Producer Bandla Ganesh
-
తిరుమలను సందర్శించిన నిర్మాత బండ్ల గణేష్
-
దయాగాడి దండయాత్ర
‘‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర’’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగుతో ‘టెంపర్’ టీజర్ జనవరి 1న విడుదలై, అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 20తో పూర్తవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో సినిమా విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించారు. ఇందులో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌తో చాలా స్టయిలిష్‌గా కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ నాయికగా చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్. -
బంధాలను కలిపే గోవిందుడు
కోపాలకు, తాపాలకు, శాపాలకు అతీతమైంది మమకారం. సప్తసముద్రాల అవతల ఉన్నా సరే... అది వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయం ఆ కుర్రాడికి బాగా తెలుసు. అందుకే... దూరమైన బంధాలను కలపాలని కంకణం కట్టుకున్నాడు. దీని కోసం ఆ కుర్రాడు చేసిన సాహసాలేంటి? మనవడిగా, కొడుకుగా తాను సాధించిన విజయాలేంటి? ఇదే ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. కుటుంబ బంధాలే ప్రధానాంశాలుగా రామ్‌చరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పాటల చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ- ‘‘అనుబంధాలు, మమకారాలు... ఇవే మనిషికి అలంకారాలు అని తెలిపే కథాంశమిది. ఇందులో రామ్‌చరణ్ పాత్ర జనరంజకంగా, మెగా అభిమానులు పండుగ చేసుకునేలా ఉంటుంది. రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్, బాబాయిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్, కాజల్‌పై లండన్‌లో పాటలను చిత్రీకరిస్తున్నాం. యువన్‌శంకర్ రాజా ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారు. ఈ నెల 15న పాటలను, అక్టోబర్ 1న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కమలినీ ముఖర్జీ ప్రత్యేక పాత్రత పోషిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్మెస్ నారాయణ, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ప్రగతి, సత్యకృష్ణన్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్స్. -
చిరంజీవిగారు ఈ సినిమా ఆపేయమనలేదు : నిర్మాత బండ్ల గణేశ్
‘‘మా సినిమాపై మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్లే. వాటిల్లో నిజాలు లేవు. ఇలాంటి రూమర్లు మాకు కొత్తేం కాదు. గతంలో ‘గబ్బర్‌సింగ్’ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ... అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ అఖండ విజయాన్ని అందుకున్నాం. త్వరలో మా ‘గోవిందుడు అందరివాడేలే’తో అదే ఫీట్‌ని రిపీట్ చేయబోతున్నాం’’ అని బండ్ల గణేశ్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విశేషాలు తెలుపడానికి శనివారం బండ్ల గణేశ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్‌కి జర్వం రావడంతో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్‌కి కొంత విరామం ఏర్పడింది. ఇందులో ప్రథమంగా చరణ్ తాతయ్య పాత్ర కోసం రాజ్‌కిరణ్‌ని తీసుకున్నాం. ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం కూడా. రాజ్‌కిరణ్ అద్భుతంగా నటించారు. అయితే... ఆయన నటన తెలుగు నేటివిటీకి దూరంగా ఉందని అనిపించింది. అందుకే... ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నాం. ఈ చిన్న చిన్న అవాంతరాల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగింది. అంతేతప్ప కొంద రు అనుకుంటున్నట్లు చిరంజీవిగారు ఈ చిత్రాన్ని ఆపేయమనలేదు. అసలు ఆయన ఈ సినిమా చూడనేలేదు’’ అని వివరించారు బండ్ల గణేశ్. మొదట వంద రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకున్నామని, ఈ జాప్యం కారణంగా మరో ఎనిమిది రోజులు అదనంగా చిత్రీకరణ జరపాల్సి వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తామని బండ్ల గణేశ్ ప్రకటించారు.