ఒక్కరోజే 29 పాజిటివ్ కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మళ్లీ స్వైర విహారం చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 59 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. తాజాగా సోమవారం 29 పాజిటివ్ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో 19 మంది హైదరాబాద్ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 9 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
మిగిలిన వారంతా పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులే స్వైన్ ఫ్లూ విస్తరణకు కారణమని, హైరిస్క్ బాధితులు సాధ్యమైనంత వరకు జనసమూహంలోకి వెళ్లక పోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. సమూహంలోకి వెళ్లడం అనివార్యమైతే ముక్కుకు మాస్కు ధరించాలని, తలనొప్పి, జ్వరం, ముక్కు కారడం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్వైన్ ఫ్లూ స్వైర విహారం
Published Tue, Feb 7 2017 4:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM
Advertisement
Advertisement