్యమంత్రి అవగాహనలేమి, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర తలసరి అప్పు రెండేళ్లలోనే రెట్టింపు అయిందని వివరించారు.
తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.61,710 కోట్లున్న అప్పు ఈ సంవత్సరం ఒక లక్షా 23వేల కోట్లకు చేరువలో ఉందన్నారు. ఇప్పటిదాకా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రతీ రోజు 59 కోట్ల రూపాయల అప్పు చేస్తే తప్ప పాలన సాగడంలేదని ఉత్తమ్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాల ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంపై ప్రభుత్వం రుద్దుతున్న అప్పుల గురించి అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు.