హిమాన్షు మోటార్స్‌పై కేటీఆర్ అబద్ధాలు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: హిమాన్షు మోటార్స్ మంత్రి కేటీఆర్‌దేనని, అయినా సిగ్గూ శరం లేకుండా అబద్ధాలు చెబుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హిమాన్షు మోటార్స్‌లో మంత్రి కేటీఆర్‌కు వాటాలు ఉన్నాయని, 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విషయాన్ని కేటీఆర్ వెల్లడించారని వివరించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందే హిమాన్షు మోటార్స్ నుంచి వైదొలగినట్టుగా మంత్రి కేటీఆర్ సిగ్గు, శరం విడిచిపెట్టి పచ్చి అబద్ధాలు చెప్పారని షబ్బీర్ అలీ విమర్శించారు. ఈ రోజుకు కూడా కేటీఆర్ దానికి డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు. అబద్ధాలు మాట్లాడిన కేటీఆర్‌కు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. హిమాన్షు మోటార్స్ నుంచి 300 ఇన్నోవాల కొనుగోళ్లలో ఎంత కమీషన్ తీసుకున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు.