అసెంబ్లీ నుంచి విపక్ష ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్ : మజ్లిస్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి మినహా ప్రతిపక్ష సభ్యులందరిపై సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో విపక్ష సభ్యులను స్పీకర్ మధుసూదనాచారి సోమవారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఎంఐఎం, జానారెడ్డి మినహా, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష, వైఎస్ఆర్ సీపీ సభ్యులు సభ నుంచి సస్పెండ్ అయ్యారు.
సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారంటూ ఈ సమావేశాలు జరిగే అన్నిరోజులు విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు...సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో 'దొంగల రాజ్యం దోపిడి రాజ్యం' అంటూ సస్పెండైన సభ్యులు సభలో నినాదాలు చేశారు. సస్పెండ్ అయిన సభ్యులంతా సభను విడిచి వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు.
సభ నుంచి సస్పెండ్ అయిన సభ్యులు వీరే:
కాంగ్రెస్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి, పద్మావతి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, రాంమ్మోహన్ రెడ్డి, భాస్కరరావు, సంపత్ కుమార్, డీకే అరుణ, వంశీచంద్, పువ్వాడ అజయ్ కుమార్, మాధవరెడ్డి
టీడీపీ : రేవంత్ రెడ్డి, గాంధీ, వివేక్, గోపినాథ్, సాయన్న, రాజేందర్ రెడ్డి,
బీజేపీ: కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, లక్ష్మణ్, ఎన్వీఎస్ ప్రభాకర్
లెప్ట్ : సున్నం రాజయ్య, రవీందర్ కుమార్
వైఎస్ఆర్ సీపీ: పాయం వెంకటేశ్వర్లు