ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందించేందుకు త్వరలో కాకతీయ ఫుడ్స్‌ను ప్రారంభించనున్నామని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. సెంటర్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను గురువారం సందర్శించి అక్కడి శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉద్యాన అభివృద్ధి సంస్థ గిట్టుబాటు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల్లోని ఉద్యాన ఉత్పత్తుల సంస్థలను పరిశీలించేందుకు నూతనంగా ఏర్పడిన ఉద్యాన అభివృద్ధి సంస్థ బృందం పర్యటించనుందన్నారు.
త్వరలో కాకతీయ ఫుడ్స్
Published Fri, Jun 17 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM
Advertisement
Advertisement