సిటీలో ప్రయాణికులకు గురువారం నుంచి ఆర్టీసీ టీ–24 టికెట్లను అందుబాటులోకి తేనుంది.
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ప్రయాణికులకు గురువారం నుంచి ఆర్టీసీ టీ–24 టికెట్లను అందుబాటులోకి తేనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టికెట్ల స్థానంలో ఈ టీ–24 టికెట్లను ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ పురుషోత్తం తెలిపారు. ఇవి 24 గంటలపాటు బస్సుల్లో చెల్లుబాటవుతాయి. గతంలో ఉన్న టీఏవైఎల్ టికెట్లు కేవలం 12 గంటలే చెల్లుబాటయ్యేవన్నారు. ఈ టికెట్లు అన్ని బస్సుల్లో కండక్టర్ల వద్ద లభ్యమవుతాయన్నారు. టీ–24 టికెట్ ధర ఏసీ బస్సులయితే రూ.160, నాన్ ఏసీ బస్సులయితే రూ.80 ఉంటుంది.