బంధాలను కలిపే గోవిందుడు | 'Govindudu Andarivadele' team to move to London | Sakshi
Sakshi News home page

బంధాలను కలిపే గోవిందుడు

Published Tue, Sep 9 2014 1:12 AM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

బంధాలను కలిపే గోవిందుడు - Sakshi

బంధాలను కలిపే గోవిందుడు

కోపాలకు, తాపాలకు, శాపాలకు అతీతమైంది మమకారం. సప్తసముద్రాల అవతల ఉన్నా సరే... అది వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయం ఆ కుర్రాడికి బాగా తెలుసు. అందుకే... దూరమైన బంధాలను కలపాలని కంకణం కట్టుకున్నాడు. దీని కోసం ఆ కుర్రాడు చేసిన సాహసాలేంటి? మనవడిగా, కొడుకుగా తాను సాధించిన విజయాలేంటి? ఇదే ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. కుటుంబ బంధాలే ప్రధానాంశాలుగా రామ్‌చరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం పాటల చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ- ‘‘అనుబంధాలు, మమకారాలు... ఇవే మనిషికి అలంకారాలు అని తెలిపే కథాంశమిది. ఇందులో రామ్‌చరణ్ పాత్ర జనరంజకంగా, మెగా అభిమానులు పండుగ చేసుకునేలా ఉంటుంది. రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్, బాబాయిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం చరణ్, కాజల్‌పై లండన్‌లో పాటలను చిత్రీకరిస్తున్నాం. యువన్‌శంకర్ రాజా ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారు. ఈ నెల 15న పాటలను, అక్టోబర్ 1న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కమలినీ ముఖర్జీ ప్రత్యేక పాత్రత పోషిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ప్రగతి, సత్యకృష్ణన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement