సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఉపయోగించే భాషపై రౌడీషీట్ తెరవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తక్షణమే రోజాను స్పీకర్ ఐదేళ్లపాటు బహిష్కరించాలన్నారు. మహిళలు సిగ్గుతో తలదించుకునేలా రోజా మాట్లాడుతున్నారన్నారు.
చంద్రబాబు ముందు కుప్పిగంతులు వేస్తున్న మందకృష్ణ: గాలి
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణకు నిజంగా ఎస్సీ వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే మాదిగ సామాజికవర్గ ప్రజలు ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సిద్ధిపేట నుంచి ఉద్యమం ప్రారంభించాలని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు సూచించారు. కేసీఆర్ ముందు నోరెత్తే దమ్ములేని మందకృష్ణ.. ఇక్కడ చంద్రబాబు ముందు కుప్పిగంతులు వేస్తున్నారని విమర్శించారు.
రోజాపై రౌడీషీట్ తెరవాలి : సోమిరెడ్డి
Published Tue, Mar 8 2016 3:52 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM
Advertisement
Advertisement