రూ.15 కోట్లు ప్రకటించిన బ్రిటిష్ కౌన్సిల్
సాక్షి, హైదరాబాద్: యూకేలో చదవాలనుకున్న భారతీయ విద్యార్థుల కోసం రూ.15 కోట్ల స్కాలర్‌షిప్‌లను బ్రిటిష్ కౌన్సిల్ ప్రకటించింది. ఇంజనీరింగ్, లా, ఆర్ట్ అండ్ డిజైన్, ఐటీ తదితర రంగాల్లోని 59 అండర్ గ్రాడ్యుయేట్, 232 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ల్లో 291 మంది భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని బ్రిటిష్ లైబ్రరీలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లోని 45 యూకే ఇన్‌స్టిట్యూట్స్‌లో అభ్యసించే వారికి స్కాలర్‌షిప్‌లు దక్కనున్నాయని చెప్పారు. సాంస్కృతిక, ద్వైపాక్షిక సంబంధాలు దృఢపడాలన్న ఉద్దేశంతో ‘గ్రేట్ బ్రిటన్ స్కాలర్‌షిప్స్-ఇండియా 2016’ ప్రవేశపెట్టినట్లు వారు వివరించారు.
9న యూకే ఎడ్యుకేషన్ ఫెయిర్..
యూకేలో విద్యావకాశాల గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక విద్యార్థుల కోసం ఈనెల 9న ‘ఎడ్యుకేషన్ యూకే ఎగ్జిబిషన్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్‌లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఇది కొనసాగుతుంది. కోర్సుల ఎంపిక, వీసా అప్లికేషన్లు, స్కాలర్‌షిప్‌లు, వసతి, ఫీజులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. బ్రిటిష్ కౌన్సిల్ దక్షిణ భారత డెరైక్టర్ మీ-క్వీ బార్కర్, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెకల్లిస్టర్ మాట్లాడారు.
భారత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
Published Thu, Feb 4 2016 4:50 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement