బస్ స్టాప్లు, రోడ్లపై మహిళలను వేధించే ఆకతాయిలు, చైన్ స్నాచర్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన షీ టీమ్స్ చురుగ్గా పనిచేస్తున్నాయి.
హైదరాబాద్: బస్ స్టాప్లు, రోడ్లపై మహిళలను వేధించే ఆకతాయిలు, చైన్ స్నాచర్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన షీ టీమ్స్ చురుగ్గా పనిచేస్తున్నాయి. మహిళలకు మరింత రక్షణ కల్పించడం కోసం ఏర్పాటుచేయబడిన షీ టీమ్స్ రోడ్లు, బస్ స్టాప్లు తదితర రద్దీ ప్రాంతాల్లో మప్కీలలో సంచరిస్తూ ఆకతాయిల పనిపడుతున్నారు.
ఇందులో భాగంగా సైబరాబాద్లో శనివారం షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. వారం రోజుల్లో 35 కేసుల్లో 42 మందిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకుంది.