జిల్లాలపై టాస్క్‌ఫోర్స్ | Task Force on districts | Sakshi
Sakshi News home page

జిల్లాలపై టాస్క్‌ఫోర్స్

Published Tue, Aug 30 2016 1:38 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

జిల్లాలపై టాస్క్‌ఫోర్స్ - Sakshi

జిల్లాలపై టాస్క్‌ఫోర్స్

- సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు: సీఎం కేసీఆర్ నిర్ణయం
- అభ్యంతరాలు, సలహాలు పరిశీలించాకే తుది నిర్ణయం
- దసరా నుంచే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు
 
 సాక్షి, హైదరాబాద్:
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కొత్త జిల్లాల్లో పని విభజన, ఉద్యోగుల కేటాయింపు, పరిపాలన విభాగాల ఏర్పాటు, కొన్ని శాఖల విభజన, పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, వరంగల్, మెదక్ కలెక్టర్లు వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ కమిటీ సభ్యులుగా ఉంటారు.

మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ అధికారులను కూడా కమిటీలో నియమించుకోవాలని సీఎం సూచించారు. సోమవారం సచివాలయంలో కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కొనసాగుతున్న పురోగతి, ముసాయిదాపై వస్తున్న అభ్యంతరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆన్‌లైన్లో, ప్రత్యక్షంగా ప్రజల నుంచి పలు సూచనలు, అభ్యంతరాలు, సలహాలు వస్తున్నాయని, వాటన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దసరా నుంచే కొత్త జిల్లాలతోపాటు కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభమవుతాయని, దీ నికి సంబంధిం చిన పాలనా విభాగాల కూర్పు వేగవంతం కావాలని ఆదేశించారు.

 కొత్త ఉద్యోగులను నియమించుకోండి...
 కొత్త జిల్లాలకు అవసరమైనంత మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శాఖలవారీగా, జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఏ విభాగానికి ఎక్కువ పని ఉంది.. క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఎక్కడ ఉంది.. అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలనే అంశంపై అన్ని ప్రభుత్వ శాఖలు రెండ్రోజుల్లో తమ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రస్తుతమున్న పరిపాలనా విభాగాలను యథావిధిగా కొనసాగించాలా? ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా? అనే విషయంపై కూడా అధికారులు సూచనలు చేయాలని చెప్పారు. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు సమావేశమై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నివేదికను సీఎస్ నాయకత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ పరిశీలిస్తుందని, తర్వాత కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై పాలనా విభాగాల కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
 
 వారికి అన్యాయం జరగొద్దు
 తెలంగాణలో జిల్లా, రాష్ట్రస్థాయి కేడర్ మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నందున ప్రస్తుతం జోనల్ అధికారులకు అన్యాయం జరుగకుండా వారిని పోస్టుల్లో సర్దుబాటు చేయాలని సీఎం సూచిం చారు. అధికారులను జిల్లాలకు కేటాయిం చే క్రమంలో సదరు ఉద్యోగి ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
 
 క్షేత్రస్థాయి ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వండి
 జిల్లా అధికారుల కూర్పులో కొత్త పద్ధతి అవలంబించాలని సీఎం చెప్పారు. ప్రతి శాఖకు జిల్లాస్థాయి హోదా ఉన్న అధికారి ఉండాలన్నారు. నీటి పారుదల శాఖకు నీటి పారుదల అభివృద్ధి అధికారి, ఆర్‌అండ్‌బీకి రహదారుల అభివృద్ధి అధికారి.. ఇలా ప్రతీ శాఖకు ఓ జిల్లా అధికారి ఉండాలన్నారు. జిల్లా అధికారులుగా నియమించే వారికి అధికారాల బదలాయింపు జరగాలన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్య తదితర విభాగాల్లో అవసరాల ప్రాధాన్యం మేరకు ఉద్యోగుల సర్దుబాటు జరగాలన్నారు. సూపర్‌వైజరీ పోస్టుల కన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులే ఎక్కువ అవసరం కాబట్టి.. మం డల స్థాయి అధికారులు, సిబ్బంది నియామకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. ఒకే రకమైన పనితీరు ఉన్న విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి ఒకే అధికారిని నియమించటం సబబుగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement