కేసీఆర్ను కలిసిన తలసాని
హైదరాబాద్ : సనత్ నగర్ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఆయన గురువారం ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. పార్టీ మారేది లేదని, ఒకవేళ ఏదైనా ఉంటే మీడియాకు చెబుతానన్న తలసాని ...కేసీఆర్ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తన కుమార్తె రిసెప్షన్, దసరా పండుగకు ఆహ్వానించేందుకే కేసీఆర్ను కలసినట్లు కొద్దిరోజుల క్రితం తలసాని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో జరిగిన తెలంగాణ టీడీపీ నేతల భేటీకి తలసాని అందరి కంటే ముందే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తలసాని ...తీగల కృష్ణారెడ్డితో కలిసి కేసీఆర్ను కలవటం విశేషం. అయితే భేటీ వివరాలు మాత్రం తెలియరాలేదు.