పవర్ పాయింట్ ప్రజంటేషన్పై కేసీఆర్ పునరాలోచన
హైదరాబాద్ : తెలంగాణ సమగ్ర జల వినయోగంపై అసెంబ్లీ వేదికగా నదీ జలాలు, నీటి వాటాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. విపక్షాలు అడ్డుకుంటే తెలంగాణ జల విధాన ప్రకటన ముందుకు సాగదని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ప్రజలకు నేరుగా చేరేలా ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేస్తోంది. సంయుక్త సమావేశానికి బదులుగా మీడియా ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.