విద్యాశాఖ వేతనాల్లో కొనసాగుతున్న వింత విధానం
సాక్షి, హైదరాబాద్: స్కూల్లో పాఠాలు చెప్పే విద్యా వలంటీర్‌కు వేతనం రూ.8,500.. అక్కడే అటెండర్‌గా పనిచేసే వారి వేతనం నెలకు రూ.12 వేలు. ఇదీ విద్యా శాఖలో నెలకొన్న వింత పరిస్థితి. పదో తరగతి అర్హతతో అటెండర్లుగా పనిచేస్తున్న వారికి ఇంత వేతనం వస్తుంటే.. డిగ్రీలు, డీఎడ్, బీఎడ్ చేసి విద్యా బోధన చేస్తున్న వారికి మాత్రం విద్యా శాఖ నెలకు రూ. 8,500 ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. క్షేత్ర స్థాయిలో విద్యా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లదీ అదే పరిస్థితి.
నెలకు రూ.9,500 వేతనంతో పనిచేయాల్సి వస్తోంది. కొద్ది రోజుల క్రితమే విద్యా వలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు పెంచిన వేతనాలు అమలు చేయడం లేదు. రెగ్యులర్ టీచర్లు లేని స్థానాల్లో విద్యా వలంటీర్లను నియమించి విద్యా శాఖ బోధన నిర్వహిస్తోంది. ఇందుకు అర్హతలు ఉన్న వారినే తీసుకుంటోంది. అర్హతలు చూస్తున్న ప్రభుత్వం వేతనాన్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఓవైపు రాష్ట్రంలో కింది స్థాయి ఉద్యోగులకు కనీసం నెలకు రూ.12 వేలు ఉండాలని ఉత్తర్వులిచ్చింది. దీంతో అటెండర్‌కు కూడా ప్రతి నెలా రూ.12 వేలు ఇస్తోం ది. కానీ విద్యా వలంటీర్లకు మాత్రం అవేవీ అమలుకు నోచుకోవడం లేదు.
ఎక్కువున్నారు మేమేం చేస్తాం!
క్లస్టర్ రీసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)లది మరో విచిత్ర పరిస్థితి. సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు కింద కేంద్రం రాష్ట్రానికి 1,750 మంది సీఆర్‌పీలను నియమించుకునే వీలు కల్పించింది. వారికి వేతనాల కింద 60 శాతం నిధులిస్తోంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం డిగ్రీతోపాటు బీఎడ్ చేసినవారినే తీసుకోవాలి. నెలకు రూ.12,500 వేతనం ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో ఒక్కో సీఆర్‌పీకి ఇస్తున్నది రూ.9,500 మాత్రమే. అయితే కేంద్రం ఆదేశాల మేరకు 1,750 మందిని మాత్రమే నియమించాల్సి ఉండగా, 2,500 మందిని తీసుకున్నారని ప్రభుత్వం చెబు తోంది. వచ్చిన మొత్తాన్నే అందిరికీ విభజించి ఇస్తున్నామంది. కాగా, రోజూ ఆరేడు పాఠశాలలు పర్యవేక్షించే తమకు కనీస వేతనాలివ్వాలనే ఆలోచన చేయడం ప్రభుత్వం లేదని సీఆర్‌పీలు వాపోతున్నారు.
విద్యా వలంటీర్‌కు రూ. 8 వేలు...అటెండర్‌కు రూ.12 వేలు
Published Mon, Jun 27 2016 1:16 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement