
రోజా పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని చీఫ్ జస్టిస్ ఎదుట రోజా తరఫు న్యాయవాది వాదించారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అవసరం ఉందని, తన సమస్యలను ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకు వివరించారు. దీంతో రోజా పిటిషన్ పై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. వచ్చే శుక్రవారం ఎమ్మెల్యే రోజా పిటిషన్ ను విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.