ఆ అలవాటు లేదు | Rakul preet singh Drinking alcohol, smoking not habit | Sakshi
Sakshi News home page

ఆ అలవాటు లేదు

Published Fri, Apr 10 2015 3:40 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఆ అలవాటు లేదు - Sakshi

ఆ అలవాటు లేదు

కోలీవుడ్‌లో ఎన్నమో ఏదో లాంటి కొన్ని చిత్రాల్లో నటించినా విజయాలను అందుకోలేకపోయిన రకుల్ ప్రీత్ సింగ్‌ను టాలీవుడ్ యమా గా ఆదరించేస్తోంది. సమంత, కాజల్, తమన్న లాంటి ప్రముఖ తార అవకాశాల్ని ఈ బ్యూటీ ఎగరేసుకుపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. రామ్‌చరణ్ సరసన సమంత నటించాల్సిన అవకాశాన్ని రకుల్‌ప్రీతి తన్నుకుపోయారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ముందు ముందు కాజల్, తమన్న  వంటి స్టార్ హీరోయిన్ల అవకాశాలను లాగేసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలంటున్నారు. అయితే నటి రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అలాంటి ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ కాజల్ అగర్వాల్, తమన్న, సమంత లాంటి వారితో తానెప్పుడూ పోల్చుకోలేదన్నారు. ఇంకా చెప్పాలంటే తాను నటించడానికి వచ్చినప్పుడు కాజల్ అగర్వాల్, తమన్నను చూసి నటనను నేర్చుకున్నట్లు తెలిపారు. వారు తనకంటే చాలా సీనియర్లు అని పేర్కొన్నారు.
 
 అందువలన వారంటే తనకు చాలా గౌరవం అని అన్నారు. మరో విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరి అవకాశాల్ని ఎవరు లాక్కోలేదన్నారు. ఇప్పుడు తాను వచ్చాను. అలాగే రేపు మరో  నటి రావచ్చన్నారు. సినిమాల్లో ఇది సాధారణ మేనన్నారు. తన శరీరాన్ని అంత ఖచ్చితమైన కొలతలతో సెక్సీగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారా అడుగుతున్నారని తాను జిమ్‌కు వెళ్లితే ఒక పట్టాన బయటకు రానన్నారు.  మద్యం తాగడం, పొగ తాగడం లాంటి దురల వాటు తనకు లేదని రకుల్‌ప్రీతి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement