Ramcaran
-
నా మేనల్లుడు రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ఆస్కార్ పట్టుకున్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే
-
రామ్ చరణ్ షూటింగ్ ఉన్నప్పుడు కిరణ్ ని పోలీసులు పట్టుకొని బయటకు తీసుకొచ్చారు
-
ఆ అలవాటు లేదు
కోలీవుడ్‌లో ఎన్నమో ఏదో లాంటి కొన్ని చిత్రాల్లో నటించినా విజయాలను అందుకోలేకపోయిన రకుల్ ప్రీత్ సింగ్‌ను టాలీవుడ్ యమా గా ఆదరించేస్తోంది. సమంత, కాజల్, తమన్న లాంటి ప్రముఖ తార అవకాశాల్ని ఈ బ్యూటీ ఎగరేసుకుపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. రామ్‌చరణ్ సరసన సమంత నటించాల్సిన అవకాశాన్ని రకుల్‌ప్రీతి తన్నుకుపోయారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ముందు ముందు కాజల్, తమన్న వంటి స్టార్ హీరోయిన్ల అవకాశాలను లాగేసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలంటున్నారు. అయితే నటి రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అలాంటి ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ కాజల్ అగర్వాల్, తమన్న, సమంత లాంటి వారితో తానెప్పుడూ పోల్చుకోలేదన్నారు. ఇంకా చెప్పాలంటే తాను నటించడానికి వచ్చినప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నను చూసి నటనను నేర్చుకున్నట్లు తెలిపారు. వారు తనకంటే చాలా సీనియర్లు అని పేర్కొన్నారు. అందువలన వారంటే తనకు చాలా గౌరవం అని అన్నారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరి అవకాశాల్ని ఎవరు లాక్కోలేదన్నారు. ఇప్పుడు తాను వచ్చాను. అలాగే రేపు మరో నటి రావచ్చన్నారు. సినిమాల్లో ఇది సాధారణ మేనన్నారు. తన శరీరాన్ని అంత ఖచ్చితమైన కొలతలతో సెక్సీగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారా అడుగుతున్నారని తాను జిమ్‌కు వెళ్లితే ఒక పట్టాన బయటకు రానన్నారు. మద్యం తాగడం, పొగ తాగడం లాంటి దురల వాటు తనకు లేదని రకుల్‌ప్రీతి అన్నారు. -
బంధాలను కలిపే గోవిందుడు
కోపాలకు, తాపాలకు, శాపాలకు అతీతమైంది మమకారం. సప్తసముద్రాల అవతల ఉన్నా సరే... అది వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయం ఆ కుర్రాడికి బాగా తెలుసు. అందుకే... దూరమైన బంధాలను కలపాలని కంకణం కట్టుకున్నాడు. దీని కోసం ఆ కుర్రాడు చేసిన సాహసాలేంటి? మనవడిగా, కొడుకుగా తాను సాధించిన విజయాలేంటి? ఇదే ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. కుటుంబ బంధాలే ప్రధానాంశాలుగా రామ్‌చరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పాటల చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ- ‘‘అనుబంధాలు, మమకారాలు... ఇవే మనిషికి అలంకారాలు అని తెలిపే కథాంశమిది. ఇందులో రామ్‌చరణ్ పాత్ర జనరంజకంగా, మెగా అభిమానులు పండుగ చేసుకునేలా ఉంటుంది. రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్, బాబాయిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్, కాజల్‌పై లండన్‌లో పాటలను చిత్రీకరిస్తున్నాం. యువన్‌శంకర్ రాజా ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారు. ఈ నెల 15న పాటలను, అక్టోబర్ 1న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కమలినీ ముఖర్జీ ప్రత్యేక పాత్రత పోషిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ప్రగతి, సత్యకృష్ణన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్స్. -
అమల నాకు స్ఫూర్తి
చిట్‌చాట్ అపోలో లైఫ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా, మెగాపవర్ హీరో రామ్‌చరణ్ భార్యగా తెలిసిన ఉపాసనలో మూగజీవాల ప్రేమికురాలు దాగుంది. గాయాల పాలైన జంతువులు, వైకల్యంతో బాధపడుతున్న మూగజీవాలకు నిలువ నీడ కల్పిస్తున్నారు. మోటర్కార్ స్పోర్ట్స్ ఎంకరేజ్‌మెంట్‌తో పాటు సేఫ్ డ్రైవింగ్ అవేర్నెస్ని ప్రమోట్ చేసేందుకు అపోలో లైఫ్, ఫోక్స్‌వేగన్.. పోలో కప్ ఆర్ కప్ చాంపియున్ షిప్ ప్రోగ్రామ్‌కు శనివారం హాజరైన ఉపాసన ఇప్పటి వరకు ఎక్కడా రిలీవ్ చేయుని తనలోని రెండో కోణాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. జంతువులంటే తనకెంతో ఇష్టమని చెప్పే ఉపాసన.. ఏదో ఆదర్శం కోసం వాటికి ఆశ్రయుం కల్పించలేదని చె బుతున్నారు. ‘మూగప్రాణులకు చోటివ్వడం నాకు ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఈ విషయంలో అమల నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. బ్లూక్రాస్ నుంచి శాఖాహార జంతువులెన్నో తెచ్చుకున్నాను. అవిప్పుడు ఎంచక్కా పిల్లలు పెడుతున్నారుు, కుక్కలు, గుర్రాలు ఇలా ఇంట్లో చిన్న జూ ఉందంటే నమ్మండి. ఇంకా స్ట్రీట్ డాగ్స్‌ని కూడా అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాన’ని చెప్పుకొచ్చారు ఉపాసన. సేఫ్టీ ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి స్పందిస్తూ.. రోడ్ సేఫ్టీపై అవేర్నెస్ గురించి పనిచేస్తున్నానని తెలిపారు ఉపాసన. ‘నా బ్రదర్ అనిందిత్‌కు కొంతకాలం కిందట ఓ యూక్సిడెంట్ అయింది. ఆ సంఘటన వాడి కంటే మా అందరికీ ఎక్కువ షాక్ ఇచ్చింది. ఇలాంటి సందర్భాలు ఎదురైనపుడు కుటుంబాలు ఎంత బాధపడతాయో నాకు తెలుసు. అందుకే సేఫ్ డ్రైవింగ్ ముఖ్యం. డ్రైవింగ్‌లో ఉన్నవాళ్లు తనతో పాటు చుట్టూ ఉన్నవాళ్ల సేఫ్టీ కూడా ఆలోచించాలి. అందుకే ఈ అంశాన్ని ప్రమోట్ చేస్తున్నాన’ని ఉపాసన తెలిపారు.