హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగుతుంది. అన్ని సెంటర్లో పరీక్ష మొదలైంది. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. రెండు పరీక్షలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎడ్యూకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య పేపర్ 1 కు సెట్-1 కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసి విడుదల చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ లలో, ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.