అమల నాకు స్ఫూర్తి | special chit chat with ramcharn wife upasana | Sakshi
Sakshi News home page

అమల నాకు స్ఫూర్తి

Published Sat, Aug 23 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

అమల నాకు స్ఫూర్తి

అమల నాకు స్ఫూర్తి

చిట్‌చాట్
 
అపోలో లైఫ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా, మెగాపవర్ హీరో రామ్‌చరణ్ భార్యగా తెలిసిన ఉపాసనలో మూగజీవాల ప్రేమికురాలు దాగుంది. గాయాల పాలైన జంతువులు, వైకల్యంతో బాధపడుతున్న మూగజీవాలకు నిలువ నీడ కల్పిస్తున్నారు. మోటర్‌కార్ స్పోర్ట్స్ ఎంకరేజ్‌మెంట్‌తో పాటు సేఫ్ డ్రైవింగ్  అవేర్‌నెస్‌ని ప్రమోట్ చేసేందుకు అపోలో లైఫ్, ఫోక్స్‌వేగన్.. పోలో కప్ ఆర్ కప్ చాంపియున్ షిప్ ప్రోగ్రామ్‌కు శనివారం హాజరైన ఉపాసన ఇప్పటి వరకు ఎక్కడా రిలీవ్ చేయుని తనలోని రెండో కోణాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.
 జంతువులంటే తనకెంతో ఇష్టమని చెప్పే ఉపాసన.. ఏదో ఆదర్శం కోసం వాటికి ఆశ్రయుం కల్పించలేదని చె బుతున్నారు. ‘మూగప్రాణులకు చోటివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఈ విషయంలో అమల నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. బ్లూక్రాస్ నుంచి శాఖాహార జంతువులెన్నో తెచ్చుకున్నాను. అవిప్పుడు ఎంచక్కా పిల్లలు పెడుతున్నారుు, కుక్కలు, గుర్రాలు ఇలా ఇంట్లో చిన్న జూ ఉందంటే నమ్మండి. ఇంకా స్ట్రీట్ డాగ్స్‌ని కూడా అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాన’ని చెప్పుకొచ్చారు ఉపాసన.

సేఫ్టీ ఫస్ట్

సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి స్పందిస్తూ.. రోడ్ సేఫ్టీపై అవేర్‌నెస్ గురించి పనిచేస్తున్నానని తెలిపారు ఉపాసన. ‘నా బ్రదర్ అనిందిత్‌కు కొంతకాలం కిందట ఓ యూక్సిడెంట్ అయింది. ఆ సంఘటన వాడి కంటే మా అందరికీ ఎక్కువ షాక్ ఇచ్చింది. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు కుటుంబాలు ఎంత బాధపడతాయో నాకు తెలుసు. అందుకే సేఫ్ డ్రైవింగ్ ముఖ్యం. డ్రైవింగ్‌లో ఉన్నవాళ్లు తనతో పాటు చుట్టూ ఉన్నవాళ్ల సేఫ్టీ కూడా ఆలోచించాలి. అందుకే ఈ అంశాన్ని ప్రమోట్ చేస్తున్నాన’ని ఉపాసన తెలిపారు.                          
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement