నియామక నిబంధనల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు వేగిరం చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో పక్కా బోధ నకు చర్యలు చేపడుతోంది. 5వేల ప్రభుత్వ స్కూళ్ల లో గతేడాది 1వ తరగతిలో ప్రారంభించిన ఇంగ్లిష్ మీడియం తరగతుల విద్యార్థులు ఈసారి రెండో తరగతికి రానుండటం, మళ్లీ ఒకటో తరగతిలో విద్యార్థులు చేరనుండటంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లోని ఉపా ధ్యాయ పోస్టుల భర్తీకి మార్గదర్శకాల రూపకల్ప నకు ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ విష యంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇంగ్లిష్ మీడియం కలిగిన ఒకటి, రెండుతో పాటు ఇతర తర గతుల్లో ఎన్ని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు కొన సాగుతున్నాయన్న వివరాలు ఇవ్వాలని డీఈవోల ను ఆదేశించారు. ఉపాధ్యాయ నియామకాల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారిని ఈ పాఠశాలల కోసం ప్రత్యేకంగా నియమించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ నియామ క నిబంధనల్లో మార్పులు చేయడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న తెలుగు మీడియం టీచర్ పోస్టులను ఇంగ్లిష్ మీడి యానికి మార్పు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంగ్లిష్ మీడియానికి ప్రత్యేక టీచర్లు!
Published Tue, May 2 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
Advertisement
Advertisement