'మహంకాళి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తాం' | secunderabad mahankali jatara | Sakshi
Sakshi News home page

'మహంకాళి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తాం'

Published Tue, Jun 14 2016 5:46 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

secunderabad mahankali jatara

రాంగోపాల్‌పేట్: జూలై 24, 25 వ తేదీల్లో జరుగనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఉత్తర మండలం డీసీపీ సుమతి మంగళవారం పరిశీలించారు. మొదటి సారిగా దేవాలయానికి వచ్చిన ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ట్రాఫిక్, పోలీసులు అధికారులతో కలిసి దేవాలయంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆలయ విశిష్టత, ఎంత మంది భక్తులు హాజరవుతారు, క్యూలైన్లు తదితర వివరాలను ఈవో అన్నపూర్ణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement