సిటీకి పండుగ శోభ | sankranti special | Sakshi
Sakshi News home page

సిటీకి పండుగ శోభ

Published Sat, Jan 14 2017 12:21 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

సిటీకి పండుగ శోభ - Sakshi

సిటీకి పండుగ శోభ

సిరులు కురిపించే సంక్రాంతి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు గ్రేటర్‌ సిటీజనులు సిద్ధమయ్యారు. తీరొక్క ముగ్గులు.. వాకిళ్లలో హరివిల్లును సృష్టించగా..రంగు రంగుల పతంగులు ఆకాశంలో ఇంద్రధనుస్సును తలపించాయి. పిల్లాపాపల కేరింతలు..బంధుమిత్రుల కోలాహలం మధ్యన శుక్రవారం పండగ సంబురాలు షురూ అయ్యాయి.

చలిగాలుల తీవ్రతను భోగిమంటలతో సాగదోలిన నగరవాసులు... పలు పిండివంటలతో విందుభోజనాలు చేసేందుకు..ఆనందంగా మరో రెండు రోజులపాటు పండగ సంబరాలు జరుపుకొనేందుకు రెడీ అయ్యారు. మెజార్టీ సిటీజనులు పల్లెబాట పట్టగా..నగరంలో ఉన్నవారు కూడా పల్లెలకు తీసిపోకుండా పండగ జరిపేందుకు ఏర్పాట్లు చేసుకోవడం విశేషం.   –సాక్షి, సిటీబ్యూరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement