పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు :విద్యాశాఖ | Special programs for schools:education dept | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు :విద్యాశాఖ

Published Sat, Aug 6 2016 1:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Special programs for schools:education dept

ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు
హైదరాబాద్: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయిన సందర్భంగా అన్ని రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు, పాఠశాలల్లో ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల విద్యా శాఖ కార్యదర్శులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 23వ తేదీన అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఒకేసారి జనగణమన గీతాలాపన చేయాలని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం ముసాయిదాపై, డిటెన్షన్ విధానంపై స్పష్టమైన అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలు సూచించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement